Brahmamudi Serial Today Episode: రాజ్‌తో సరిగ్గా మసులుకోమని కావ్యను తలంటుపోస్తారు అపర్ణ, ఇందిరాదేవి. నువ్వు ఎన్ని చెప్పినా మారకపోతే ఇక మా మనవడి వైపు నుంచి నరుక్కోస్తామని ఇందిరాదేవి చెప్పి అపర్ణను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాజ్‌, కావ్యను ఎలా ఇప్రెస్‌ చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటాడు.

రాజ్: ఈ ఓల్డ్‌ పీపుల్స్‌ను నమ్ముకుని లాభం లేదు. కళావతి గారిని ఇంప్రెస్‌ చేయడానికి మనమే యూత్‌ ఫుల్‌గా ఆలోచించాలి. తమ్ముడేంటి తాచు పాములా మెలికలు తిరుగుతున్నాడు. అవును తమ్ముడు మంచి కవి కదా తమ్ముడితో మంచి కవిత్వం రాయించుకుని కళావతి గారికి వినిపించి ఇంప్రెస్‌ చేయోచ్చు. (దగ్గరకు వెళ్తాడు) అబ్బో పెళ్లాంతో పులిహోర కలుపుతున్నాడా.? అయినా వీళ్లిద్దరికీ పెళ్లి అయింది కదా ఇలా మాట్లాడుకోవడం ఏంటి..? ( మనసులో అనుకుని) కళ్యాణ్‌ నువ్వు తర్వాత మాట్లాడుకోవచ్చు.. ఒక ఇంపార్టెంట్‌ పని ఉంది.

కళ్యాణ్‌: ఆగు అన్నయ్యా ఇక్కడ అంతకంటే ఇంపార్టెంట్‌ మ్యాటర్‌ ఉంది.

రాజ్‌:  నీ పొట్టిదే కదా తర్వాత మాట్లాడుకోవచ్చు కదా

కళ్యాణ్‌: తర్వాత అంటే అది తప్పించుకుంటుంది అన్నయ్యా నువ్వు కాస్త సైలెంట్‌గా ఉండు.. ఇదిగో పొట్టి నువ్వు వస్తున్నావా..? లేదా..?

అప్పు: నేను పని మీద వెళ్తున్నాను

కళ్యాణ్‌: అయితే ముద్దు అయినా పెట్టు

అప్పు కారు పక్కకు ఆపుకుని ముద్దు ఇవ్వబోతుంటే.. రాజ్‌ ఫోన్‌ లాక్కుంటాడు. కళ్యాణ్‌:  ఏయ్‌ అన్నయ్యా ఎమైంది

రాజ్‌: కుళ్లురా నాకు కుళ్లు నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు

కళ్యాణ్‌: ఎందుకు కుళ్లు అన్నయ్యా

అని కళ్యాణ్‌ అడగ్గానే.. కావ్య డ్రెస్‌ విసిరేసింది మొత్తం చెప్తాడు రాజ్‌.

కళ్యాణ్‌:  నాన్నమ్మ మాటలు నమ్మి వదినను డిస్టర్బ్‌ చేస్తావా..?

రాజ్: అందుకే ముందు నువ్వు వచ్చి నాకో లెటర్‌ రాయి.. ఇంకోసారి మీ వదిన విషయంలో తప్పు చేయాలనుకోవడం లేదు. అందుకే నిన్ను హెల్ప్‌ అడుగుతున్నాను..

 సరేనన్న కళ్యాణ్‌ పేపర్‌ తీసుకుని రాజ్‌ చెప్తుంటే లెటర్‌ రాస్తాడు. రాసేది అయిపోయాక లెటర్‌ రాజ్‌ చేతిలో పెట్టి నేరుగా వెళ్లి వదినకు ఇవ్వు అంటాడు. రాజ్‌ వెళ్లిపోతాడు. హాల్లో రుద్రాణి కావ్యకు పెళ్లి అయిందన్న నిజం ఎలాగైనా ఇవాళ రాజ్‌కు చెప్పాలి అని ఆలోచిస్తుంది.

రుద్రాణి: ఏంటి దాచేస్తున్నావు..?

రాజ్‌: దాచాల్సింది కాబట్టి.. దాచేస్తున్నాను.

రుద్రాణి: అదే ఏంటి అని అడుగుతున్నాను..?

రాజ్‌: ఇప్పుడు చూడకూడదని దాచిపెట్టానంటే దాని అర్థం ఏంటి..?

రుద్రాణి: నేను చూడకూడదని

రాజ్‌:  మరి మీరు చూడకూడనిది ఏముంటే మీకు ఎందుకండి.. అయినా మీరు ఎందుకు అడ్డు నిలబడ్డారో తెలియడం లేదు.

రుద్రాణి: నీ గురించి ఒక సీక్రెట్‌ విషయం చెప్పాలి

రాజ్‌: నేను కూడా కళావతి గారి గురించి ఒక విషయం తెలసుకోవాలి.

రుద్రాణి:  నేను కూడా కళావతి గురించే చెప్పాలనుకుంటున్నాను.

రాజ్‌: అవునా అయితే నేను పైకి వెళ్లి తెలసుకుని వచ్చాక మీరు చెప్పేది వింటాను..

అంటూ రాజ్‌ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు.

రుద్రాణి: కావ్యకు పెళ్లైన విషయం చెబుదామంటే వినకుండా వెళ్లిపోతాడేంటి…?

స్వప్న: తిట్టకుండా వెళ్లాడు సంతోషించు అత్త. అయినా నా చెల్లి విషయంలో నువ్వెందుకు ఇలా తయారయ్యావు అత్త. అవును అత్తా ఉదయం నుంచి నీ సుపుత్రుడు కనిపించడం లేదేంటి..?

రుద్రాణి: వాడు ఎక్కడికి వెళ్లాడో నాకు ఎలా తెలుస్తుంది.

స్వప్న: మళ్లీ ఏదైనా కొంపలు కూల్చమని నువ్వే పంపించి ఉంటావు

అంటూ స్వప్న తిడుతుంటే కట్‌ చేస్తే రాహుల్ ఒక అమ్మాయి దగ్గర డాన్స్‌ చేస్తూ ఉంటాడు. మరోవైపు రాజ్‌ లెటర్‌ తీసుకుని వెళ్లి కావ్యకు ఇస్తాడు. కావ్య లెటర్‌ తీసుకుని చదువుతూ ఉంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!