Brahmamudi Serial Today Episode: కిచెన్‌లోకి వెళ్లిన కావ్య అక్కడే రాజ్ వదిలేసిన జ్యూస్ గ్లాస్ చూస్తుంది. అనుమానంతో గ్లాస్ చూసిన కావ్య ల్యాబ్ ఇంచార్జ్ సందీప్ కు ఆ జ్యూస్ పంపిస్తుంది. టెస్ట్ చేసి చెప్తా అంటాడు సందీప్. రాత్రికి కావ్య సందీప్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడకు ఇందిరాదేవి వస్తుంది.
ఇందిరాదేవి: కావ్య ఏం చేస్తున్నావు
కావ్య: ఏం లేదు బామ్మ సందీప్‌కు ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నాను
అప్పుడే సందీప్ ఫోన్ చేస్తాడు.
కావ్య: హలో చెప్పండి సందీప్
సందీప్: ఏంటి మేడం ఏం చెప్పాలి..
కావ్య: ఎందుకు ఏమైంది..?
సందీప్: అందులో ఏం కలిపారో తెలుసా..? అబార్షన్ టాబ్లెట్ కలిపారు.. డౌటు వచ్చి మళ్లీ టెస్ట్ చేశాను.. ఆ జ్యూస్‌లో ఎవరో కావాలనే ఆ టాబ్లెట్ కలిపారు. జాగ్రత్తగా ఉండండి మేడం
కావ్య: సరే సందీప్..
కావ్య: ( మనసులో) అంటే కచ్చితంగా ఆ టాబ్లెట్ కలిపింది ఆయనే.. అందుకే నేను జ్యూస్ పని మనిషిని అడిగితే ఆయన తీసుకొచ్చారు.. పైగా నేను తాగను అంటే తాగమని బలవంతం చేశారు. ఆయన నిజంగా బిడ్డ వద్దనుకుంటే.. ఆయన జ్యూస్ నాకు ఇచ్చి అబార్షన్ అయ్యేటట్లు చేసుండాలి. కానీ ఎందుకు ఇలా ఆగిపోయి ఉంటారు. చివరి నిమిషంలో ఆ గ్లాస్ ఎందుకు మార్చి ఉంటారు. అలా అబార్షన్ అయ్యేలా చేస్తే.. నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఆగిపోయారా..? లేక ఇంకేమైనా అవుతుందని ఆగిపోయారా..? ఎలా తెలుసుకోవాలి.. ఆ రోజు హాస్పిటల్ లో కూడా ఆ డాక్టర్‌ను కూడా ఏదో రిక్వెస్ట్ చేశారు. ఆయన అబార్షన్ చేయించడానికి కారణం ఆ డాక్టర్‌కు తెలిసి ఉంటుంది. రేపే డాక్టర్‌ను కలిసి ఆ నిజం ఏంటో తెలుసుకోవాలి కానీ ఆయన ఇంట్లో ఉండే నేను ఎలా హాస్పిటల్‌కు వెళ్లగలను..
ఇందిరాదేవి: ఏంటి కావ్య ఏమైనా గుడ్ న్యూసా..? లేకపోతే రాజ్ గురించి ఏమైనా చెప్పారా..?
కావ్య: అదేం కాదు అమ్మమ్మ.. మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను.. కానీ మీరు ఒక హెల్ప్ చేయాలి.
ఇందిరాదేవి: ఏంటో చెప్పు కావ్య..
కావ్య: రేపు ఆయనను ఎలాగైనా మన ఫామ్ హౌస్‌కు పంపించాలి. అప్పుడే నేను నిజం తెలుసుకోగలను..
ఇందిరాదేవి: అలాగే కావ్య.. నువ్వు చెప్పినట్టే చేస్తాను.
అంటూ తర్వాతి రోజు ఇందిరాదేవి.. రాజ్‌ను ఫామ్ హౌస్‌కు పంపిస్తుంది. కావ్య ఇక హ్యాపీగా హాస్పిటల్‌కు వెళ్లొచ్చు అనుకుంటుంది. మరోవైపు రాహుల్ రుద్రాని ప్లాన్ ప్రకారం స్వప్నను నమ్మించాలని డిసైడ్ అవుతారు. అనుకున్నట్టుగానే.. రాహుల్, స్వప్న దగ్గరకు వెళ్తాడు.
రాహుల్: స్వప్న నువ్వు చేప్పిన అన్ని పనులు చేశాను..
స్వప్న: సారీ రాహుల్ ఇన్ని రోజులు నువ్వు ఏ పని పాటా లేకుండా గాలి తిరుగుడులు తిరుగుతుంటే తిట్టుకునే దాన్ని కానీ నువ్వు ఇంత బాగా బాధ్యతలు తీసుకుని పనులు చేస్తుంటే.. నాకు ముచ్చటేస్తుంది.
రుద్రాణి: కానీ నాకు మాత్రం చచ్చిపోవాలనిపిస్తుంది.
స్వప్న: అయితే చచ్చిపోండి ఎవరు వద్దన్నారు
రుద్రాణి: ఓసేయ్ వాడేమన్నా నీకు బానిస అనుకున్నావా..? వాడి చేత చేయకూడని పనులు చేయిస్తున్నావు..
రాహుల్: మామ్ పనులు నేనే చేస్తే తనను అంటావేంటి..? ఆ పనులు నేనే చేస్తానని చెప్పాను అందులో తన తప్పు ఏం ఉంది
రుద్రాణి: నీ పెళ్లాం తప్పేం లేదురా..? నిన్ను కనడమే నా తప్పు..
రాహుల్: మామ్ భర్త అంటే భార్యను కష్టపెట్టేవాడు కాదు.. మామ్ తన కష్టాన్ని పంచుకునే వాడు
అని చెప్పగానే.. నిజంగానే రాహుల్ మారిపోయినట్టు ఉన్నాడు అని స్వప్న మనసులో అనుకుంటుంది. రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కళ్యాణ్, స్వప్న దగ్గరకు వెళ్లి రాజ్, కావ్య కనిపించడం లేదని అడుగుతాడు. వాళ్లిద్దరు బయటకు వెళ్లారని కావ్య డాక్టర్ దగ్గరకు వెళ్లిందని.. రాజ్ ఫామ్ హౌస్‌కు వెళ్లాడని చెప్తుంది. దీంతో కంగారుగా బయటకు వెళ్లిన కళ్యాణ్ రాజ్‌కు ఫోన్ చేసి విషయం చెప్తాడు. రాజ్ వెంటనే హాస్పిటల్‌కు ఫోన్ చేసి కావ్య డాక్టర్ ను కలవకుండా చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!