Brahmamudi Serial Weekly Episode: కావ్యకు ప్రెగ్నెన్సీ వచ్చిందన్న బాధలో ఉండగా అప్పు వచ్చి ఏమైందక్కా అలా ఉన్నావని అడుగుతుంది. దీంతో అప్పుకు నిజం చెప్తుంది కావ్య. కావ్య మాటకు అప్పు హ్యాపీగా ఫీలవుతుంది. ఇంత మంచి శుభవార్త అందరికీ చెప్పకుండా ఎందుకు బాధపడుతున్నావని అడుగుతుంది అప్పు. అయినా మీరెప్పుడు కలుసుకున్నారు అని అడుగుతుంది. దీంతో శ్రీశైలం వెళ్తున్న్ దారిలో కలిశామని ఇప్పుడు రాజ్ తనకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడని ఇలాంటి టైంలో ఇంట్లో వాళ్లకు నేను నిజం ఎలా చెప్పగలను అంటుంది. దీంతో అప్పు ఏదో ఒకటి డిసీజన్ నువ్వు తీసుకో అక్కా నేను మాత్రం రేవతి కొడుకును వాళ్ల దగ్గర వదిలేయడానికి వెళ్తున్నాను అని చెప్పి అప్పు వెళ్లిపోతుంది.
తర్వాత రాజ్ వచ్చి కావ్యను పిలుస్తాడు. బాధగా కావ్య కిందకు వస్తుంది. కావ్య రాగానే రాజ్ తనను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. కావ్య ఏడుస్తుంది. అందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. కావ్య అందరికి షాక్ ఇస్తుంది. రాజ్ ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్తుంది. రుద్రాణి మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది. ఎవరు ఎంత చెప్పినా కావ్య మాత్రం తనకు పెళ్లి ఇష్టం లేదని కరాకండిగా చెప్పేస్తుంది. రాజ్ ఎమోషనల్ అవుతాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి అపర్ణ కావ్యను కొట్టబోతుంది. రాజ అడ్డుపడి బలవంతంగా ఒప్పించేది ప్రేమ ఎలా అవుతుందని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఇంట్లో జరిగిందంతా రుద్రాణి, యామినికి ఫోన్ చేసి చెప్తుంది. యామిని హ్యాపీగా ఫీలవుతుంది.
తర్వాత రాజ్ గార్డెన్‌లో బాధపడుతూ ఉంటే అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి ఓదారుస్తారు. అయినా రాజ్ బాధతో వెళ్లిపోతాడు. దీంతో అపర్ణ, ఇందిరాదేవి కోపంగా కావ్య దగ్గరకు వెళ్లి తిడతారు. దీంతో కావ్య తాను తల్లిని కాబోతున్నాని ఆ నిజం రాజ్‌కు తెలిస్తే ప్రమాదం అని అందుకే ఇలా చేశానని చెప్తుంది. దీంతో అపర్ణ, ఇందిరాదేవి ఎమోషనల్ అవుతూ కావ్యకు సారీ చెప్తారు. మరోవైపు యామిని, రాజ్‌కు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్చాప్ వస్తుంది. దీంతో యామిని కంగారు పడుతుంటే వైదేహి వచ్చి ఓదారుస్తుంది. మరుసటి రోజు రాజ్ ఇంటికి రాలేదని యామిని కోపంగా దుగ్గిరాల ఇంటికి వెళ్లి కావ్య వాళ్లను నిలదీస్తుంది. తన బావను ఏం చేశారని ప్రశ్నిస్తుంది. యామిని కోపంగా కావ్యను తిడుతూ కేసు వేస్తానంటూ బెదిరిస్తుంది.
దీంతో అపర్ణ యామిని మీదే కేసు వేస్తానని తాను తలుచుకుంటే యామిని జైలుకు పంపిస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఎవరు తప్పు చేస్తున్నారో అప్పుడు తెలుస్తుందని అపర్ణ సీరియస్‌గా చెప్పేసరికి యామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కావ్య బాధపడుతుంటే అపర్ణ, ఇందిరాదేవి వచ్చి ఓదారుస్తారు. ఇంతలో రేవతి ఫోన్ చేసి రాజ్ తన దగ్గరే ఉన్నాడని చెప్తుంది. కావ్య వెంటనే రేవతి ఇంటికి వెళ్తుంది. రాజ్‌ను చూసి ఎమోషనల్ అవుతూ కోపంగా తిడుతుంది కావ్య. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు.. లవ్ ఫెయిల్ అయిందని ఏడ్చుకుంటూ వెళ్లి యాక్సిడెంట్ చేసుకోవడానికి.. రాత్రి నుంచి మీరు ఇంటికి రాలేదని యామిని చెప్పేసరికి నా గుండె ఆగినంత పనైంది. మీరు ఏమయ్యారో ఎక్కడున్నారో తెలియక నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా..? ఒక్క మాట ఫోన్ చేసి చెప్పి ఉంటే మీ ఆస్తులు ఏమైనా పోయేవా..? నేను తిడుతుంటే మీరు నవ్వుతున్నారేంటి..? గతంతో పాటు కామన్‌సెన్స్ కూడా మర్చిపోయారా..? అంటూ రాజ్‌ను బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్తుంది.
రాజ్‌ను కాశ్య ఇంటికి తీసుకొచ్చిందని తెలుసుకున్న యామిని అక్కడకు వెళ్తుంది. రాజ్ ఏం తప్పు చేశాడని రాజ్ ప్రేమను అంగీకరించడం లేదని అడుగుతుంది. ఏ కారణం చేత రాజ్ ఫ్రపోజల్‌ను యాక్సెప్ట్ చేయడం లేదో చెప్పమని అడుగుతుంది. తర్వాత కావ్య డ్రామాలు ఆడిందని నిన్ను తన అవసరాలకు వాడుకుందని ఇప్పుడు పెళ్లి అనే సరికి ఒప్పుకోవడం లేదని చెప్తుంది. దీంతో రాజ్, కావ్యను వెనకేసుకొస్తాడు. ఏదో కారణం ఉంటేనే కావ్య ఇలా చేస్తుందని బాధపడతాడు. ఆ కారణం ఏంటో కనుక్కుంటానని చెప్తాడు రాజ్. ఇది ఈ వారం జరిగిన బ్రహ్మముడి కథనం.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!