Brahmamudi Serial Today Episode:  ఆఫీసులో ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ మిస్ అయిందని శృతి కాల్‌ చేస్తుంది. విషయం తెలుసుకుని దుగ్గిరాల ఫ్యామిలీ కంగారు పడుతుంది. రుద్రాణి మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది. అందరూ ఆలోచిస్తూ ఉంటారు.

Continues below advertisement

రుద్రాణి: నేను అప్పుడే చెప్పాను రాజ్‌, కావ్యను అక్కడి నుంచి వచ్చేయమని  విన్నారా..?

ప్రకాష్‌: అన్నయ్య రాజ్‌ ఫోన్‌ రింగ్‌ అవుతుంది.

Continues below advertisement

సుభాష్‌: అయితే వెంటనే విషయం చెప్పరా

రాజ్‌ కాల్‌ లిఫ్ట్ చేస్తాడు. ప్రకాష్‌ ప్రాజెక్టు రిపోర్డ్‌ మిస్‌ అయిందని చెప్తాడు.

రాజ్‌: ఇంకో ఫైల్‌ నా సిస్టమ్‌లో కూడా లేదు బాబాయ్‌

ప్రకాష్‌: మరి పెద్ద కంపెనీతో డీల్‌ రా వాళ్లకు డిజైన్‌ సబ్మిట్‌ చేయకపోతే వాళ్లు డీల్‌ క్యాన్సిల్‌ చేసుకుంటారురా..?

రుద్రాణి: డిస్కషన్‌ ఎందుకు చిన్నన్నయ్య రాజ్‌, కావ్యను వెంటనే అక్కడి నుంచి వచ్చేయమనండి

రాజ్‌: బాబాయ్‌ మీరేం టెన్షన్‌ పడకండి నేను రావాల్సిందే.. వచ్చేస్తున్నాను..

రుద్రాణి:  చిన్నన్నయ్యా రాజ్‌ వస్తున్నాడా..?

ఇందిరాదేవి: నీకెందుకే అంత ఆత్రం

రుద్రాణి: యాభై కోట్లు అమ్మ నీకు అర్తం అవుతుందా..?

ప్రకాష్‌: రాజ్‌ వస్తున్నాడు ఏదో ఒకటి చేస్తాడులే అన్నయ్య

సుభాష్: ఒరేయ్‌ ఆ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలంటే రెండు రోజులు పడుతుందిరా..? ఇప్పుడెలా

రుద్రాణి: ఎన్ని రోజులైనా కానీ రాజ్‌ వస్తే సరి రాజ్‌ ఆఫీసులో ఉంటే ఏదైనా చేస్తాడు.. ఇంతకీ రాజ్‌ కచ్చితంగా వస్తున్నాడా..?

ప్రకాష్‌: ( కోపంగా ) వస్తున్నాడు

అని చెప్తాడు ప్రకాష్‌.. రాజ్‌ టెన్షన్‌ పడుతూ కావ్యను పిలుస్తాడు. కావ్య రాగానే విషయం మొత్తం చెప్తాడు.

రాజ్‌: ఇక లాభం లేదు కళావతి ఎలాగైనా వెళ్లి ఫస్ట్‌ మీటింగ్‌ క్యాన్సిల్‌ చేయాలి. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. మనం వెళ్లకపోతే మనకు 50 కోట్లు నష్టం వస్తుంది. మొన్న డిజైన్‌ చేసిన ప్రాజెక్టు డిలీట్‌ అయిందట.. ఇప్పుడు మీటింగ్‌ క్యాన్సిల్‌ అవుతుంది. మనం వెళ్లిపోవాలి టైం లేదు

అంటూ రాజ్‌ కంగారు పడుతుంటే.. కావ్య ఆలోచిస్తుంది. మరోవైపు ఇంట్లో అందరూ టెన్సన్‌ పడుతుంటారు.

రుద్రాణి: ఏంటి అన్నయ్య ఫోన్‌ చేసి ఇంసేపు అయింది.. రాజ్‌, కావ్య ఇంకా రాలేదు.. అటు నుంచి అటే ఆఫీసుకు వెళ్తున్నాడా..? ఏంటి

సుభాష్‌: ( కోపంగా) ముందు ఆఫీసుకే కదా వెళ్లేది..

రుద్రాణి: సారీ అన్నయ్య ఇదంతా నా వల్లే మీకు ఈ కష్టాలన్నీ నా కొడుకు వల్లే కదా

అపర్ణ: ఈ బాధ ముందు నుంచి ఉంటే మాకు ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి..?

ఇందిరాదేవి: స్వప్న జీవితం బాగుపడాలని కావ్య ఎంతో బాధపడింది. రాహుల్‌ గాణ్ని మార్చాలని రాజ్‌ ఎంతో కష్ట పడ్డాడు కానీ ఏం లాభం ఇవాళ తిరిగి రావాల్సి వచ్చింది.

స్వప్న: పోనీలేండి నా జీవితం ఇంతే అనుకుని సర్దుకుంటాను

రుద్రాణి: నేనుండగా నీకేం కానివ్వను స్వప్న

అంటుంది రుద్రాణి, స్వప్న కోపంగా చూస్తుంది.  అక్కడే ఉన్న కావ్య ఆలోచిస్తుంటే..

రాజ్: ఇంకా ఏం ఆలోచిస్తున్నావు కావ్య వెళ్దాం పద

కావ్య: ఏవండి కాస్త ఆగండి.. ఆ రోజు రాత్రి పంపించిన ఫైలే కదా..?

రాజ్‌: అవును అదే అయితే

కావ్య: మీరు చేసిన డిజైన్స్‌ ఎలా ఉన్నాయో చూడమని ఫైల్‌ మొత్తం నాకు ఫార్వర్డ్‌ చేశారు.. మర్చిపోయారా..?

రాజ్‌: అవును ఇప్పుడేంటి..? అసలు ఆ ఫైలే లేదు  

కావ్య: ఉందండి.. ఆ ఫైల్‌ నా దగ్గర ఉంది. మీరు నాకు ఫార్వార్డ్‌ చేసినప్పుడు డిజైన్స్‌ చూసినప్పుడు నేను నా సిస్టంలో సేవ్‌ చేశాను. ఇప్పుడే చిన్న మామయ్యకు ఫోన్‌ చేసి నా సిస్టం పాస్వర్డ్‌ చెప్తే ఆయనే శృతికి ఫార్వార్డ్‌ చేస్తారు

రాజ్‌:  ఓ థాంక్యూ కళావతి.. ఇప్పుడే కాల్‌ చేయ్‌

అని చెప్పగానే.. కావ్య కాల్ చేస్తుంది. రాజ్‌ కాల్‌ కోసం ఎదురు చూస్తున్న ఇంట్లో వాళ్లు కావ్య ఫోన్‌ చేయడంతో ఆశ్చర్యపోతారు. కావ్య, ప్రకాష్‌కు విషయం చెప్పి పాస్‌ వర్డ్‌ చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి మాత్రం ఇరిటేట్‌గా ఫీలవుతుంది. మరోవైపు రాహుల్‌కు కూయిలీ మీద అనుమానం వచ్చేలా చేయాలని రాజ్‌, కావ్య, గోల్డ్‌ బాబు ప్లాన్‌ చేస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!