Brahmamudi Serial Today Episode: ఇంటికి వచ్చిన తనతో కావ్య వెటకారంగా మాట్లాడుతుందని నేను ఇక్కడ ఉండనని రాజ్ చెప్పడంతో ఇంద్రాదేవి కావ్య తన ప్రవర్తన మార్చుకుంటుందని చెప్తుంది. దీంతో కావ్య అమ్మమ్మ అప్పుడే పార్టీ మార్చేశావా అని అడుగుతుంది. పార్టీ మారడం సరే లే కానీ ముందు ఏ టిఫిన్స్ చేశావో చెప్పు అని అడుగుతుంది.
కావ్య: నేను ఏ టిఫిన్ చేయలేదు
రాజ్: అయితే నేను టిఫిన్ చేస్తాను
కావ్య: నువ్వు చేస్తే.. ఎవరైనా తింటారా ఇక్కడ
రాజ్: అయితే నేను దోశలు వేసి నీచేత తినిపించి నువ్వు సూపర్ అనేలా చేస్తాను చూడు
అపర్ణ, ఇంద్రాదేవిలను తీసుకుని కిచెన్‌లోకి వెళ్తాడు రాజ్.
రాజ్: మైడియర్ ఓల్డ్ లేడీస్ ఇక్కడ దోశ పిండి ఎక్కడ ఉందో.. ఆ పిండి ఎలా వేస్తే దోశలు వస్తాయో కాస్త ఇన్మఫర్మేషన్ ఇవ్వండి నాకు
అపర్ణ, ఇంద్రాదేవి షాక్ అవుతారు.
అపర్ణ: అనుకున్నా ఈ మధ్య కాలంలో దోశలు వేయడం నువ్వెప్పుడు నేర్చుకున్నావా.? అని
రాజ్: నాకు దోశలు వేయడం రాదని మీకెలా తెలుసు..?
అపర్ణ: అది ఈ కాలం అబ్బాయిలు వంట నేర్చుకోవడం లేదు కదా.. అలా గెస్ చేశాను
రాజ్: మీరు తనను ఇంప్రెస్ చేయమని అడిగారు.. చేయడానికి నేను ఒప్పుకున్నాను మీరు ఏం చేస్తారో నాకు తెలియదు దోశలు వేయడం మీరే నేర్పాలి.
ఇందిరాదేవి: ఈ గొడవంతా ఎందుకు మేము దోశలేస్తాం.. నువ్వు వేసినట్టుగా వెళ్లి కలరింగ్ ఇచ్చేయ్
రాజ్: నో కాంప్రమైంజ్ లవ్‌లోనూ వార్‌లోనూ చీటింగ్ అసలు ఉండకూడదు.
అపర్ణ: అయితే ముందు ఒక దోశ వేసి చూపిస్తాను తర్వాత నువ్వు వేయు
అంటూ అపర్ణ దోశ వేస్తుంది. తర్వాత రాజ్ దోశలు వేస్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు అందరినీ పిలుస్తారు.
ప్రకాష్: చూడటానికి చాలా బాగున్నాయి
రాజ్: తింటే ఇంకా బాగుంటాయి బాబాయ్
స్వప్న: అదేంటి అలా ఉంది…?
రాజ్: అది.. చట్నీ
స్వప్న: ఏం చట్నీ అలా ఉంది.
రాజ్: టమోట కచప్ చట్నీ
కళ్యాణ్: నాకు ఆకలిగా లేదు నేను వెళ్తాను.
రాజ్: ఏయ్ ఎక్కడికి వెళ్లేది.. తినాల్సిందే.. ఇంకా ఏంటి అలా చూస్తున్నారు.. తినేయండి
సుభాష్: అపర్ణ బాబేదో చట్నీ అంటున్నాడు పైగా తినాలని రూల్ పెట్టాడు.
రాజ్: చేసింది తినడానికే కదా నాన్న
సుభాష్: అదేరా మీ అమ్మతో ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అపర్ణ నా బ్యాంకు అకౌంట్‌కు సబంధించింది అంతా నా డైరీలో ఉంది. లాకర్ సంబంధించిన తాళాలన్నీ బీరువాలో ఉన్నాయి.
రాజ్: అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నాన్నా..
కావ్య: తిన్నాక చెప్పలేరని
రాజ్: హలో మేడం.. అంత వెటకారం ఏమోద్దు.. తిన్నాక మీరే మీ డిసీజన్ మార్చుకుంటారు. తినండి
మొదటగా ప్రకాష్ తింటాడు..
ధాన్యలక్ష్మీ: ఎలా ఉందండి
రాజ్: ఎలా ఉండటం ఏంటి పిన్ని.. అద్బుతంగా ఉంటుంది
స్వప్న: చట్నీ ఏంటి తియ్యగా కారంగా ఇలా ఉంది
రాజ్: కదా అదే మ్యాజిక్కు ఎలా ఉందో తెలిసే లోపు గొంతులోంచి పోతుంది.
కావ్య: ఏంటి పోయేది ప్రాణమా..?
అందరూ తిని బాగా లేకున్నా బాగుందని.. అద్బుతం.. అమోఘం అంటూ మెచ్చుకుంటారు. కావ్య మీరంతా అబద్దం చెప్తున్నారు అంటుంది. దీంతో రాజ్ అందరికీ నచ్చిందని మీరు కుళ్లుగా ఉందండి అంటాడు. అయితే ఒక దోశ మొత్తం మీరు ఆగకుండా తినండి నేను ఒప్పుకుంటాను అంటుంది. రాజ్ దోశ తిని బయటకు మాత్రం బాగుందని చెప్తుంటాడు. ఇంతోల ఒక్కోక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత రుద్రాణి తన రూంలో కావ్య ఫోటో పెట్టి రాజ్‌ను రూంలోకి పంపిస్తుంది. రూంలోకి వెళ్లిన రాజ్ అక్కడ ఫోటో చూసి కోపంగా బయటకు వచ్చి రుద్రాణిని తిట్టి వెళ్లిపోతాడు. రుద్రాణి లోపలికి వెళ్లి ఫోటో చూడగా అది స్వప్నది అయి ఉంటుంది. ఇంతలో స్వప్న వచ్చి నా ఫోటో ఇలా పెట్టావేంటని రుద్రాణిని తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!