Brahmamudi Serial Today Episode: తాను ఎంత దూరం పెట్టినా తనను కావ్య మనఃస్పూర్తిగా ప్రేమించిందని కావ్య దగ్గరకు వెళ్లి రాజ్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు. ఎలా ప్రేమించగలిగావు.. ఇప్పటికీ కూడా నీ ప్రేమే గొప్పదని నిరూపించుకున్నావు అంటూ రాజ్‌ బాధపడుతుంటాడు.

Continues below advertisement


రాజ్: ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా భార్యగా అంగీకరించాలని నేనేదో గొప్పవాణ్ని అనుకున్నాను. రెండు కుటుంబాల పరువు కాపాడటం కోసం తల వంచుకుని తాళి కట్టించుకుని ఈ ఇంటికి వచ్చి ఈ కుటుంబంలోని అందరి మనస్సులు గెలుచుకున్నావు. నా కోపాన్ని సహించావు. నా మూర్ఖత్వాన్ని భరించావు. అఖరికి నేను చనిపోయానని సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. బతికే ఉన్నానని నమ్మి తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేసి మళ్లీ నీ ప్రేమే గొప్పది అనేలా చేశావు. గతాన్ని మర్చిపోయి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని ఏ భర్త వేయని నింద వేసినా కేవలం నా ప్రాణం కాపాడటం కోసం మౌనంగా భరించావు. నీ ఆత్మాభిమానన్ని నా ప్రాణానికి పణంగా పెట్టేశావు. కన్నతల్లే నేను నీ మీద వేసిన నిందలను తట్టుకోలేక నోరు జారి నిజం చెప్పేసినా నువ్వు మాత్రం మౌనంగా నిలబడ్డావు. ఎందుకు కళావతి ఎందుకు ఇదంతా చేస్తున్నావు.. అందుకే ఇప్పుడు చెప్తున్నాను కళావతి కొండంత నీ ప్రేమ ముందు నా ప్రేమ అణువంతం నీ ముందు ఓడిపోయింది కళావతి. గతంలో నేను చేసిన తప్పులను క్షమిస్తావా..? తిరిగి నన్ను అంతే ప్రేమిస్తావా..?


అని రాజ్‌ ఏడుస్తూ అడగ్గానే కావ్య కూడా ఏడుస్తూ వెళ్లి రాజ్‌ను హగ్‌ చేసుకుంటుంది. మీరు అంతలా మాట్లాడొద్దని చిరు కోపం చూపిస్తుంది. దీంతో రాజ్‌ హ్యాపీగా ఫీలవుతాడు. రుద్రాణి దగ్గరకు బెగ్గర్‌ లాగా వెళ్తాడు రాహుల్‌.


రుద్రాణి:  ఏయ్‌ ఆపురా.. ఏంటిది..?


రాహుల్‌: ఏంటి పాట నచ్చలేదా మామ్‌ అయితే ఇంకోటి పాడనా..?


రుద్రాణి: ఏం అక్కర్లేదు.. అయినా చేతిలో ఈ బొచ్చేంటి… ఆ పాటేంటి.. ఏదో అడుక్కునే వాడిలాగా నీకేమైనా పిచ్చిపట్టిందా..?


రాహుల్‌: పిచ్చి నాకేం పట్టలేదు మామ్‌ ఇప్పుడే నాకోక పిచ్చి క్లారిటీ వచ్చింది.


రుద్రాణి: ఏమని వచ్చింది


రాహుల్‌: మన ఫ్యూచర్‌ ఇదే అని ఇంకొద్ది రోజులు ఆగామంటే. అప్పుడు ఇంట్లో వాళ్లు నీకో బొచ్చ నాకో బొచ్చ ఇచ్చి  ఏ గుడి మెట్ల దగ్గరో అడుక్కోమని గెంటేస్తారు. అప్పుడు ఇద్దరం కలిసి అడుక్కుంటాము.


రుద్రాణి: చెప్పు తీసి కొడతా చెత్త నా కొడకా.. మనకు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందిరా..? నువ్వు ఈ దుగ్గిరాల ఇంటి వారసుడివిరా..! వందల కోట్ల ఆస్థికి అధిపతివి నువ్వు.. సుఫ్రీంవి నువ్వు


రాహుల్‌:  ఇదిగో ఇలాంటి మాటలు చెప్పే నన్ను ఇలా తయారు చేశావు. చక్కగా ఎలాంటి ఆశలు ఏ కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉన్న వాడిని తీసుకొచ్చి ఈ ఇంటి వారసుడిని.. కంపెనీకి అధిపతిని చేస్తానన్నావు. కనీసం క్లర్క్‌ ను కూడా చేయలేకపోయావు.  ఇప్పుడేమో సుఫ్రీం అంటున్నావు.. కనీసం సూప్‌ తాగడానికి కూడా డబ్బులు లేవు


రుద్రాణి: వస్తాయి రాహుల్‌ టైం వచ్చినప్పుడు అన్ని వాటంతట అవే వస్తాయి. నువ్వు చూస్తూ ఉండు ఎప్పుడేం చేయాలో నేను చూసుకుంటాను.


రాహుల్:  ఏంటి నువ్వు చూసుకునేది ఏపిసోడ్‌ వన్‌ నుంచి చూసుకుంటాను చూసుకుంటాను అంటున్నావు. ఇప్పటికే 800 ఏపిసోడ్స్‌ ఎగిరిపోయాయి. ఇప్పుడూ సేమ్‌ డైలాగా..? ఇప్పటి వరకు రాజ్‌ లేకపోతేనే ఏమీ చేయలేకపోయావు.. ఇప్పుడు రాజ్‌  తిరిగి వచ్చేశాడు. కావ్య కడుపులో వారసుడు పెరుగుతున్నాడని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఆ వారసుడు బయటకు వస్తే మనల్ని బయటకు గెంటేస్తారు


రుద్రాణి: అందాక రాణిస్తే నేను రుద్రాణిని  ఎందుకు అవుతాను రాహుల్‌. చచ్చాడనుకున్న రాజ్‌ తిరిగొచ్చినా… తన భార్యను తాను మళ్లీ గుర్తు పట్టినా డోంట్‌ కేర్‌ నిన్ను ఈ ఇంటి వారసుణ్ని చేస్తానని మాటిచ్చాను చేసి చూపిస్తాను..


రాహుల్‌: అలా చేస్తే ఆ రాజ్‌ గాడు చూస్తూ ఊరుకుంటాడా మామ్‌


రుద్రాణి: ఊరుకోడు కచ్చితంగా ఊరుకోడు.. అందుకే నిన్ను వారసుణ్ని చేయడానికి ముందే వాళ్లను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను.


అని చెప్తుంది రుద్రాణి. తర్వాత రాజ్‌, కావ్యను మెట్ల మీద నడవొద్దని ఎత్తుకుని వెళ్లడం అప్పు, కళ్యాణ్‌ చూస్తారు. అప్పు కూడా తనను అలా ఎత్తుకుని పైకి తీసుకెళ్లమని అడుగుతుంది. కళ్యాణ్‌ బలవంతంగా అప్పును పైకి తీసుకెళ్తాడు. రోజూ ఈ పైకి మోసే భారం తగ్గాలంటే ఏం చేయాలని రాజ్‌, కళ్యాణ్‌ ఆలోచిస్తారు. కింద రూముల్లో ఉన్న అమ్మానాన్నలను పైకి పంపిద్దాం అని ప్లాన్‌ చేస్తారు. టూర్‌ ప్లాన్‌ చేశామని అబద్దం చెప్పి వారిని పైకి వెళ్లండి అని చెప్తారు. వాళ్లు షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!