Brahmamudi Serial Today Episode: పంతులును పక్కకు పంపించి తాను తీసుకొచ్చిన పౌడర్ తీర్థంలో కలిపి హ్యాపీగా లేచి తిరిగి చూస్తుంది. వెనక జూనియర్ స్వరాజ్, కనకం చూస్తూ ఉంటారు. వాళ్లను చూసిన రుద్రాణి షాక్ అవుతుంది.
రుద్రాణి: వీళ్లేంటి నన్ను ఇలా చూస్తున్నారు.. కొంపతీసి నేను తీర్థంలో పౌడర్ కలిపింది చూశారా ఏంటి..? ( మనసులో అనుకుంటూ) ఏంటి నా వైపు అలా చూస్తున్నారు..
కనకం: నువ్వు చేసిన పనికి
రుద్రాణి: ( మనసులో) డౌటే లేదు.. వీళ్ల వాలకం చూస్తుంటే కచ్చితంగా చూసేసినట్టే ఉన్నారు
స్వరాజ్: ఏంటి తప్పు చేశానని భయపడుతున్నావా..?
రుద్రాణి: నేనా నేను తప్పు చేయడం ఏంటి.. ? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు
స్వరాజ్: నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలయదా..? ఏం చేస్తున్నావు ఇక్కడ..?
రుద్రాణి: నేనా నేనేం చేయట్లేదే..
స్వరాజ్: నేను ఇందాక ఏం చెప్పాను.. జ్యూస్ ఇవ్వమని అడిగాను కదా.? ఈ ఇంటి వారసుడు జ్యూస్ అడిగితే ఇవ్వాలని తెలియదా..?
రుద్రాణి: ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు.. ఇది నా ఇల్లు.. నా ఇష్టం.. నాకు పని చేయాలనిపిస్తే చేస్తాను లేదంటే కాలీగా తిరుగుతాను.. అయినా నువ్వు ఓనర్ అనుకుంటున్నావా..?
కనకం: అవును నా డార్లింగ్ ఇప్పుడు ఓనరే.. ఇందాక వదిన ఏం చెప్పిందో విన్నావు కదా.?
రుద్రాణి: ఏంటి డార్లింగా..? ఇదెప్పుడో
స్వరాజ్: అవును నేను తనకు డార్లింగ్.. తను నాకు డార్లింగ్.. అయినా నాకు జ్యూస్ తెస్తావా..? నా ఫ్రెండ్‌కు చెప్పనా..
అనగానే సరే ఉండు.. నేను పౌడర్ కలిపింది చూడలేదు అన్నమాట అని మనసులో అనుకుని రుద్రాణి వెళ్లిపోతుంది. గణపతి పూజ చేస్తారు. పూజ అయిపోయాక కావ్య హారతి ఇస్తుంటే.. అపర్ణ తాను ఇస్తానని తీసుకుంటుంది. అందరూ హారతి తీసుకుంటారు.
పంతులు: ఇక అందరూ తమ కోరికలు వినాకుడికి విన్నవించుకుంటూ దండం పెట్టుకోండి
అపర్ణ: ఓరేయ్ ఫ్రెండ్ అంత సేపు మొక్కావు ఏం కోరుకున్నావు.
స్వరాజ్: మనం కోరుకున్న కోరికలు బయటకు చెప్పకూడదు ఫ్రెండు..
అపర్ణ: నేను నీ ఫ్రెండే కదా చెప్పొచ్చులే..
స్వరాజ్: నేను ఎప్పటికీ ఈ ఇంటిలోనే ఉండిపోవాలని కోరుకున్నాను..
అపర్ణ: అయితే లైఫ్‌లాంగ్ ఉంటావా..? ఏమ్మా మా ఇంట్లోనే ఉంచుతావా..?
ఇందిరాదేవి: ఏంటి అపర్ణ అలా అడగొచ్చా…? వాళ్లు ఏమనుకుంటారు..?
