Brahmamudi Serial Today Episode: రాజ్‌ తన సొంతంగా ఎవ్వరికీ తెలియకుండా ఓపెన్‌ చేయబోతున్న కంపెనీ గురించి మేనేజర్‌ తో ఫోన్‌లో మాట్లాడుతుంటాడు రాజ్‌. ఇంతలో కావ్య వస్తుంది. రాజ్‌ కాల్‌  కట్‌ చేస్తాడు.

Continues below advertisement

కావ్య: ఎవరితో కొత్త కంపెనీ మేనేజర్ తో మాట్లాడుతున్నారా..?

రాజ్‌: అవును కళావతి ఒక్క పని టైంకు అవ్వడం లేదు

Continues below advertisement

కావ్య:  నాకెందుకో భయంగా ఉందండి.. ఇన్ని ఏండ్లుగా తాతయ్య గారు స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ అని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. అందరు ఒకే చెట్టు నీడలో ఉండాలి అన్నట్టు అందరూ ఒకే కంపెపీలో పని చేశారు. కానీ ఇప్పుడు మీరు దానికి సంబంధం లేకుండా కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నారు.. ఒకవేళ తాతయ్య గారికి ఈ విషయం తెలిస్తే బాధపడతారేమో అనిపిస్తుందండి.. తాను సృష్టించిన కంపెనీ కాకుండా కొత్త కంపెనీ ఎందుకు పెడుతున్నావని అడిగితే ఏం సమాధానం చెప్తారు

రాజ్‌: ఏంటి కళావతి అలా మాట్లాడుతున్నావు.. అసలు ఈ కొత్త కంపెనీ ఎందుకు పెడుతున్నామో నీకు తెలుసు కదా..? మళ్లీ ఇలా అడుగుతున్నావేంటి..?

కావ్య: ఏవండి… తాతయ్య గారు మన కుటుంబం ఎప్పుడూ ఉమ్మడి కుటుంబంలా కలిసే ఉండాలి అంటుంటారు. అలాంటిది ఇప్పుడు కంపెనీ విషయంలో వేరు చేస్తున్నారు అని తెలిస్తే..

రాజ్‌: ఎలా తెలుస్తుంది. ఒకటి నువ్వు చెప్పాలి లేదంటే నేను చెప్పాలి.. కాబట్టి డోంట్‌ వర్రీ అలా ఏం జరగదు..

కావ్య: ఒకటి చెప్పండి మనం చేస్తున్నది కరెక్టేనా..?

రాజ్‌: మన మనసుకు ఏది అనిపిస్తే అది చేయాలని నువ్వే అంటుంటావు కదా కళావతి.. పైగా దీని వల్ల ఎవ్వరికీ నష్టం కూడా లేదు

కావ్య: కానీ కొత్త కంపెనీ వల్ల ఫ్యామిలీలో ఎదైనా గొడవలు వచ్చి..

రాజ్‌: కళావతి అలా ఏం జరగదు.. నువ్వే ఇలా టెన్షన్‌ పడి అందరికీ చెప్పేసేలా ఉన్నావు.. గుర్తుంది కదా కంపెనీ పూర్తిగా ఎస్టాబ్లిష్‌ అయ్యే వరకు ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు

కావ్య: సరే… అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రాహుల్‌కు మన ఆఫీసులో ఏదైనా కొంచెం ఫ్రీడమ్‌ ఇద్దామా..? అక్క ఫీల్‌ అవుతుంది కదా..?

రాజ్‌: నో అప్పుడే వద్దు రాహుల్ కు ఇంకా బాధ్యత తెలియాలి.. తను పూర్తిగా హ్యాండిల్‌ చేయగలడు అన్న నమ్మకం నాకు రావాలి

అంటూ రాజ్‌ చెప్పగానే కావ్య సరే అంటూ వెళ్లిపోతుంది. మరోవైపు రాహుల్‌ ఆఫీసులో శృతితో వల్గర్‌గా మాట్లాడుతుటాడు. శృతి మనసులో రాహుల్ ను తిట్టుకుంటుంది. అడిట్‌ ఫైల్‌ ఇవ్వమని రాహుల్‌ అడగ్గానే.. మేనేజర్‌ రాగానే తీసుకొచ్చి ఇస్తానని చెప్తుంది. తర్వాత శృతి ఫైల్‌ ఇవ్వగానే అందులో రాజ్‌ సీక్రెట్‌ గా పెడుతున్న కంపెనీకు ఫండ్స్‌ ట్రాన్స్‌ ఫర్‌ అయినట్టు చూసి ఆర్‌ కంపెనీ గురించి తెలుసుకోవాలని అక్కడికి వెళ్తాడు రాహుల్‌. అక్కడి మేనేజర్‌ రాహుల్‌ను చూసి ఇతనొచ్చాడేంటి ఇక్కడకు అనుకుంటాడు.

మేనేజర్‌: సార్‌ మీరు ఏంటి ఇక్కడికి వచ్చారు

రాహుల్‌: ఏం లేదు కొత్త కంపెనీ పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చాను రాజ్‌ పంపించాడు..వర్క్‌ ఎంత వరకు వచ్చింది

మేనేజర్‌:  పార్టిషన్‌ పనులు మూడు రోజుల్లో పూర్తి అవుతాయి. ఇంటీరియల్‌, ఆఫీస్‌ పనులు ఇంకో పది రోజుల్లో పూర్తి అవుతాయి సార్

రాహుల్‌: ఓ చాలా త్వరగా పూర్తి చేస్తున్నారు

మేనేజర్‌: రాజ్‌ సార్‌ ఇప్పటికే చాలా లేట్‌ అయింది అని కోప్పడుతున్నారు సార్‌

రాహుల్‌: అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది

అంటూ రాహుల్‌ అడిగితే మేనేజర్‌ మొత్తం చెప్తాడు. మేనేజర్‌ మాటలకు రాహుల్‌ షాక్‌ అవుతాడు. రాజ్‌ ఇక నా పవర్‌ ఏంటో చూపిస్తా నీకు అని మనసులో అనుకుని వెళ్లిపోతాడు రాహుల్. తర్వాత ఇంట్లో జరుగుతున్న పెళ్లి రోజు వేడుకలు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారని రుద్రాణి, ఇందిరాదేవిని తిడుతుంది. ఇందిరాదేవి రుద్రాణిని తిట్టి పంపిచేస్తుంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన రాహుల్‌ స్వప్నకు రాజ్‌ కొత్త కంపెనీ గురించి చెప్తాడు. పూర్తి వివరాలు తెలియాలంటే రాజ్‌ లాప్‌టాప్‌ తీసుకొస్తానని స్వప్న రాజ్‌ రూంలోకి వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!