Brahmamudi Serial Today Episode: ఎక్కువ పూలు ఆర్డర్‌ చేశాడని కావ్య, రాజ్‌ను తిడుతుంది. చెప్పినా వినకుండా ఇన్ని పూలు తెప్పించారు. ఇవన్నీ ఏం చేస్తారని అడుగుతుంది కావ్య. మిగిలిన పూలన్నీ అమ్మాయి వచ్చే మెట్ల దగ్గర నుంచి రూం వరకు వేద్దామని చెప్తాడు రాజ్‌. అదంతా స్వామీజీలకు లీడర్లకు చేసే సెటప్‌ అంటూ కావ్య వెటకారంగా చెప్తుంది.

రాజ్‌: కాస్త రొమాంటిక్‌ ఫీల్‌ ఉండాలండి అందుకే ఇలా

కావ్య: ఇప్పుడంత రొమాంటిక్‌గా ఆలోచించి ఏం చేయాలో

రాజ్‌: అంటే ఒకరి మనసులో ఫీలింగ్స్‌ ఒకరు చెప్పుకోవాలి

కావ్య: నా మనసులో ఏ ఫీలింగ్స్‌ లేవు.

రాజ్‌:  అబద్దం నా కళ్లలోకి సూటిగా చూసి చెప్పండి

కావ్య: చూసే చెప్తున్నా.. ఏం లేదు..

రాజ్‌:  నా గురించి కూడా ఏమీ ఆలోచించడం లేదా మీరు

కావ్య: ఏం ఆలోచించాలి

రాజ్‌: నా మీద ఉన్న మీ ఒపీనియన్‌ ఏంటి

కావ్య: ఓపీనియన్‌ ఏంటి ఏం లేదు

రాజ్‌: అబద్దం.. మీ కళ్లు నాకేదో చెప్తున్నాయి

కావ్య: ఏం చెప్తున్నాయి

రాజ్‌: మన మధ్య ఉన్న బంధాన్ని చెప్తున్నాయి.

కావ్య, అప్పు రూంలోకి వస్తారు. రాజ్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు.

రాజ్‌: రేయ్‌ మీరు ఎప్పుడు వచ్చారురా

కళ్యాణ్‌: మీరు కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసుకుంటుంటే వచ్చాము

రాజ్‌: ఎందుకొచ్చారు. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది కదా..? అయినా ప్రైవసీ అనేది ఒకటుంది. అది గమనించుకోరా..? ఎంత సేపు మీ ఎమోషన్సే కానీ మా ఎమోషన్స్‌ను గుర్తించరా..?

కళ్యాణ్‌:  అన్నయ్యా.. మీ ప్రస్టేషన్‌ గురించి తర్వాతైనా ఆలోచించుకోవచ్చు. ముందు మా పరిస్తితి ఏంటో తెలుసుకో

రాజ్‌:  అసలే చిరాకులో ఉన్నాను చిటికెలో చెప్పు

అనగానే.. కళ్యాణ్‌ అప్పు జరిగిన విసయం చెప్తారు. అయితే మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎస్కేప్‌ చేసే బాధ్యత నాది మీరొచ్చే వరకు ఇక్కడే మీలాగా నేను కళావతి గారు ఉంటాం అని చెప్తాడు.

కావ్య: మనం ఇక్కడ ఎందుకుండాలి

రాజ్‌: వాళ్లు రూంలో లేకపోతే ఎవరో ఒకరు వాళ్ల ప్లేస్‌లో ఉండాలి కదా..?

కావ్య: లేదు చిన్నత్తయ్యను మోసం చేయలేము.. నేను అత్తయ్యను కన్వీన్స్ చేస్తాను.

రాజ్‌: ఆవిడ కన్వీన్స్‌  కాకపోతే ఎలా

కావ్య: అప్పుడు ఆలోచిద్దాం

అంటుంటే.. ధాన్యలక్ష్మీ బయటి నుంచి అప్పు, కళ్యాణ్‌ లను పిలుస్తుంది. అప్పు, కళ్యాణ్‌ వెళ్లిపోతారు. తర్వాత అందరూ కలిసి కళ్యాణ్‌, అప్పులను శోభనం గదిలోకి పంపిస్తారు.

అప్పు: సారీ కూచి..

కళ్యాణ్‌: ఏమైంది పొట్టి ఇప్పుడెందుకు సారీ చెప్తున్నావు

అప్పు: సారీ కూచి ఈ రోజు సంతోషంగా మన ఫస్ట్ నైట్‌ జరగాలి కానీ నా వల్ల నీకు ఆ సంతోషమే లేకుండా పోయింది. అనవసరంగా నిన్ను టెన్షన్‌ పెడుతున్నాను

కళ్యాణ్‌: ఎప్పటి నుంచి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. నా ప్రాబ్లమ్‌ నీ ప్రాబ్లమ్‌ అంటూ వేరు వేరుగా ఆలోచించడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు.

అప్పు: అది కాదు కూచి అత్తయ్య గారు చేప్పినట్టు నేను ఈ జాబ్‌ చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ టెన్షన్‌ వచ్చేది కాదు కదా..? ఆవిడ మాట వినకుండా తప్పు చేశానా అనిపిస్తుంది

కళ్యాణ్‌: అవును తప్పు చేస్తున్నావు.. ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ తప్పు చేస్తున్నావు.. పోలీస్‌ అవడం నీ కల దానికోసం నువ్వు నేను ఎంత కష్టపడ్డావో మర్చిపోయాయా? ఈ ఫస్ట్‌ నైట్‌ ఇప్పుడు కాకపోతే రేపు పెట్టుకుంటాం. కానీ జాబ్‌ అనేది పోతే లైఫ్‌లాంగ్‌ బాధపడతాం. అప్పుడు నువ్వు ఇంట్లో కూర్చోవాలి. అది నీకు ఇష్టమేనా..?

అప్పు:  థాంక్స్‌ కూచి మా అమ్మ కూడా నన్ను ఇంతలా అర్థం చేసుకోలేదు.

 అంటూ హగ్‌ చేసుకుంటుంది. ఇంతలో రాజ్‌, కావ్య వచ్చి ఇక్కడ మేము ఉంటాము మీరు వెనక డోర్‌ నుంచి వెళ్లిపోండి అని చెప్తారు. అప్పు, కళ్యాణ్‌ వెనక డోర్‌ నుంచి వెళ్తారు. కొద్ది దూరం వెళ్లాక కావ్య రూంలోకి వెళ్లి చీర నగలు అక్కడ పెట్టి అప్పు డ్రెస్‌ మార్చుకుని వెళ్లపోతుంది. అప్పు అక్కడ నగలు పెట్టడం రాహుల్ చూస్తాడు. వెతకబోయే తీగ కాళ్లకు తగిలడం అంటే ఇదేనేమో అనుకుంటాడు. బయట కళ్యాణ్‌, అప్పు కారు ఎక్కి వెళ్లిపోవడం ధాన్యలక్ష్మీ చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!