Brahmamudi Serial Today Episode:  ధాన్యలక్ష్మీ కరాకండిగా ఇవాళే మీ శోభనం జరిగి తీరాల్సిందేనని చెప్పడంతో అప్పు కోపంగా కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి నువ్వే ఎలాగైనా శోభనం పోస్ట్‌ ఫోన్‌ చేయాలని చెప్తుంది. నువ్వే కావాలని మీ అమ్మకు చెప్పి ఈ ఏర్పాట్లు చేయిస్తున్నావేమోనని తనకు డౌటుగా ఉందని అంటుంది. దీంతో కళ్యాణ్‌ నేనేం చెప్పలేదని.. మనం గదిలో మాట్లాడుకోవడం మా అమ్మ విందేమోనని అంటాడు.

అప్పు: అయితే నాకు మాత్రం కదరదు నేను చార్లెస్ అనే దొంగను పట్టుకున్నాను. వాడు ఇప్పటికే 49 సార్లు తప్పించుకున్నాడు. మళ్లీ ఇప్పడు తప్పించుకుంటే.. మా డిపార్ట్‌మెంట్‌ పరువు పోతుంది. అందుకే మా సీఐ గారు నాకు గట్టిగా చెప్పారు. ఈసారి వాడు తప్పించుకుంటే నన్ను సస్పెండ్‌ చేస్తా అన్నారు

కళ్యాణ్‌: అలాగా అయితే మీ సీఐ గారికి ఫ్యామిలీ ప్రాబ్లమ్‌ అని చెబితే

అప్పు: నేను ఇవాళ రాత్రికి స్టేషన్‌లోనే ఉంటానని చెప్పగానే ఆయన ఫ్యామిలీతో  తిరుపతి వెళ్లిపోయారు.. అందుకే నేను తప్పకుండా స్టేషన్‌కు వెళ్లాలి. నువ్వే ఎలాగైనా ఆంటీని ఒప్పించి.. ఫస్ట్‌నైట్‌ను పోస్ట్ ఫోన్‌ చేయించాలి

ధాన్యలక్ష్మీ: అది మాత్రం జరగదు. నీకు ఇందాకే చెప్పాను. ఈరోజు నేను పెట్టిన ముహూర్తానికే మీకు మొదటి రాత్రి జరగాల్సిందే..

అప్పు:  అది కాదు అత్తయ్యా..

ధాన్యలక్ష్మీ: ఇంకా నాకేం చెప్పకు నేను వీడిలాగా చవటను కాదు. నువ్వు వెళ్లి మీ స్వప్న గదిలో కూర్చో.. నువ్వు మా గదిలోకి వెళ్లు కళ్యాణ్‌.

అంటూ ఇద్దరిని పంపించి ఎలాగైనా ఇవాళ  మిమ్మల్ని వదిలేది లేదు అని ధాన్యలక్ష్మీ అనుకుంటుంది. మరోవైపు కిచెన్‌లో వంట చేస్తున్న కావ్య దగ్గరకు రాజ్‌ వెళ్తాడు.

రాజ్‌: అవతల మీ చెల్లెలు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లకుండా స్వప్న గదిలో కూర్చుంది. ఇవతల మా తమ్ముడు ఫస్ట్‌ నైట్‌ ఎప్పుడెప్పుడా అని వాళ్ల నాన్న గదిలో కూర్చున్నాడు.

కావ్య: అలా అని మీకు చెప్పారా..?

రాజ్‌:  చెప్పాలా సాటి మగాడిగా నా తమ్ముడి బాధేంటో అర్థం చేసుకోగలను

కావ్య: అందరి మనసులు బాగానే అర్తం చేసుకుంటున్నారు ఒక్క నా మనసు తప్పా( మనసులో అనుకుంటుంది.)

రాజ్:  ఏంటి ఏమ్మన్నారు..?

కావ్య: ఏం లేదు. వచ్చిన పనేంటో చెప్పండి

రాజ్‌: అంటే ఇందాక అందరి ముందు వాళ్ల శోభనం గదిని అందంగా అలంకరిస్తామని చెప్పాము కదా.. అందుకే మీరు ఇంకా ఇలా ఉంటే ఎలా

కావ్య: పంతులు గారు చెప్పింది రాత్రి పదకొండు గంటలకు దానికి ఇంకా చాలా టైం ఉంది

రాజ్‌: అసలే మన దగ్గర టైం లేదు మీరు వంట తర్వాత చేసుకోవచ్చు రండి

అంటూ కావ్య చేయి పట్టుకుని లాక్కెళ్లతాడు రాజ్‌. కావ్య తదేకంగా రాజ్‌ను చూస్తూ వెనకాలే వెళ్తుంది. కావ్యను తీసుకెళ్లి లిస్టు రాయమని రాజ్‌ చెప్తుంటే.. కావ్య ఆశ్చర్యపోతుంది.

కావ్య:  ఇవన్నీ ఎందుకు.. నేను రాయను

అనగానే రాజ్‌, కావ్యతో గొడవకు దిగుతాడు. ఇంతలో అపర్ణ, ఇంద్రాదేవి వస్తారు.  ఇందిరాదేవి: అబ్బబ్బా ఏమైంది ఎందుకు అలా గొడవ పడుతున్నారు

రాజ్‌: నాన్నమ్మ చూడు నాకో డౌటు.. ఇవాళ మన ఇంట్లో జరుగుతున్నది దుగ్గిరాల ఇంటి వారసుడి శోభనమేనా..?

ఇందిరాదేవి: నీకా డౌటు ఎందుకు వచ్చింది

రాజ్‌: మీ మనవరాలి మాటలు వింటుంటే ఆ అనుమానమే వస్తుంది.

అపర్ణ: అసలు ఏమైంది ఇప్పుడు

రాజ్‌:  అరె గుప్పెడు స్వీట్లు, కాసిని పళ్లు తెమ్మంటే గొడవ చేస్తుంది.

కావ్య:  ఏంటి నేను గొడవ చేస్తున్నానా… మీరు చెప్పిన లిస్టు ఏంటో వాళ్లకు చెప్పండి

రాజ్‌: ఏముంది వంద కిలోల మల్లెపూలు, వంద కేజీల రోజా పూలు, ఐదు కేజీల లడ్డు, ఐదు కేజీల జాంగ్రీ

అపర్ణ: చాలు చాలు ఇక నువ్వు ఏమేం చెప్తున్నావో మాకు అర్థం అయింది. ఒసేయ్‌ వాడు ఏం చెప్పాడో అవన్నీ తీసుకురా.?

సరే అంటూ కావ్య వెళ్లిపోతుంది. స్టేషన్‌లో చార్లెస్‌ మనిషి పోలీసులకు టీ ఇవ్వగానే ఆ టీ తాగిన అందరూ మత్తుగా నిద్రపోతారు. మరోవైపు స్వప్న, అప్పును రెడీ చేస్తుంటే.. ఆ నగలు ఎప్పుడు కొట్టేయాలా అని రాహుల్‌ ప్లాన్‌ చేస్తుంటాడు. ఇంతలో స్టేషన్‌ నుంచి కానిస్టేబుల్‌ అప్పుకు ఫోన్‌ చేసి చార్లెస్‌ తప్పించుకున్నాడని చెప్తాడు. అప్పు కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. ఎలాగైనా వాడిని ఈ రాత్రికే పట్టుకోవాలని చెప్తుంది. అయితే రాజ్‌ అన్నయ్యను హెల్ప్‌ అడుగుదామని కళ్యాన్ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!