Brahmamudi Serial Today Episode: రాజ్ కావ్యను నేను కావాలా..? నీకు నీకు బిడ్డ కావాలా అని అడగ్గానే.. మీ నిర్ణయం మీదైనప్పుడు.. నా నిర్ణయం కూడా చెప్తాను వినండి నాకు మీకన్నా నా బిడ్డే ముఖ్యం అని చెప్పి వెళ్లిపోతుంది. రాజ్ కోపంగా బయటకు వెళ్లిపోతాడు.
అపర్ణ: ఏంటండి ఇదంతా వీడు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాడంటే వీడు చెప్పేది నిజమైన కారణం కాదేమో అనిపిస్తుంది వేరే ఏదో కారణం ఉందేమో..?
సుభాష్: ఇలాంటి కొడుకు మన కడుపున పట్టాలని రాసి పెట్టి ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అపర్ణ.
రాజ్ దగ్గరకు కళ్యాణ్ వెళ్తాడు.
కళ్యాణ్: అన్నయ్యా ఫ్లీజ్ ఇప్పటి వరకు జరిగింది చాలు. అందరినీ బాధపెట్టి అందిరి చేత మాట అనిపించుకుని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదన్నయ్యా.. ఇంక నీ మౌన వ్రతాన్ని వదిలేసి ఇప్పటికైనా వదినకు నిజం చెప్పేసెయ్..
రాజ్: మీ వదిన ఒప్పుకుంటుందా..? తన కడుపులో పెరుగుతున్న బిడ్డను వద్దనుకుంటుందా..? ఇందాక తను ఎలా మాట్లాడిందో విన్నావు కదా..? కారణం చెప్పకుండానే అలా రియాక్ట్ అయిన కళావతి.. నిజం చెబితే ఇంకెలా రియాక్ట్ అవుతుందో ప్రాణం పోయినా పర్వాలేదు నా బిడ్డకు ప్రాణం పోస్తాను అంటుంది.
కళ్యాణ్: కానీ అన్నయ్యా వదినకు నిజం చెప్పకుండా ఇంకెంత కాలం అలాగే ఉండగలం చెప్పు.. సూదిని మూట కట్టినంత మాత్రాన అది దాగుతుందా..? అది ఏదో ఒకలాగా బయటకు వస్తుంది. నిజం బయటపడక ముందే.. నువ్వే నిజం చెప్పడం బెటర్ అన్నయ్యా..
రాజ్: లేదు కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కళావతికి నిజం తెలియకూడదు.. కనీసం ఇప్పుడు ఏదో ఒక రకంగా అయినా తనను కాపాడుకోగలను అన్న ధైర్యం ఉంది. కానీ నిజం తెలిస్తే అసలు కాపాడుకోలేము
కళ్యాణ్: కానీ అన్నయ్య పరిస్థతి చూస్తుంటే వదిన మాట వినడం లేదు.. ఇప్పుడు ఎలా అన్నయ్య..
రాజ్: దానికి నేను ఒక ప్లాన్ చేశాను. పద వెళ్దాం
ఇద్దరూ కలిసి మెడికల్ షాపు దగ్గరకు వెళ్తారు.
రాజ్: డాక్టర్ సుధాకర్ ఎప్పుడూ మెడిసిన్స్ తీసుకునేది ఇక్కడి నుంచే నేను నీకు మెసేజ్ చేసిన మందులు చూపిస్తూ.. డాక్టర్ సుధాకర్ తీసుకురమ్మన్నాడని తీసుకురాపో కళ్యాణ్.
కళ్యాణ్: భయం వేస్తుంది అన్నయ్య.. పైగా ఇలా చేయడం చట్టరీత్యా నేరం.. వదినకు ఈ నిజం తెలిస్తే.. మనల్ని జీవితాంతం క్షమించదు..
