Brahmamudi Serial Today Episode: టెంట్‌ కింద దోమలతో దోస్తీ చేస్తూ ఆకలితో బాధపడుతున్న రాజ్‌ ను చూసి కావ్య బాధపడుతుంది. దీంతో రాజ్‌కు మూర్తి చేత భోజనం పంపిస్తుంది. అయితే అది తాను పంపిచినట్టు చెప్పొద్దని చెప్తుంది. సరే అంటూ భోజనం తీసుకుని వెళ్తాడు మూర్తి.

Continues below advertisement


రాజ్: అనవసరంగా చాలెంజ్‌ చేశానా..? ( మనసులో)


మూర్తి: అల్లుడు గారు మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసు అల్లుడు గారు.. ఏంటి అల్లుడు గారు అలా చూస్తున్నారు. నిరాహారదీక్షలో అన్నం ఎలా తినాలనా..? దీక్ష నా కూతురు కోసమే కదా..? తను లేనప్పుడు ఎలా తింటే ఏంటి..? ఎవ్వరూ చూడరు లేండి లాగించేయండి


రాజ్‌: మామయ్య మీరు నిజంగా నా పాలిట దేవుడు లాంటి వాళ్లు (మూర్తి రాజ్‌ ను తదేకంగా చూస్తుంటాడు.) ఏంటి మామయ్య అలా చూస్తున్నారు..?


మూర్తి: ఏం లేదు బాబు.. నా కూతురును ఇంతలా ఇష్టపడే మీరు అంతలా ప్రేమిస్తున్న మీరు ఆ నిజం ఏంటో ఎందుకు చెప్పలేకపోతున్నారో అని చూస్తున్నాను


రాజ్‌: చెప్పలేనిది కాబట్టే చెప్పలేకపోతున్నాను మామయ్య దయచేసి ఆ ఒక్కటి మాత్రం అడక్కండి.


ఇంట్లోంచి అంతా చూస్తున్న కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇంతలో కనకం వస్తుంది.


కనకం: కావ్య నీకోసం ఏం తెచ్చానో చూడు.. కుంకుమ పువ్వు వేసిన పాలు.. ఈ పాలు తాగితే బిడ్డ ఎర్రగా పుడతాడట తాగు ..


కావ్య: తాగలేనమ్మా..? నాకొద్దు.. తాగాలని లేదు


కనకం: ఏంటి తాగాలని లేదా..? ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా నీకు టైం కు ఫుడ్డు తీసుకోకపోతే కడుపులో బిడ్డకు ఇబ్బంది కాదా..? తాగు


కావ్య: నువ్వు నా కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు అమ్మ.. కానీ నేను నా కళ్ల ముందు ఉన్న నా భర్త గురించి ఆలోచిస్తున్నాను..


కనకం: ఇప్పుడు అంతలా ఆలోచించడానికి ఏమైంది బాగానే ఉన్నాడు కదా..?


కావ్య: ఏంటమ్మా బాగుండేది.. కోటలో రాజులా ఉండాల్సిన ఆయన ఇలా రాత్రి పడుకోవడానికి దోమలు కొట్టుకుంటూ ఉంటే ఆయన్ని అలా చూసి ఉండటం నావల్ల కాదమ్మా


కనకం: ఓసేయ్‌ భర్తను మార్చాలంటే ఇనుప ముద్దలా ఉండాలే.. ఇలా ఒక్క రాత్రికే ఐసు ముద్దలా కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి… ఇలా అయితే నువ్వు అల్లుడి గారిని మార్చినట్టే..


కావ్య: ఇలా నా కళ్ల ముందే ఉంటూ అలా బయట కష్టపడుతుంటే.. భార్యగా నేను చూడలేకపోతున్నాను అమ్మ


కనకం: ఇప్పుడేంటి..? అల్లుడి గారిని ఇంట్లోకి తీసుకురావాలి అంతే కదా..? ఇక ఆ విషయం మర్చిపో అంతా నేను చూసుకుంటాను.. ఈ పాలు తాగు


అనగానే కావ్య పాలు తీసుకుని తాగుతుంది. కనకం బయటకు వెళ్లి అపర్ణకు ఫోన్‌ చేస్తుంది. రాజ్‌ను మార్చేందుకు తన దగ్గర ఐడియా ఉందని రేపు మీరందరూ మా ఇంటికి రమ్మని చెప్తుంది. సరే అంటుంది అపర్ణ. మరుసటి రోజు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కనకం ఇంటికి వెళ్తారు. వాళ్లను చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు. తర్వాత రుద్రాణి, రాజ్‌ను రెచ్చగొడుతుంది. దీంతో రాజ్‌ కావ్యను తీసుకునే ఇక్కడి నుంచి ఇంటికి వస్తానని చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!