Brahmamudi Serial Weekly Episode: బ్రహ్మముడి సీరియల్ ఈ వారం చాలా ఆసక్తిగా జరిగింది. రాజ్, కావ్యల నిర్వాకం వల్లే అపర్ణ, రేవతిని తిట్టిందని ఇందిరాదేవి కోప్పడుతుంది. తనకు చెప్పకుండా ఇదంతా ఎందుకు చేశారని నిలదీస్తుంది. దీంతో కావ్య సారీ చెప్తుంది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయమని అంటుంది. అయితే అక్కడే ఉన్న రేవతి మాత్రం తన తల రాత బాగాలేనప్పుడు ఎవరి ఏమీ అనలేమని కానీ ఆరోజు తాను తొందరపడి పెళ్లి చేసుకోవడానికి కారణం రుద్రానే అని అలాంటి రుద్రాణి కూడా ఇవాళ తనను నిందిస్తుందని రేవతి ఎమోషనల్ అవుతుంది. దీంతో ఇందిరాదేవి కోపంగా ఇదంతా ఆ రుద్రాణి పన్నాగమా..? చెప్తా దాని సంగతి అంటూ లోపలికి వెళ్తుంది. లోపల సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తున్న రుద్రాణిని ఇందిరాదేవి వెళ్లి కొడుతుంది. ఎందుకు కొట్టావని రుద్రాణి అడిగితే ఎప్పుడో నువ్వు చేసిన తప్పు ఇప్పుడు గుర్తుకు వచ్చింది అందుకే కొట్టానని చెప్పి ఇందిరాదేవి వెళ్లిపోతుంది.
తర్వాత రాజ్, కావ్యలు మరో ప్లాన్ చేసి రేవతిని అపర్ణను కలపాలనుకుంటారు. అందుకోసం రేవతి కొడుకు జూనియర్ స్వరాజ్‌ను రంగంలోకి దించుతారు. ఈసారి స్వరాజ్‌ను అపర్ణకు దగ్గర చేయాలని వాడు లేకుండా అపర్ణ ఒక్క క్షణ కూడా ఉండలేని పరిస్తితి తీసుకురావాలని అప్పుడు వాడు రేవతి కొడుకని చెప్తే స్వరాజ్ కోసమైనా అపర్ణ, రేవతిని ఏమీ అనదని ప్లాన్ చేస్తాడు రాజ్. వెంటనే రేవతికి ఫోన్ చేసి బాబును తీసుకుని గుడి దగ్గరకు రమ్మని చెప్తాడు. రేవతి గుడి దగ్గరకు వెళ్లగానే స్వరాజ్‌కు నాటకం గురించి చెప్తారు. రాజ్, కావ్య చెప్పినట్టే గుడికి వచ్చిన అపర్ణకు ఎదురుపడతాడు స్వరాజ్. స్వరాజ్‌ను చూసిన అపర్ణ వాడితో గుడిలో చాలా సేపు ఆడుకుంటుంది. తర్వాత వాళ్ల పేరెంట్స్ తప్పిపోయారని స్వరాజ్‌ను తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది అపర్ణ.
ఇంటికి వచ్చిన జూనియర్ స్వరాజ్‌ను చూసి ఇందిరాదేవి షాక్ అవుతుంది. రుద్రాణి మాత్రం అపర్ణను అనుమానిస్తుంది. గతంలో అన్నయ్య సుభాష్ షాక్ ఇచ్చినట్టు అపర్ణ వదిన ఏమైనా షాక్ ఇవ్వబోతుందా అని రాహుల్ తో అంటుంది. అత్తయ్య అలాంటిది కాదని రాహుల్ చెప్పగానే ఇంట్లోకి వచ్చిన అపర్ణ, స్వరాజ్ గురించి చెప్పి వాళ్ల పేరెంట్స్ వచ్చే వరకు ఇక్కడే ఉంటాడని చెప్తుంది.
ఇక ఇంట్లోనే ఉన్న స్వరాజ్‌ను సొంత మనవడిలా చూసుకుంటుంది అపర్ణ, వాడికి భోజనం తినిపించడం నుంచి అన్ని విషయాలు దగ్గరుండి మరీ చూసుకుంటుంది. అపర్ణ వాడిని ఆడిస్తూ భోజనం తినిపిస్తున్నప్పుడు కావ్య వీడియో కాల్ చేసి రేవతికి చూపిస్తుంది. వీడియో కాల్‌లో స్వరాజ్‌ను చూసిన రేవతి ఎమోషనల్ అవుతుంది. తర్వాత ఇంట్లోకి వెళ్లిన స్వరాజ్ ఇందిరాదేవిని చూసి తాతమ్మ అని పిలవడంతో అందరూ షాక్ అవుతారు. ఎందుకు తాతమ్మ అని పిలిచావు అని రుద్రాణి అడగ్గానే నేను నీకు చెప్పను అంటాడు స్వరాజ్. అయితే నాకు చెప్పు అంటూ అపర్ణ అడిగితే ఇలాంటి ఓల్డ్ ఉమెన్ ఎవరైనా కనబడితే తాతమ్మ అని పిలవాలని మా అమ్మ చెప్పింది అంటాడు స్వరాజ్.
స్వరాజ్ మాటలను రుద్రాణి నమ్మదు వీడు ఎవడో కనిపెట్టాలని డిసైడ్ అవుతుంది. మరుసటి రోజు గార్డెన్ లో వాటర్ పడుతున్న స్వరాజ్ దగ్గరకు వెళ్లి చాక్లెట్ ఆశ చూపించి నిజం చెప్పమని అడుగుతుంది. స్వరాజ్ చెప్పకపోయే సరికి బెదిరిస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన అపర్ణ కోపంగా రుద్రాణిని తిట్టి స్వరాజ్‌ను తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత అప్పు రూంలో ఉన్న కళ్యాణ్‌కు స్వరాజ్ గురించి నిజం చెప్తుంది. తర్వాత అప్పు తనకు స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందని స్వరాజ్ వాళ్ల అమ్మా నాన్న వీడు కనబడటం లేదని కంప్లైంట్ ఇచ్చారట. వీడిని స్టేషన్‌కు తీసుకెళ్తానని చెప్తుంది. అయితే అపర్ణ ఒప్పుకోదు.. తాను స్వరాజ్ పేరెంట్స్‌తో మాట్లాడాకే పంపిస్తాను అంటుంది. దీంతో అప్పు, రేవతికి కాల్ చేసి ఇస్తుంది. అపర్ణ, రేవతితో మాట్లాడిన తర్వాత బాబును పంపించడానికి ఒప్పుకుంటుంది. ఇక చివరిలో కావ్యకు ప్రెగ్నెన్సీ రావడంతో ఈ వారం ఆసక్తికరంగా ఎండ్ అయింది. ఇది ఈ వారం జరిగిన బ్రహ్మముడి కథనం.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!