Brahmamudi Serial Today Episode: గేటు దగ్గర కారు ఎక్కుతున్న కళ్యాణ్‌ను చూస్తుంది ధాన్యలక్ష్మీ. కళ్యాన్ ఏంటి ఈ టైలో బయటకు వెళ్తున్నాడు. ఇద్దరూ కలిసి వెళ్లిపోతున్నారా..? ఏంటి అని అనుమానపడుతుంది. గదిలో ఉన్నారే లేరో చూద్దామని గది దగ్గరకు వెళ్తుంది. లోపల ఉన్న రాజ్, కావ్య ఎవరో గది దగ్గరకు వచ్చారని పసిగడతారు. వెంటనే తమ ఫోన్లలో ఉన్న కళ్యాణ్, అప్పు వాయిస్ లు ప్లే చేస్తారు. ఆ వాయిస్ విన్న ధాన్యలక్ష్మీ ఇక్కడే ఉన్నారు అనవసరంగాఅనుమాన పడ్డాను అనుకుంటుంది. ఇంతలో ప్రకాష్ వస్తాడు.
ధాన్యలక్ష్మీ: ఏంటండి మీరు అలా వెనక వచ్చి నిలబడ్డారు. ఎవరో అనుకుని బయపడ్డాను
ప్రకాష్: నీకసలు బుద్దిందా..? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..?
ధాన్యలక్ష్మీ: ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు
ప్రకాష్: ఎందుకు తిడుతున్నానో నీకు ఇంకా అర్తం కాలేదా..? కొడుకు, కోడలు శోభనం గదిలో ఉంటే వాళ్ల మాటలు వినడానికి నీకు అసలు సిగ్గు అనిపించడం లేదా..?
ధాన్యం: చాల్లే ఊరుకోండి నాది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదు
ప్రకాష్: అందుకేనా ఇలా చాటుగా వింటున్నావు
ధాన్యం: అయ్యో అది కాదండి ఇందాక ఎవరో బయటకు వెళ్లారు. మన కళ్యాణ్ వాళ్లేమోనని అనుమానం వచ్చి గదిలో ఉన్నారేమోనని వచ్చి వాళ్ల మాటల వింటున్నా…
ప్రకాష్: అయినా నేను చూశాను కాబట్టి సరిపోయింది కానీ వేరే ఎవరయినా చూస్తే
అంటూ ప్రకాష్, ధాన్యాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. హాల్లో కూర్చున్న అపర్ణ, ఇంద్రాదేవి రాజ్ గురించి మాట్లాడుకుంటుంటారు.
ఇందిరాదేవి: కళ్యాణ్ అప్పు శోభనం గదిలోకి వెళ్లారు. మరి రాజ్, కావ్య వాళ్లు ఎక్కడికి వెళ్లారు
అపర్ణ: ఇల్లు మొత్తం చూశాను అత్తయ్యా ఎక్కడా కనిపించలేదు
ఇందిరాదేవి: ఇందాక పెళ్లికి వద్దన్నాను కదాని ఏకంగా శోభనానికే ప్లాన్ చేశాడా ఏంటి వీడు
అపర్ణ: ఊరుకోండి అత్తయ్యా నా కొడుకు అలాంటి వాడేం కాదు
ఇందిరాదేవి: అవునా అందుకేనా బూత్ బంగ్లాకు తీసుకెళ్లాడు.. ఉండూ ఫోన్ చేస్తాను
అని రాజ్ కు ఫోన్ చేస్తుంది. రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే.. ఎక్కడున్నావు అని అడుగుతుంది ఇందిరాదేవి.
ఇందిరాదేవి: ఎక్కడున్నావు ఇందాకటి నుంచి నీ కోసం చూస్తున్నాము.. నువ్వు కనిపించడం లేదు. నా మనవరాలు కనిపించడం లేదు
రాజ్: వావ్ నాన్నమ్మ నీకు పదికి పది మార్కులు పడ్డాయి. కళావతి గారు నాతోనే ఉన్నారు.
ఇందిరాదేవి: అనుకున్నాను.. ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు..
కావ్య: (ఫోన్ లాక్కుని) ఏం లేదు అమ్మమ్మ ఇందాక మీ మనవడు పూలు ఎక్కువ తెచ్చారు కదా వాటిని ఆరబెట్టి అగరబత్తీలు చేద్దామని టెర్రస్ మీద ఉన్నాం
అని చెప్పగానే ఆ ఆరబెట్టేది ఏదో అయిపోయాక వచ్చేయండి అని చెప్తుంది. వీడు ప్రపోజ్ చేసే పనిలోనే ఉన్నట్టున్నాడు అపర్ణ అని చెప్తుంది ఇందిరాదేవి. మరోవైపు స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయిన చార్లెస్ గాడు ఏకంగా అప్పు కారునే ఢీ కొడతాడు. దీతో అప్పు కారు దిగి పట్టుకునే లోపే మళ్లీ పారిపోయి దుగ్గిరాల ఇంట్లో శోభనం గదిలోకే వెళ్తాడు. కరెంట్ ఆప్ చేసి రాజ్, కావ్యలను తాడుతో కట్టేస్తాడు. తర్వాత కరెంట్ ఆన్ చేస్తాడు. చార్లెస్ ను చూసిన కావ్య, రాజ్ షాక్ అవుతారు. నువ్వు ఎవరి ఇంట్లో దూరావో తెలుసా..? నిన్ను పట్టుకోవడానికి బయటకు వెళ్లిన పోలీస్ ఇంట్లోనే దూరావు తను నా చెల్లి అని చెప్తుంది కావ్య. దీంతో చార్లెస్ భయపడతాడు. అయినా సరే నన్ను సిటీ అంతా వెతికి అలిసి మీ పోలీస్ ఇంటికి వచ్చేలోపు నేను హాయిగా ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను అంటాడు చార్లెస్. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!