అన్వేషించండి

Brahmamudi Serial Today May 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుతో అపర్ణ ఎమోషనల్‌ - చలపతికి నిజం చెప్పిన రాజు

Brahmamudi serial today episode May 21st: ఇంటికి వారసురాలైన తన మనవరాలు ఇంట్లో పనిమనిషి అయిందని అపర్ణ, రాజుతో ఎమోషనల్‌ అవుతుంది. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Brahmamudi Serial Today Episode: ఆఫీసుకు వెళ్లిన రాజు అక్కడ రచ్చ రచ్చ చేసి రేఖ, భూషణ్‌లకు టెన్షన్‌ పుట్టిస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి భ్రమరాంబకు వార్నింగ్‌ ఇస్తాడు. ఇలాంటి ట్విస్టులతో బ్రహ్మముడి ఇవాళ చాలా ఆసక్తిగా జరిగింది.

రాజు ఆఫీసుకు తన కారు తీసుకుపోయాడనే బాధతో భ్రమరాంబ బయటే నిలబడి చూస్తుంటుంది. ఇంతలో కారేసుకుని రాజు, ఇందు వస్తారు. తన కారు చూడగానే.. దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి నా కారు నా కారు అంటుంది భ్రమరాంబ.

రాజు: ఏంటత్తయ్యా కారు కాకుండా కారు పార్ట్స్‌ వస్తాయి అనుకున్నారా..?

శేషు: మేము అనుకున్నామని నీకెలా తెలుసు అల్లుడు

రాజు: గెస్‌ చేశాను

శేషు: ఇంత ముందు చూపు ఉంది కాబట్టే ఎక్కడో బస్తీలో ఉండాల్సిన వాడివి ఈ కోటకు అల్లుడు అయ్యావు. ఇందుకు తోడుగా ఉన్నావు.

రాజు: మామయ్య ఇందుకు అండగా ఉండటం నా బాధ్యత. నా పేమెంట్‌కు నేను న్యాయం చేయాలి కదా..?

శేషు: పేమెంటా..? ఏం పేమెంటు..? ఏం న్యాయం..

రాజు: అదే కంపెనీలో ఎంప్లాయీస్‌కు ఇచ్చే పేమెంట్‌ గురించి అయినా అత్తయ్యా భయపడకు నీ కారుకు ఏమీ కాలేదు కాస్త దుమ్ము పట్టింది అంతే

భ్రమరాంబ: బుద్ది ఉన్నోడు ఎవడైనా ఇంత పాస్ట్‌గా కారు నడుపుతాడా..?

రాజు: ఓయ్‌ ఏంటత్తయ్యా బుద్ది అదీ ఇది అంటున్నావు.. అప్పుడే ఈ రాజు గాడి హ్యండ్‌ పవర్‌ మర్చిపోయావా..? అత్తయ్యా ఎంతైనా నీ కారు చాలా అదృష్టం చేసుకుంది

శేషు: ఎందుకు బాబు

ALSO READ: మీ పుట్టిన తేదీ 1,10,19 లేదా 28 అయితే ఈ లక్షణాలు మీలో ఉంటాయి!

రాజు: ఎందుకంటే నేను డ్రైవింగ్‌ చేశాను కాబట్టి

భ్రమరాంబ: సరేల బాబు.. మరోసారి మాత్రం నా కారు జోలికి రావొద్దు.

రాజు: నాకు ఏదైనా ఒక్కసారి నచ్చిందంటే వదిలే ప్రసక్తే లేదు.. ప్రతిరోజు నేను ఈ కారే తీసుకెళ్తాను. ముందు కారును శుభ్రం చేయండి

అని చెప్తుండగానే.. రాజుకు చలపతి ఫోన్‌ చేస్తాడు. నాన్నేంటి ఫోన్‌ చేస్తున్నారు. అనుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతాడు రాజు. మరోవైపు వెంకట్‌ను తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్తుంది నందు.

వెంకట్‌: ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు..?

నందు: చెప్తాను ఉండు.. బ్రహ్మముడి యాప్‌ నుంచి నీకోసం ముగ్గురు అమ్మాయిలను సెలెక్ట్‌ చేశాను. వారిలో నీకు నచ్చిన అమ్మాయిని చూసి ఆ అమ్మాయితోనే నువ్వు ఫ్రెండిషిప్‌ చేసుకో.. చాటింగ్‌, ఫోన్‌ లాంటివి చేసుకో ఇక నన్ను డిస్టర్బ్‌ చేయకు

అంటూ చెప్తుండగానే.. ఒక అమ్మాయి వస్తుంది. ఆమెతో మాట్లాడిన వెంకీ తాను నచ్చలేదని వెళ్లిపోమ్మని చెప్తాడు. పక్క టేబుల్‌ దగ్గర కూర్చుని అంతా గమనించిన నందు కోపంగా వెంకట్‌ ను తిడుతుంది. మరోవైపు గార్డెన్‌లోకి వెళ్లిన రాజు, చలపతి చేసిన వీడియో కాల్‌ లిప్ట్ చేస్తాడు.

