Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వారుంటారు. ఇంతలో ఇంట్లోకి పోలీసులు వస్తారు. పోలీసులను చూసి అదరూ షాక అవుతారు.

Continues below advertisement


సుభాష్‌: ఏంటి ఎస్సై గారు ఇక్కడికి వచ్చారు


రాజ్‌: ఏంటి ఎస్సై గారు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారు


ఎస్సై: ఇక్కడ రాహుల్‌ ఎవరు


రుద్రాణి: ( మనసులో) వీడు మళ్లీ ఏం చేసి చచ్చాడు వీడి గురించి అడుగుతున్నారేంటి..?


రాహుల్: నేనే రాహుల్ సార్‌.. ఏమైంది..?


ఎస్సై: కానిస్టేబుల్‌ అరెస్ట్‌ హిమ్‌


రాజ్‌: ఏంటి ఎస్సై గారు మా వాడు ఏం చేశాడని అరెస్ట్ చేస్తున్నారు..?


ఎస్సై: అతను మర్డర్‌ చేశాడు


రాజ్: ఏం మాట్లాడుతున్నారు ఎస్సై గారు


ఎస్సై: రాహుల్‌ అనే ఈ వ్యక్తి కొట్టడం వల్లే కూయిలీ అనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని రాహుల్ చంపాడని ఆ అమ్మాయి భర్త కేసు పెట్టాడు


రాజ్: ఎస్సై గారు మా వాడు మర్డర్‌ చేసేంత దుర్మార్గుడు కాదు.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది


ఎస్సై: అది మేము చూసుకుంటాము.. నీకు కూయిలీ అనే అమ్మాయికి పరిచయం ఉందా..? ఆ అమ్మాయిని నువ్వు నిన్న కొట్టావా..?


రాహుల్‌: కొట్ట లేదు సార్‌ జస్ట్‌ తోశాశాను ఆ మాత్రం దానికే చనిపోతుందా..?


ఎస్సై: అదంతా కోర్టులో చెప్పుకో.. కానిస్టేబుల్‌ అరెస్ట్ చేయండి..


రుద్రాణి: సార్‌ వాడు అమాయకుడు ఏ తప్పు చేయలేదు సార్‌.. వాడిని వదిలేయండి


ఎస్సై: అతను ఏ తప్పు చేయకపోతే జడ్జి గారే వదిలేస్తారు


అంటూ రాహుల్‌ ను అరెస్ట్‌ చేసి పోలీసులు తీసుకెళ్తారు. దీంతో రుద్రాణి అందరినీ తిడుతుంది. పోలీసులు నా కొడుకుని తీసుకెళ్తుంటే ఎవ్వరూ అడ్డు పడరేంటని నిలదీస్తుంది. దీంతో అందరూ రుద్రాణిని తిడతారు. తర్వాత స్వప్న బాధపడుతుంటే.. రాజ్‌, కావ్య వెళ్లి ఓదారుస్తారు.


కావ్య: అక్కా రాహుల్ కు ఏమీ కాదు నువ్వేం బాధపడకు


స్వప్న: పోలీసులు రాహుల్‌ను తీసుకెళ్లినందుకు నేను బాధపడటం లేదు కావ్య.. నేను మళ్లీ ఇంకొకసారి మోసపోయానేంటి అని బాధపడుతున్నాను..


రాజ్‌: స్వప్న నువ్వు మోసపోయానని ఎందుకు అనుకుంటున్నావు.. అక్కడ ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా


స్వప్న: కానీ పోలీసులు సరాసరి రాహుల్‌ ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏమనుకోవాలి. మీరు రాహుల్‌ను మార్చాలి అనుకున్నారు. రాహుల్‌ మారకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఎప్పటికీ తనన మార్చడం సాధ్యం కాదు అందుకే నేను నమ్మను అన్నాను.. మీరే ఒక్క అవకాశం ఇవ్వమన్నారు..


కావ్య: లేదు అక్కా నువ్వు అనుకున్నది నిజం కాదనిపిస్తుంది.  నాకు ఎందుకో అనుమానంగా ఉంది. రాహుల్‌ డబ్బు మీద ఆశ ఉన్నవాడే అందని దానికి నిచ్చెన వేసే వాడే కానీ ఒక మనిషిని చంపేంత ధైర్యం రాహుల్‌కు ఉందని నేను అనుకోవడం లేదు అక్క


రాజ్‌: అవును స్వప్న వాడు మూర్ఖుడే కావచ్చు కానీ హత్య చేసేంత దుర్మార్గుడు కాదు


స్వప్న: కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా..? నమ్మకుండా ఎలా ఉండగలం చెప్పు..


రాజ్‌: కళ్లకు కనిపించినవన్నీ నిజాలు కాదు.. కనిపించనివి అబద్దాలు కాదు.. వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికి తొందరపడకుండా అర్థం చేసుకో


అంటూ ఇద్దరూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత రంజిత్‌ రుద్రాణికి ఫోన్‌ చేసి బెదిరిస్తాడు. రెండు కోట్లు ఇస్తే నీ కొడుకు మీద కేసు వాపసు తీసుకుంటానని చెప్తాడు. ఇదే విషయం ఇంట్లో వాళ్లకు రుద్రాణి చెప్తుంది. ఎవ్వరూ పట్టించుకోరు దీంతో రుద్రాణి కోపంగా రంజిత్‌ దగ్గరకు వెళ్లిపోతుంది. రాజ్‌, కావ్య ఇద్దరూ తాము కూయిలీ ఇంట్లో పెట్టిన సీసీకెమెరా పుటేజీ చూడ్డానికి వెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!