Brahmamudi Serial Today Episode: కావ్యకు అబార్షన్‌ చేయాల్సి రావొచ్చని డాక్టర్‌ చెప్పగానే అప్పు, కళ్యాణ్‌ షాక్‌ అవుతారు. దీంతో అబార్షన్‌ తప్పా వేరే మార్గం లేదా డాక్టర్‌ అని కళ్యాణ్‌ అడుగుతాడు.

Continues below advertisement


డాక్టర్‌: జనరల్‌గా ఇలాంటి కేసుల్లో బేబీని 9 నెలలు మోయడం కష్టం అందుకే ఏడు నెలలకే డెలివరీ చేయాలి. లేదంటే తల్లి బిడ్డకు ఇద్దరికీ డేంజర్‌


అప్పు:  ఆ బిడ్డ  మీద మా అక్క ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుంతుంది. ఇప్పుడు ఇలా జరుగుతుందని తెలిస్తే మా అక్క చనిపోతుంది డాక్టర్‌. ఫ్లీజ్‌ ఎలాగైనా మా అక్కను ఆ బిడ్డను కాపాడండి..


డాక్టర్‌: అయితే మా సుపీరియర్స్‌ తో మాట్లాడి ఏదైనా ఆప్షన్‌ ఉందేమో తెలుసుకుని చెప్తాను మీరు వెళ్లండి


అని డాక్టర్‌ చెప్పగానే.. అప్పు, కళ్యాణ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతారు. దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, ఇందిరాదేవి డల్లుగా కూర్చుని ఉంటారు. అప్పుడే కావ్య వస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అంటుంది.


అపర్ణ: ఏంటే మమ్మల్ని చూస్తే నీకు వెటకారంగా ఉందా..?


కావ్య: నిజం చెప్తున్నాను అత్తయ్యా నాకు మీలా ఎదురుచూడాల్సిన పని లేదు ఇలా చిటికె  వేశాను అనుకో అలా వచ్చేస్తుంది


ఇందిరాదేవి: అవునా ఏదమ్మా ఒక్కసారి చిటికె వేయ్‌..


కావ్య: ముందు మీకేం కావాలో కోరుకోండి


అపర్ణ: కోరుకోగానే తీసుకురావడానికి నీ దగ్గరేమైనా అల్లా ఉద్దీన్‌ అద్బుత దీపం ఉందా.. లేక ఏమైనా మాయలు ఉన్నాయా ఏంటి..?


కావ్య: మాయో మంత్రమో మీకేం కావాలో కోరుకోండి అంటుంది కావ్య..


ఇందిరాదేవి: నాకు ఆరెంజ్‌ జ్యూస్‌


అపర్ణ: నాకు ఫైనాపిల్‌ జ్యూస్‌


కావ్య: అంతే కదా ఇప్పుడు చూడండి


అని కావ్య చిటికె వేస్తుంది. రాజ్‌ జ్యూసులు తీసుకుని వస్తాడు. కావ్య అవి అపర్ణ, ఇందిరాదేవికి ఇస్తుంది. రాజ్‌ నీకోసం తీసుకొచ్చాను అంటాడు. దీంతో ముగ్గురు కలిసి రాజ్‌ను తిడతారు. ఇంతలో కనకం, మూర్తి వస్తారు. వినాయక చవితి గురించి మాట్లాడుకుంటారు. విగ్రమం రాజ్‌ తయారు చేస్తా అంటాడు. రాజ్ కు కనకం, మూర్తి హెల్ప్‌ చేస్తామంటారు. తర్వాత రాజ్‌ విగ్రమం చేస్తుంటే అందరూ సెటైర్లు వేస్తుంటారు. రాజ్‌ విగ్రహం చేయలేక అలిసిపోతాడు.



ఇందిరాదేవి: ఏంట్రా మనవడా..? పాట పూర్తి అయ్యేలోపు విగ్రహం పూర్తి అయిపోతుందన్నావు..


అపర్ణ: చూస్తుంటే వీడు అయిపోయేలా ఉన్నాడు అత్తయ్యా..


కావ్య: ఏవండి ఇప్పటికైనా ఒప్పుకుంటారా..? విగ్రహం చేయడం అంత ఈజీ కాదని


రాజ్‌:  హలో ఏ పనైనా సరే మధ్యలో వదిలేయడం ఇష్టం లేదు ఈ స్వరాజ్‌కు మీరందరూ వెళ్లిపోండి


కావ్య: ఎందుకని వెళ్లాలి..


రాజ్: నాకు డిస్టబెన్స్‌ గా ఉంది. మీరు ఉంటే..  నేను కాన్‌సంట్రేషన్‌ చేయలేకపోతున్నాను..


అనగానే అందరూ వెళ్లిపోతారు. మూర్తి ఒక్కడే ఉంటాడు. దీంతో మూర్తి, రాజ్‌ చేత విగ్రహం చేయిస్తాడు. విగ్రహం పూర్తి అయ్యాక లోపలి నుంచి కావ్య వస్తుంది. కావ్యను చూసిన మూర్తి పక్కకు వెళ్లిపోతాడు. కావ్య వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. ఇద్దరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు. అప్పుడే హాస్పిటల్‌ నుంచి వచ్చిన అప్పు వాళ్లను చూసి మరింత బాధపడుతూ లోపలికి వెళ్లి దేవుడి ముందు నిలబడి ఎమోషనల్ అవుతుంది. కళ్యాణ్‌ వెళ్లి అప్పును ఓదారుస్తాడు.. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!