చలపతి: ఓరేయ్‌ నువ్వేంటి నీ అవతారం ఏంటి..? నువ్వేంట్రా అంత కాస్లీ బట్టలు వేసుకున్నావు..

రాజు: ఏం బాగాలేవా..? నేను మీ కొడుకులా అనిపించడం లేదా..? ఏంటి..? కోటీశ్వరుల ఇంటి బిడ్డలా అనిపిస్తున్నానా..?

లక్ష్మీ: ( మనసులో) నువ్వు నిజంగా కోటీశ్వరుల ఇంటి బిడ్డవిరా

చలపతి: ఏంట్రా నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు. నీకు ఫోన్‌ చేస్తే స్విచ్చాప్‌ వస్తుంది. ఆ లక్కీగాడు కూడా ఏమీ తెలియదు అంటున్నాడు. ఎవరికి ఏమీ చెప్పకుండా ఏం చేస్తున్నావు

రాజు: బిజినెస్‌లో ఉన్నానని చెప్పాను కదా నాన్న. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను.

చలపతి: బిజినెస్సా..? ఆ సాహు గాడితో బిజినెస్‌ క్యాన్సిల్‌ చేసుకున్నానని చెప్పావు కదరా..

రాజు: నాన్న ఇది వేరే బిజినెస్‌ చూడు నా డ్రెస్‌ నా స్టైల్‌ ఎలా ఉన్నాయో.. బిజినెస్‌ చేస్తే ఇలాగే రిచ్‌గా ఉంటాము నాన్న ఓకే మీకు తర్వాత కాల్‌ చేస్తాను

అని రాజు కాల్‌ కట్‌ చేస్తాడు. చలపతి, లక్ష్మీ ఇద్దరూ రాజు గురించి మాట్లాడుకుని ఎమోషనల్ అవుతారు. కాల్‌ కట్‌ చేసి తిరిగి లోపలికి వెళ్లబోతున్న రాజుకు ఏడుస్తున్న అపర్ణ కనిపిస్తుంది. రాజు షాక్‌ అవుతాడు. అపర్ణ రాజు దగ్గరకు వెళ్తుంది.

అపర్ణ: బాబు మా కష్టాలన్నీ తీర్చడానికి ఆ దేవుడే నిన్ను ఇలా మా ఇంటికి పంపినట్టు ఉన్నాడు. ఈ రోజు నువ్వు నా మనవరాలిని ఆఫీసుకు తీసుకెళ్లాక నాకు ధైర్యం వచ్చింది. ఆస్థి కంపెనీని అన్నింటిని నువ్వు కాపాడతావన్న దైర్యం వచ్చింది. నువ్వు మా కన్నీళ్లు తుడవడానకి మా ఇంటికి వచ్చావనిపిస్తుంది బాబు. నా మనవరాలికి నువ్వు ఎప్పుడూ ఇలాగే తోడుగా ఉంటావా..?

రాజు: (మనసులో) ఈవిడేంటి ఇంతలా ప్రేమ కురిపిస్తుంది. ప్రేమ తాళ్లతో కట్టిపడేస్తుంది. వామ్మో మనం వీటికి లొంగిపోకూడదు. మనకు డబ్బులే ముఖ్యం.

అపర్ణ: చెప్పు బాబు నా మనవరాలికి తోడుగా ఉంటావా..?

రాజు: ఉంటాను అమ్మమ్మ మీరేం కంగారు పడకండి మీ మనవరాలికి జీవితాంతం తోడుగా ఉంటాను. నా చివరి శ్వాస వరకు తోడుగా ఉంటాను..

