Brahmamudi Serial Today Episode: రూంలో తన పక్కన కూర్చున రాజ్‌ను చూసి నిద్ర లేస్తుంది కావ్య. ఏంటి ఒక్కరే కూర్చుని ఆలోచిస్తున్నారు. కడుపులో నీ బిడ్డను నేను ఎలా చూసుకుంటున్నానో అని అడుగుతున్నారా..? అంటుంది. పిల్లలు పుట్టగానే మీకు భార్యలు మీద ప్రేమ తగ్గిపోతుంది కదా అంటుంది.

Continues below advertisement


రాజ్‌: ఇప్పటికి ఇంకా ప్రాణం పోసుకోని ఆ బిడ్డ మీద మనం అంతలా ప్రేమ పెంచుకోవడం ఎందుకు చెప్పు


కావ్య: ఏవండి నేనేదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టించాలనుకుంటే మీరు కూడా అలా మాట్లాడతారేంటి..?  ఈ బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపం అండి మీరైనా నేనైనా ఎదురుచూస్తుంది దీని కోసమేగా..


రాజ్‌: ఎదురుచూడటంలో తప్పు లేదు కళావతి.. ఈ మధ్య నెల తప్పిన వాళ్లు కూడా మిస్‌ క్యారీ అవుతున్నారు. అందుకే చెప్తున్నాను అప్పుడే ఆ బిడ్డ మీద మనం అంత అటాచ్‌ మెంట్‌ పెంచుకోవడం మంచిది కాదు.


కావ్య: ఏంటండి మీరు అంతా మంచి జరుగుతున్న సమయంలో అపశకునం మాట్లాడతారు. మన బిడ్డకు ఏం కాదు. దీన్ని నేను ప్రాణం పెట్టైనా సరే కాపాడుకుంటాను. లాస్ట్‌ టైం నేను హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు కూడా డాక్టర్‌ అంతా బాగుందనే చెప్పారు.. కాబట్టి మీరు కంగారు పడాల్సిందేమి లేదు.


రాజ్‌: కళావతి ఇప్పటివరకు నేను నా ఆవేశంతో నిన్ను చాలా బాధపెట్టాను.. నీకు చాలా దూరంగా వెళ్లిపోయాను.


కావ్య: ఏవండి.. సంతోషంగా ఉన్న టైంలో ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు.. అసలు ఏమైంది మీకు..? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు.


రాజ్‌: నన్ను పూర్తిగా చెప్పనిస్తావా… రేపు ఎప్పుడైనా మన మధ్య మళ్లీ అలాంటి గొడవలు కానీ.. అపార్థాలు కానీ వస్తే నన్ను విడిచిపెట్టి వెళ్లిపోవు కదా..? ఒకవేళ నేను ఏదైనా తప్పులు చేసినా నన్ను అర్థం చేసుకుంటావు కదా.. ? నా తప్పులను క్షమించి నాతోనే ఉంటావు కదా..?


కావ్య: బాబోయ్‌ మీకేదో అయింది.. అయినా తెలిసి.. తెలిసి..మీరెందుకు తప్పు చేస్తారు..


రాజ్‌: ఒకవేశ చేయాల్సి వస్తే..


కావ్య: అర్థం చేసుకుంటాను.. మీరు ఎన్నోసార్లు నన్ను ఇంట్లోంచి వెళ్లిపోమ్మని డైరెక్టుగా చెప్పినా కూడా నేను వెళ్లిపోలేదు..


అంటూ కావ్య ఎమోషనల్‌ అవుతుంటే రాజ్‌ కూడా కావ్యను హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. రేపు మనం హాస్పిటల్ కు వెళ్దాం అని చెప్తాడు. కావ్య సరే అంటుంది. మరునాడు ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతారు ప్రకాష్‌, సుభాష్‌. వాళ్లను చూసిన ఇందిరాదేవి హ్యాపీగా ఫీలవుతుంది.


ఇందిరాదేవి: మీ ఇద్దరిని చూస్తుంటే.. రామలక్ష్మణుల్లా ఉన్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు..?


సుభాష్‌: ఆఫీసుకు వెళ్తున్నాం అమ్మా


ఇందిరాదేవి: మీరు ఇద్దరు వెళ్తున్నారా..?


సుభాష్‌: అవును అమ్మా మీ మనవడిని చూశావుగా ఆఫీసుకు వెళ్లమంటే ఎంత గొడవ చేశాడో చూశావు కదా..? అందుకే వాణ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేమిద్దరమే వెళ్తున్నాము


రుద్రాణి: అంతేలే అన్నయ్యా కన్నారు కదా ఇక తప్పుతుందా..? ఇన్ని రోజులు ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటే ప్రాబ్లం దేశంలోనే ఉందనుకున్నాను. కానీ మనుషుల్లోనే ఉందని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది


ఇందిరాదేవి: అంటే ఏంటే నీ ఉద్దేశం


రుద్రాణి: ఏముంది చేస్తా అనే వాళ్లకు పని ఇవ్వరు చేయను అనే వాళ్లకు లీవ్‌ ఇవ్వరు. అయినా మిమ్మల్ని అని ఏం లాభం లేండి.. మా కర్మ అలా ఉంటే.. అయినా మీ అందరూ బాగానే ఉంటారు. అన్యాయం జరిగేది నా కొడుక్కి కదా..?


అప్పు: ఇప్పుడు రాహుల్ కు ఏమైంది రుద్రాణి గారు బాగానే ఉన్నాడు కదా


ఇందిరాదేవి: ఏంటి రుద్రాణి నిన్న రాజ్‌ వాడికి ఆఫీసు బాధ్యతలు ఇవ్వనన్నాడని ఏడుస్తున్నావా..?


స్వప్న: అసలు రాజ్‌ చేసింది కరెక్టే..


రుద్రాణి: ఓసేయ్‌ నువ్వు వాడి భార్యవా..? లేక శత్రువువా..?


స్వప్న: నేను న్యాయంగా మాట్లాడతా..? ఇంతకు ముందు కంపెనీ బాధ్యతలు ఇస్తే నీ కొడుకు తప్పుల మీద తప్పులు చేసి కంపెనీని అప్పుల పాలు చేశాడు


అంటూ తిట్టగానే ఇందిరాదేవి కూడా తిడుతుంది. దీంతో రుద్రాణి అలిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో అపర్ణ హారతి తీసుకొచ్చి సుభాష్‌, ప్రకాష్‌ కు ఇస్తుంది. రాజ్‌, కావ్య లోపలి నుంచి వచ్చి హాస్పిటల్‌కు వెళ్తున్నామని చెప్తారు. హారతి తీసుకోమని చెప్పగానే.. కావ్య హారతి తీసుకుంటుంటే ఆరిపోతుంది. అపర్ణ భయపడుతూ హాస్పిటల్‌కు వెళ్లొద్దని అంటుంది. రాజ్‌ మాత్రం కావ్యను తీసుకెళ్తాడు. రూంలోకి వెల్లిన కళ్యాన్‌ దగ్గరకు అప్పు వెళ్లి అక్కకు నిజం చెప్పకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాడా బావగారు అని అడుగుతుంది. అవునని కళ్యాన్‌ చెప్పగానే.. అప్పు కోప్పడుతుంది. మరోవైపు హాస్పిటల్‌కు వెళ్లిన రాజ్‌ ఎమోషనల్ అవుతూ కావ్యను కిస్‌ చేసి ఒక్కడే డాక్టర్‌ దగ్గరకు వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!