అంటూ ఎమోషనల్ అవుతుంటే.. అరేయ్ నువ్వు వెళ్తావా..? నన్ను వెళ్లమంటావా… అని రాజ్ సీరియస్ అవ్వగానే.. కళ్యాణ్ మెడికల్ షాపులోకి వెళ్తాడు. మరోవైపు గార్డెన్‌లో ఉన్న కావ్య దగ్గరకు ఇందిరాదేవి అపర్ణ వస్తారు.
అపర్ణ: కావ్య ఎక్కడ తాళి బంధానికి బెండ్ అవుతావేమోనని అనుకున్నాను కానీ బిడ్డ కావాలని చెప్పావు. వాడిప్పుడు అబార్షన్ ఎలా చేయిస్తాడో చూస్తాను నా పుల్ సపోర్ట్ నీకే
ఇందిరాదేవి: అపర్ణ పెద్ద దానివై ఉండి సర్ది చెప్పాల్సింది పోయి అలా మాట్లాడతావేంటి..?
అపర్ణ: మరి లేకపోతే ఇంకెలా మాట్లాడాలి అత్తయ్యా ఆకలితో అలిగాడంటే తల్లిగా బుజ్జగించేదాన్ని.. కానీ ఒక తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డనే వద్దు అంటున్నాడు అంటే ఇలా కాకుండా ఎలా మాట్లాడాలి అత్తయ్యా.. కొడుకుగా తప్పు చేస్తానంటే క్షమిస్తాను అత్తయ్యా.. కానీ ఇంకొక తల్లికి అన్యాయం చేస్తానంటే మాత్రం అసలు క్షమించను అత్తయ్య
ఇందిరాదేవి: అపర్ణ వాడు తన భర్త ఆ విషయం మర్చిపోతున్నావు..
అపర్ణ: భర్త అయినంత మాత్రాన దాని మీద అన్ని హక్కులు వాడికే ఉంటాయా..? భార్యగా దానికి ఏ హక్కు అధికారం ఉండదా..? వాడేం చెప్తే దానికి సరే అంటూ గంగిరెద్దులా తలూపాలా.? అయినా వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా అత్తయ్యా.. ఈ విషయంలో వాడు ఏం చేసినా సరే నువ్వు మాత్రం నీ నిర్ణయాన్ని మార్చుకోకు కావ్య
అంటూ అపర్ణ వెళ్లిపోతుంది.
ఇందిరాదేవి: అమ్మా కావ్య ఈ విషయంలో నా మనవడు చెప్పినట్టు నడుచుకో అని చెప్పను.. తల్లిగా ఆ బిడ్డ విషయంలో పూర్తి హక్కులు నీకే ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో నీ ఇష్టం..
కావ్య: లేదు అమ్మమ్మ గారు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కాదు.. ఈ విషయంలో ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి
ఇందిరాదేవి: ఏంటి కావ్య నువ్వు చెప్పేది..
కావ్య: అవును అమ్మమ్మ ఆయన ఎలాంటి వారో మనకు తెలుసు.. ఆయనది చీమకు కూడా అపకారం చేయని మనస్తత్వం. అలాంటి తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే.. కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అమ్మమ్మ. అదేంటో తెలుసుకుంటే.. ఆయనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో తెలిసిపోతుంది.
అని చెప్పగానే ఇందిరాదేవి అవును అదేదో త్వరగా తెలుసుకో కావ్య అని చెప్తుంది. ఇక మెడికల్ షాపులోకి వెళ్లిన కళ్యాణ్ అబార్షన్ మెడిసిన్స్ తీసుకుని వచ్చి రాజ్‌కు ఇచ్చి ఎమోషనల్ అవుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. కావ్య రూంలో చిన్న పిల్లల ఫోటోలు అతికిస్తుంటే.. రాజ్ చూసి వెళ్లిపోతాడు. ఇందిరాదేవి వచ్చి ఈ పని ఎందుకు చేస్తున్నావు రాజ్ మనసులో ఏముందో తెలుసుకో అని చెప్తుంది. కావ్య సరే అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!