అంటూ రాజు హామీ ఇవ్వడంతో అపర్ణ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు రెస్టారెంట్‌లో ఉన్న వెంకట్‌ దగ్గరకు రెండో అమ్మాయి వెళ్తుంది. ఆమెతో మాట్లాడిన వెంకట్‌ తను నచ్చలేదని చెప్తాడు. ఆ అమ్మాయి వెల్లిపోతుంది. ఇంట్లోకి వెళ్లిన రాజు కోపంగా అన్ని వస్తువులు పగులగొడుతూ అందరినీ పిలుస్తాడు. అందరూ వచ్చాక ఈ ఇంటి అల్లుడిగా నాకు ఏం గౌరవం ఇస్తున్నారు. నేను పడుకోవడానికి ఆ రూమేంటి..? అని నిలదీయగానే.. రేఖ, భూషణ్‌ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఆశయానికి అండగా నిలిచిన భార్య, కన్నకొడుకు! సిరి అదృష్టం నిజంగా అలా ఉందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఆశయానికి అండగా నిలిచిన భార్య, కన్నకొడుకు! సిరి అదృష్టం నిజంగా అలా ఉందా!
Karthika Deepam 2 Serial Today June 17th: కార్తీకదీపం 2 సీరియల్: బొక్కాబోర్లా పడిన జ్యోత్స్న..! సూరజ్ చేసిన పనికి నవ్వులే నవ్వులు!
కార్తీకదీపం 2 సీరియల్: బొక్కాబోర్లా పడిన జ్యోత్స్న..! సూరజ్ చేసిన పనికి నవ్వులే నవ్వులు!
Godavari Serial Today June 17th: 'గోదావరి' సీరియల్: దస్తగిరి కూడా సింహాద్రి మనిషేనా.. జానుకి నిరాశ! తోట విషయంలో అసలేం జరుగుతుంది?
'గోదావరి' సీరియల్: దస్తగిరి కూడా సింహాద్రి మనిషేనా.. జానుకి నిరాశ! తోట విషయంలో అసలేం జరుగుతుంది?
Nindu Manasulu Serial Today June 17th: నిండు మనసులు: ఓరేయ్ వెధవా.. ఇంత మోసం చేస్తావా..! ఒకే సాసర్‌లో ఇద్దరూ.. సో రొమాంటిక్!
నిండు మనసులు: ఓరేయ్ వెధవా.. ఇంత మోసం చేస్తావా..! ఒకే సాసర్‌లో ఇద్దరూ.. సో రొమాంటిక్!
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు, సీఎం, డిప్యూటీ సీఎం ఎమర్జెన్సీ మీటింగ్!
ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు, సీఎం, డిప్యూటీ సీఎం ఎమర్జెన్సీ మీటింగ్!
Gade Sai Krishna Missing Case Vijayawada: ఇంతకీ గాదె సాయికృష్ణ ఏమయ్యారు? అంబటి రాంబాబు చెప్పినట్లుగా లాకప్ డెత్ చేశారా?
ఇంతకీ గాదె సాయికృష్ణ ఏమయ్యారు? అంబటి రాంబాబు చెప్పినట్లుగా లాకప్ డెత్ చేశారా?
Maa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?
'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?
Samajwadi Party Split Rumours: యూపీలోనూ ఆపరేషన్ లోటస్ - బీజేపీతో టచ్‌లోకి 21 మంది ఎస్పీ ఎంపీలు - అఖిలేష్ ఏమంటున్నారంటే ?
యూపీలోనూ ఆపరేషన్ లోటస్ - బీజేపీతో టచ్‌లోకి 21 మంది ఎస్పీ ఎంపీలు - అఖిలేష్ ఏమంటున్నారంటే ?
Bajaj Chetak 2026 Price: ఒకసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్లు ఆగాల్సిన పని లేదు! బజాజ్‌ చేతక్‌ ఈవీ పూర్తి వివరాలు ఇవే!
ఒకసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్లు ఆగాల్సిన పని లేదు! బజాజ్‌ చేతక్‌ ఈవీ పూర్తి వివరాలు ఇవే!
Instagram Live In Partner Killed: ప్రేమ గుడ్డిది - సోషల్ మీడియా ప్రేమ పిచ్చిది కూడా - ఇరవై ఏళ్లకే ఇన్‌స్టాగ్రామ్ లవ్.. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్.. చివరకు హత్య!
ప్రేమ గుడ్డిది - సోషల్ మీడియా ప్రేమ పిచ్చిది కూడా - ఇరవై ఏళ్లకే ఇన్‌స్టాగ్రామ్ లవ్.. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్.. చివరకు హత్య!
Shiv Sena UBT MPs Rebel: ఉద్ధవ్ శివసేనకు మైండ్ బ్లోయింగ్ షాక్ - 6 గురు ఎంపీల తిరుగుబాటు.. షిండే వర్గంలో విలీనం!
ఉద్ధవ్ శివసేనకు మైండ్ బ్లోయింగ్ షాక్ - 6 గురు ఎంపీల తిరుగుబాటు.. షిండే వర్గంలో విలీనం!
Vaibhav Sooryavanshi Survives: ఔట్ అనుకొని బౌండరీ లైన్ దాకా వెళ్లిన వైభవ్.. థర్డ్ అంపైర్ వివాదస్ప‌ద నిర్ణ‌యంతో  తిరిగి బ‌రిలోకి..  అఫ్గాన్ ప్లేయర్స్ ఫైర్!
ఔట్ అనుకొని బౌండరీ లైన్ దాకా వెళ్లిన వైభవ్.. థర్డ్ అంపైర్ వివాదస్ప‌ద నిర్ణ‌యంతో  తిరిగి బ‌రిలోకి..  అఫ్గాన్ ప్లేయర్స్ ఫైర్!
Embed widget