Brahmamudi Serial Today Episode: కావ్య, డాక్టర్‌ను కలవకుండా శాంతి ప్రయత్నిస్తుంది. పేషెంట్లను అందరిని డాక్టర్‌ దగ్గరకు పంపిస్తుంది కానీ కావ్యను పంపించదు. డాక్టర్‌ శాంతిని పిలిచి కావ్య వచ్చిందా అని అడిగితే వచ్చింది కానీ వాష్‌ రూంకు వెళ్లిందని అబద్దం చెప్తుంది. వెంటనే బయటకు వచ్చిన శాంతి భయంగా రాజ్‌కు ఫోన్‌ చేస్తుంది.

Continues below advertisement

శాంతి: ఇంకా ఎంత సేపు సార్‌ మీ వైఫ్‌ చాలా ప్రశ్నలు వేస్తున్నారు. త్వరగా రండి సార్‌

రాజ్‌:  ఇదిగో వచ్చేస్తున్నాను.. పటాన్‌ చెరువు దగ్గర వస్తున్నాను.. ఇంకెంత నలభై నిమిషాల్లో వస్తాను.

Continues below advertisement

శాంతి: ఏంటి మా డాక్టర్‌ అత్తగారి ఊర్లో వస్తున్నారా..?

రాజ్‌: శాంతి ఇది మీ డాక్టర్‌ అత్త గారి ఊరా..? ఆ ఇంటి అడ్రస్‌ నీకు తెలుసా..?

శాంతి: తెలుసు సార్‌ కానీ మీరు త్వరగా రండి సార్..

రాజ్: నేను వస్తాను కానీ ముందు మీ డాక్టర్‌ అత్తగారి ఇంటి అడ్రస్‌ నాకు సెండ్‌ చేయ్‌

శాంతి: అలాగే సార్‌..

నర్సు అడ్రస్‌ మెసేజ్‌ చేస్తుంది.

రాజ్‌:  నేను చెప్తే డాక్టర్‌ వినదు.. వాళ్ల అత్తయ్య చెబితే వినదా..?

అనుకుంటూ యూటర్న్‌ తీసుకుంటాడు.

హాస్పిటల్‌ లో కావ్య తర్వాత వచ్చిన వాళ్లు కూడా డాక్టర్‌ దగ్గరకు వెళ్తుంటారు. దీంతో కావ్య కోపంగా శాంతిని పిలిచి తిడుతుంది. నా కన్న తర్వాత వచ్చిన వాళ్తు కూడా వెళ్తున్నారు అంటుంది. అయితే వాళ్లు ముందే వచ్చి వెళ్లారని సర్ది చెప్తుంది శాంత. మరోవైపు డాక్టర్‌ అత్తగారి దగ్గరకు రాజ్‌ వెళ్తాడు. వాళ్ల అత్తను తన మాటలతో రెచ్చగొట్టి దొంగతనం నాటకం ఆడదామని చెప్తాడు. వెంటనే మీ కోడలికి ఫోన్‌ చేసి ఇక్కడకు పిలిపించండి అంటాడు సరే అంటూ ఒప్పుకుంటుంది డాక్టర అత్త. హాస్పిటల్‌ లో  డాక్టర్‌, శాంతిని పిలుస్తుంది.

శాంతి: మేడం పిలిచారేంటి మేడం

డాక్టర్‌: ఎవరెవరినో పంపిస్తున్నావు.. కావ్య మేడం రాలేదా ఇంకా…?

శాంతి: వచ్చారు మేడం కానీ మీరు ఈ టైంకి టీ బ్రేక్‌ తీసుకుంటారు కదా. అందుకే పంపలేదు.

డాక్టర్‌: ఎప్పుడేం తీసుకోవాలో నాకు తెలుసు.. ముందు కావ్యను పంపించు ఆవిడతో నేను మాట్లాడాలి.

నర్సు బయటకు వెళ్లి కావ్యను పంపిస్తుంది. థాంక్స్‌ చెప్తూ కావ్య లోపలికి వెళ్తుంది.

డాక్టర్‌: రండి కావ్య గారు కూర్చోండి  

కావ్య: డాక్టర్‌ గారు లాస్ట్‌ టైం మిమ్మల్ని కలిసినప్పుడు ఏదేదో గొడవ జరిగిపోయింది. మీతో మాట్లాడే అవకాశమే దొరకలేదు. ఆరోజు మా వారు చేసిన పనికి మీరు చాలా ఇబ్బంది పడ్డారని అర్థమైంది. ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను..

డాక్టర్‌:  ఒక భర్తగా ఆయన పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అండి. కానీ డాక్టర్‌గా నా బాధ్యత నేను చేయాలి కదా

కావ్య: మేడం నేను ఇక్కడకు వచ్చింది ఒక ఇంపార్టెంట్‌ విషయం తెలుసుకోవడానికి.. ఆ రోజు మా ఆయన నాకు తెలియకుండా అబార్షన్‌ చేయించడానికి తీసుకొచ్చారు. ఆయన ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను.. కానీ ఆయన చెప్పడం లేదు.. అందుకే మీ దగ్గరకు వచ్చాను ఫ్లీజ్‌ డాక్టర్ చెప్పండి.

డాక్టర్‌: అసలు ఏం జరిగిందంటే..

అని విషయం చెప్పబోతుంటే.. డాక్టర్‌కు వాళ్ల అత్తయ్య వీడియో కాల్ చేసి దొంగ వచ్చి తనను కట్టేసి ఇట్లో దొంగతనం  చేస్తున్నాడని చెప్తుంది. దీంతో కంగారు పడిన  డాక్టర్‌ కావ్యకు నిజం చెప్పకుండానే వెళ్లిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన కావ్యను కళ్యాణ్‌ వచ్చి డాక్టర్‌ను కలవలేదు కదా వదిన అని అడుగుతాడు. దీంతో కావ్య కళ్యాణ్‌ను అనుమనిస్తుంది. రాజ్‌ విషయంలో కళ్యాణ్‌కు నిజం తెలిసి  ఉండొచ్చని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!