రేవతి ఏడుస్తూ బయటకు వెళ్లిపోతుంది. వెనకాలే రాజ్ వెళ్తాడు. ఏడుస్తున్న రేవతి ఓదారుస్తాడు. ఇంతలో పంతులు తీర్థం అందరూ తీసుకుందురు రండి అని పిలుస్తాడు.. పంతులు తీర్థం ఇస్తుంటే.. స్వరాజ్ ముందు నాకు అంటూ వెళ్లి పంతులును తగులుతాడు. తీర్థం మొత్తం కింద పడిపోతుంది. రుద్రాణి కోపంగా స్వరాజ్‌ను తిడుతుంది.
రుద్రాణి: ఏరా ఉన్న వాడివి ఒక్కచోట ఉండలేవా..? తీర్థం మొత్తం ఎలా ఒలికిపోయిందో చూడు
రేవతి: ఏదో చిన్న పిల్లాడు తప్పై పోయింది. క్షమించండి.
రుద్రాణి: ఏంటి చిన్న పిల్లాడా..? ఇలా పరాయి వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా..? నీకు ..
అపర్ణ: రుద్రాణి ఏంటా మాటలు ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగేనా మాట్లాడేది.
రుద్రాణి: అది కాదు వదిన తీర్థం అలా కింద పడిపోతే ఇంటికి ఎంత అరిష్టం.
ఇందిరాదేవి: అని నీకు ఎవరు చెప్పారే.. తీర్థం కింద పడితే అరిష్టం.. పిల్లి ఎదురొస్తే కష్టం.. బల్లి మీద పడితే ప్రమాదం అని మన హిందూ ధర్మాలలో ఎక్కడా చెప్పబడలేదు ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పు
రుద్రాణి: సారీనా నేనా నెవర్ చెప్పను..
రేవతి: పర్వాలేదు నాన్నమ్మ గారు తప్పు మాదే నేనే బాబును జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోసారి అలా జరగదు..
అపర్ణ: ఏంటి రాధ అలా మాట్లాడతావు.. చిన్న పిల్లాడు అన్నాక అల్లరి చేయాలి. ఆట పట్టించాలి. అదే కదా వాడికి ఆనందం.. పైగా వీడెవడు నా ఫ్రెండ్.. వీడు ఏం చేసినా రైటే.. ఈ ఇంట్లో ఎవ్వరూ తప్పు పట్టడానికి వీలులేదు..
స్వరాజ్: ఆ విషయం ముందు మీ రుబ్బురోలుకు చెప్పు
రుద్రాణి: ఎవ్వడ్రా రుబ్బు రోలు వేలేడంత లేవు నాకే పేరు పెడతావా..?
కనకం: ఏంటి రుద్రాణి ఇది.. నీ గొడవలకు చిన్నా పెద్ద తేడా లేదా..? ఆఖరికి ఆ చిన్న పిల్లాడి చేత కూడా మాట అనిపించుకోవాలా..?
ఇందిరాదేవి: మా రుద్రాణికి మాట పడనిదే ముద్దు దిగదులే కనకం
సీతారామయ్య: రుద్రాణి పిల్లలు దేవుడికి ప్రతిరూపాలు అంటారు. వీడి చేత ఏ మంచి కోసం విఘ్నేశ్వరుడు అలా చేయించాడో మనకేం తెలుసు..
అనగానే.. రుద్రాణి, రాహుల్ అలిగి వెళ్లిపోతాడు.
రాహుల్: ఏంటి మమ్మీ మనం అనుకున్న ప్లాన్ ఇలా ఫెయిల్ అయింది
రుద్రాణి: చెప్పాను కదా మనం ఇంకా గట్టిగా ఆలోచించాలి.. ముందు ఆ కావ్య సంగతి కాదు.. ఇంటికి వచ్చిన అతిథి గురించి ఆలోచించాలి
అంటూ రుద్రాణి కొత్త ప్లాన్ వేస్తుంది. తర్వాత కిచెన్‌లోకి వెళ్లిన కావ్యను వెనక నుంచి వెళ్లి హగ్ చేసుకుంటాడు రాజ్. కావ్య అదిరిపడుతుంది. వెంటనే అక్కడికి వచ్చిన ఇందిరాదేవి రాజ్‌ను తిట్టి పంపిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!