Brahmamudi Serial Today Episode:  దుగ్గిరాల ఇంటికి మహిళ సంఘాల వాళ్లు వచ్చి రాజ్ కు వార్నింగ్‌ ఇస్తారు. రుద్రాణి తన మాటలతో వాళ్లను మరింత రెచ్చగొడుతుంది.

Continues below advertisement

 ఇందిరాదేవి:  కాసేపు నువ్వు నోరు మూస్తావా..?

రుద్రాణి: నువ్వు ఉండు అమ్మా..  అసలు మీరు నా మేనల్లుడు అంటే ఎవరనుకున్నారు..? అసలు ఏం చేయగలరు మీరు

Continues below advertisement

మహిళ: మీ మేనలుడి గురించి మేము ఏమీ అనుకోవడం లేదు.. కానీ ఒక అడపిల్లను ఇబ్బంది పెడుతున్నాడని.. బిడ్డను చంపుకోమంటున్నాడని మేము పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టామంటే చాలు మీరందరూ వెళ్లి జైళ్లో కూర్చుంటారు.

రుద్రాణి: ఏంటి బెదిరిస్తున్నారా..?

మహిళ2: మేము ఇక్కడికి వచ్చే వరకు రాజ్‌ చేస్తున్నది తప్పు.. తన తప్పును సరిదిద్దుకోమని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న మాటలు చూశాక మీ అందరినీ చట్ట పరంగా శిక్షించడం కరెక్టు అని మాకు అనిపిస్తుంది.

రుద్రాణి: మీరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే మేము పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తాము చట్టాలేవీ మాకు కొత్త కాదు

అపర్ణ: రుద్రాణి ఇక నువ్వు అపుతావా…? వాళ్లు ఆవేశంగా మాట్లాడుతుంటే నువ్వు ఇంకా రెచ్చగొడతావేంటి..? ఇక ఆపు.. చూడండి తను ఏదో తెలియక మాట్లాడింది. తనకు కొంచెం ఆవేశం ఎక్కువ మీరు అనుకున్నట్టుగా మా అబ్బాయి మా కోడలిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నిజం చెప్పాలంటే… తనను మేము ఒక కూతురులా చూసుకుంటుంన్నాము

మహిళ: మీరు ఇలా మాట్లాడి అబద్దం చెప్పినంత మాత్రాన మీ మాటలను మేము నమ్ముతామని మీరు ఎలా అనుకుంటున్నారు..

మహిళ2: చేయాల్సిన తప్పు చేశారు. సరిదిద్దడానికి వచ్చిన మాతోనే అమర్యాదగా ప్రవర్తించారు.. మీకు డబ్బు పేరు పలుకుబడి ఉండొచ్చు కానీ మా వైపు న్యాయం ఉంది. మీరు మీ కోడలికి చేసిన అన్యాయాన్ని మేము బయట పెడతాం. మీ కొడుకు చేసిన తప్పుకు సరైన శిక్ష పడేలా చేస్తాం.

ఇంతలో కావ్య వస్తుంది.

కావ్య: చూడండి మీలాంటి  మహిళలు అందరూ కలిసి ఒక శక్తిగా మారి అన్యాయానికి గురౌతున్న అడవాళ్లకు అండగా నిలబడుతున్నారు. ఆ విషయంలో మిమ్మల్ని నేను కూడా స్పూర్తిగా తీసుకుంటున్నాను.. మీ వల్ల ఎంతో మంది అడవాళ్లు వాళ్లు పడుతున్న బాధల నుంచి బయట పడ్డారు. వారికి మరో కొత్త జీవితాన్ని ఇచ్చారు. మీ అందరూ కలిసి..  ఆ విషయంలో నేను మీ అందరినీ మొచ్చుకుంటున్నాను.. కానీ నా విషయంలో ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు..

మహిళ: మరి మీరు పుట్టింటికి ఎందుకు అలిగి వెళ్లిపోయారు

కావ్య: భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న గొడవలు వస్తుంటాయి. మీరే చెప్పండి మీరు ఇక్కడికి వచ్చారు అని తెలియగానే.. నేను ఎందుకు వస్తాను మీరు అందరూ నాకోసం వచ్చినందుకు చాలా థాంక్స్‌

అంటూ వాళ్లను కన్వీన్స్‌ చేసి పంపిచేస్తుంది కావ్య. వాళ్లు వెళ్లిపోయాక రుద్రాణి కావ్యను తిడుతుంది. కావ్య కూడా రుద్రాణిని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రూంలోకి వెళ్లిన రుద్రాణి తన ప్లాన్‌ ప్రకారం రాజ్‌ చేత కావ్యకు విడాకులు ఇప్పించాలని అనుకుంటుంది. అలాగే రాజ్‌ దగ్గరకు వెళ్లి విడాకులు ఇచ్చినట్టు నాటకం ఆడమని అప్పుడు కావ్య దారిలోకి వస్తుందని చెప్తుంది. రాజ్‌ అలాగేనని మరుసటి రోజు కనకం ఇంటికి వెళ్లి కావ్యను ఇంటికి రమ్మని అడుగుతాడు. కావ్య రానని చెప్పడంతో అయితే తనకు విడాకులు ఇవ్వమని విడాకుల పైపర్స్‌ పై సంతకం పెట్టమని అడుగుతాడు. దీంతో కావ్య, కనకం, మూర్తి షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!