Brahmamudi Serial Today Episode:  ఇందిరాదేవి కొన్ని చెక్స్‌ తీసుకొచ్చి కావ్యకు ఇస్తుంది. కావ్య అనుమానంగానే చెక్స్‌ తీసుకుని నాకెందుకు ఇదంతా తప్పుగా అనిపిస్తుంది. ఇవన్నీ ఆయన చేత ఇప్పించాలి అమ్మమ్మ అని చెప్తుంది. దీంతో ఇందిరాదేవి నీతో పెద్ద తలనొప్పిగా ఉందే..ఎవరి చేతి మీదగా ఇవ్వాలో మీ తాతయ్యకు తెలియదా..? అంటుంది. అని చెప్పి ఇందిరాదేవి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ రెడీ అవుతుంటాడు. కావ్య చెక్స్‌ తీసుకుని రూం దగ్గరకు వెళ్తుంది.


రాజ్‌: ఏంటి లెటర్స్‌ పట్టుకుని వచ్చావా..? కొత్తగా పోస్ట్‌ మెన్‌ జాబ్‌ చేస్తున్నావా..?


కావ్య: పోస్ట్‌ వస్తే పనిమనిషితో పంపించేదాన్ని ఇలా నేను తీసుకొచ్చే దాన్ని కాదు.


రాజ్‌: మరి ఎందుకు వచ్చావు.


కావ్య: మీతో మాట్లాడాలి అని


రాజ్‌: ఏయ్‌ ఎందుకు లోపలికి వచ్చావు. ఏమున్నా గది బయటే ఉండి మాట్లాడు.. బయటకు వెళ్లు.


కావ్య: బయట ఉండి మాట్లాడాల్సిన విషయం కాదు. లోపల మాట్లాడాల్సింది.


అని తాతయ్య గారు చెక్స్‌ ఇచ్చారని నా చేతుల మీదుగా వర్కర్స్‌ కు ఇవ్వమన్నారు కానీ మీరు చెక్స్‌ ఇస్తేనే బాగుంటుందని కావ్య చెప్తుంది. దీంతో అక్కర్లేదని తాతయ్య నీకు ఇచ్చిన అవకాశాన్ని నాకు సానుభూతితో ఇస్తున్నావా? ఏదో ఒకరోజు మళ్లీ నన్ను కంపెనీ సీఈవోను చేస్తారు. అప్పుడు మళ్లీ నేనే చెక్స్‌ ఇస్తాను అంటూ రాజ్‌ బయటకు వెళ్లిపోతాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ, రుద్రాణి మాట్లాడుకుంటుంటే కళ్యాణ్‌, అప్పు వస్తారు. ధాన్యలక్ష్మీ చూస్తూ ఆగిపోతుంది.


రుద్రాణి: ఏంటి ధాన్యలక్ష్మీ  ఇక్కడే ఆగిపోయావు. వెళ్లి లోపలికి తీసుకురా..? పాపం అప్పుకు అలవాటు లేకపోయినా లాస్ట్‌ టైం నువ్వు చెప్పావని చీర కట్టుకుని వచ్చింది. పద అయినా నువ్వేంటి కళ్యాణ్‌ ఏదో పరాయి ఇంటికి వచ్చినట్టు భయం భయంగా వస్తున్నావు. ఇందాక నుంచి నువ్వెందుకు చిరాకుగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్తం అయింది. ఏంటి ధాన్యలక్ష్మీ ఇంకా అలా ఉన్నావు. అప్పును క్షమించవచ్చు కదా..?


స్వప్న: వామ్మో నువ్వు అందరు కలిసి ఉండటం గురించి ఆలోచిస్తున్నావా..? నీ స్టైల్‌ ఎప్పుడు అందర్ని విడగొట్టడమే కదా..?


ప్రకాష్‌: కరెక్టుగా చెప్పావమ్మా స్వప్న. మీ అత్తయ్య గురించి చాలా బాగా అర్థం చేసుకున్నావు.


రుద్రాణి: మంచిగా మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు. మాట్లాడితే ఇలా దెప్పి పొడుస్తారు. మీరే  మాట్లాడుకోండి.


అంటూ రుద్రాణి వెళ్లిపోతుంది. ధాన్యలక్ష్మీని ప్రకాష్‌ తిడతాడు. కనీసం వాడు వచ్చినందుకైనా కాస్త సంతోషంగా ఉండు నీ ఏడుపు ముఖం చూడలేకపోతున్నాను అంటూ ప్రకాష్‌ వెళ్లిపోతాడు. తర్వాత రూంలో ఆలోచిస్తూ కూర్చున్న కళ్యాణ్‌ దగ్గరకు అప్పు వచ్చి మీ అమ్మా నాన్నలకు బట్టలు తీసుకొచ్చావు కదా వెళ్లి ఇవ్వొచ్చు కదా..? అని చెప్తుంది. దీంతో నువ్వు రా ఇద్దరం వెళ్లి ఇద్దాం అని కిందకు వెళ్లి ధాన్యలక్ష్మీకి ప్రకాష్‌కు బట్టలు ఇస్తాడు కళ్యాణ్‌. ధాన్యలక్ష్మీ ఎమోషనల్‌ అవుతుంది.


ఇందిర: ఏంటి ఆలోచిస్తున్నావు. కొడుకు తన సంపాదనతో బట్టలు కొని తీసుకొస్తే సంతోషంగా తీసుకోక చూస్తావేంటి..?


అపర్ణ: ఇలాంటి అవకాశం అందరికీ దక్కదు ధాన్యలక్ష్మీ. కోట్ల ఆస్థులు ఉన్నా.. ఇలాంటి ఆనందం మాత్రం పొందలేము. అంతెందుకు నా కొడుకు విషయం తీసుకో.. తన చదువు పూర్తి కాగానే మన కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ కళ్యాన్‌ తన సొంత సంపాదనతో నీకు బట్టలు తీసుకొచ్చాడు తీసుకో..


  అని చెప్పగానే ధాన్యలక్ష్మీ బట్టలు తీసుకుంటుంది. ప్రకాష్‌ అప్పు ఇస్తుంది. ఇద్దరూ వాళ్లతో ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత బట్టల విషయంలో ధాన్యలక్ష్మీ అప్పును అవమానిస్తుంది. తర్వాత రుద్రాణి,  అనామికకు ఫోన్‌ చేసి నువ్వేదే చేస్తావని ఎదురుచూస్తుంటే ఇక్కడ శత్రువులు అందరూ మిత్రులుగా మారిపోయేటట్టు ఉన్నారు అని కోప్పడుతుంది. కొంచెం ఓపిక పట్టండి చానెల్‌ వాళ్లు టెలికాస్ట్ టైం చెప్తారు అనడంతో రుద్రాణి ఫోన్‌ కట్‌ చేస్తుంది. తర్వాత కావ్య పూజ చేస్తుంది. పూజ పూర్తి అయిన తర్వాత వర్కర్స్‌ కు చెక్స్‌ ఇవ్వడానికి రెడీ అవుతారు.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!