Brahmamudi Serial Today Episode: ఇంటికి వచ్చిన కావ్యను చూసి మూర్తి, కనకం టెన్షన్ పడతారు. ఒక్కదానివే వచ్చావు ఎందుకని కనకం అడగడంతో కావ్య చెప్పకుండా తినడానికి ఏదైనా టిపిన్ చేయమని చెప్పి లోపలికి వెళ్తుంది.
కనకం: దీనికి ఏమైందండి ఎందుకు ఇలా మాట్లాడుతుంది
మూర్తి: అక్కడ ఏదో జరిగింది కాబట్టే అమ్మాయి ఇలా మాట్లాడుతుంది. నువ్వు వెంటనే అపర్ణ గారికి ఫోన్ చేయ్ విషయం తెలుస్తుంది.
కావ్య: (ఫోన్ లాక్కుని) ముందు నాకు తినడానికి ఏదైనా చేయ్ ఫోన్ తర్వాత మాట్లాడుదువు
అపర్ణ కనకానికి ఫోన్ చేస్తుంది. కావ్య ఫోన్ సైలెంట్ లో వేస్తుంది.
అపర్ణ: ఈ టైంలో కనకం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి..?
రుద్రాణి: నీకు ఇంకా అర్థం కాలేదా వదిన ఒకవేశ నిజంగానే కావ్య అక్కడికి వెళ్లి ఉంటే కనకం ఆగుతుందా..? తన కూతురు పుట్టింటికి ఎందుకు వచ్చిందా అని ఆరా తీయడానికైనా ఫోన్ చేస్తుంది. కదా..? అలా చేయలేదంటే.. కనకానికి కావ్య వెళ్లిపోయిందన్న విషయం తెలియలేదు. కాబట్టి ముందు కావ్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం మంచిది.
అపర్ణ: ఏరా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా..? నువ్వు అనుకున్నది సాధించావు కదా..? నీ మొండితనంతో నీ భార్య మీద నువ్వు పై చేయి సాధించావు.. వెళ్లు వెళ్లి నా భార్య మీద పై చేయి సాధించానని డప్పు కొట్టుకో
ఇందిరాదేవి: రాజ్ కావ్యకు ఏదైనా జరిగితే మాత్రం ఈ దుగ్గిరాల కుటుంబానికి పతనం మొదలైనట్టే
రాజ్: అలాంటి రోజు ఎప్పటికీ రాదు నాన్నమ్మ. కళావతి ఎక్కడికి వెళ్లిందో నాకు బాగా తెలుసు. ఎలా వెళ్లిందో అలా తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది నేను తీసుకొస్తాను
అని రాజ్ వెళ్లిపోతాడు. అప్పు కనకాని కాల్ చేస్తుంది. ఎవ్వరూ లిఫ్ట్ చేయరు దీంతో అప్పు బాధపడుతుంది. కళ్యాణ్ వచ్చి ఓదారుస్తాడు. అన్నయ్య వెళ్లారు కదా తప్పకుండా వదినను తీసుకునే వస్తారు అని చెప్తాడు. అయినా అప్పు బాధపడుతూనే ఉంటుంది. ఇంట్లో కనకం ఇంకా టిఫిన్ తీసుకురాలేదని కావ్య అరుస్తుంది.
కావ్య: అమ్మా ఎంత సేపు అయిందా..? ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను
కనకం: ఆగవే వస్తున్నాను..నువ్వు ఆకలితో కాదు కోపంతో చచ్చిపోయేలా ఉన్నావు
మూర్తి: కనకం ఎప్పుడూ లేనిది అమ్మాయేంటి..? ఇంత కోపంగా ఉంది.
కనకం: మీరేం కంగారు పడకండి దాని కోపానికి కారణాలేంటో నేను కనుక్కుంటాను కదా
మూర్తి: అమ్మాయిని ఎక్కువగా విసిగించకు
కనకం: విసిగించకపోతే ఏం జరిగిందో ఎలా చెప్తుంది.. మీరు ఉండండి నేను కనుక్కుంటాను.
అంటూ వెళ్లి కావ్యకు టిఫిన్ పెడుతుంది.
కనకం: అమ్మా కావ్య ఉప్మా ఎలా ఉంది…?
కావ్య: ఉప్మా లాగే ఉంది
కనకం: ఏంటే ఏది అడిగినా అలా కసురుకుంటావేంటి..? ఏం జరిగింది అంటే చెప్పవు..ఎందుకు వచ్చావంటే చెప్పవు.. అసలు నువ్వు ఇలా వచ్చావని ఇంట్లో వాళ్లకు చెప్పావా… పాపం నీ గురించి వాళ్లు కంగారు పడతారే
రాజ్ వస్తాడు.
రాజ్: మా గురించి ఆలోచిస్తే ఇలా చెప్పా పెట్టకుండా ఎలా వస్తుంది అత్తయ్యగారు
కావ్య: నేనేం చెప్పాపెట్టకుండా రాలేదు.. లెటర్ రాసే వచ్చాను.
రాజ్: ఏంటి లెటర్ రాసి రావడం.. నీకు కొంచెమైనా బుద్ది ఉందా..? ఇంట్లో వాళ్లు ఎంత టెన్షన్ పడతారో తెలుసా..?
కావ్య: మీ వల్ల నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా.. ?
రాజ్: ఆ విషయంలో నా నిర్ణయం మారదు
అని చెప్పగానే కావ్య కూడా కారణం చెప్పే వరకు నేను రాను అంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. రాజ్ తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. రాజ్ ఒక్కడే రావడం చూసిన ఇంట్లో వాళ్లు రాజ్‌ను తిడతారు. దీంతో కావ్యను నేను తీసుకురాలేను అంటూ చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కనకం స్వప్నకు కాల్ చేస్తుంది. కానీ ఆ ఫోన్ రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!