Brahmamudi Serial Today Episode: వాటర్ ట్యాంక్ దగ్గర ఆడవాళ్లను కొట్టి నీళ్లు నింపుకుని వస్తాడు రాజు. రాజు పరిస్థితి చూసి వాళ్ల నాన్న నవ్వుతుంటాడు. రాజు ఇరిటేటింగ్ గా చూస్తూ.. రాజు: ఇదిగో నాన్న ఆ ఆడగుంపుతో నేను పడలేకపోతున్నాను ఇంకోసారి నన్ను నీళ్లకోసం పంపించొద్దు నాన్న: అదేంట్రా నీతోనే పడలేకపోతున్నామని వాళ్లు కంఫ్లైంట్ ఇచ్చారు రాజు: నా మీద కంఫ్లైంట్ ఇచ్చారా..? నాన్న: అవును రోజు నువ్వు వాళ్లను మాయ చేసి నీళ్లు పట్టుకొస్తున్నావట. నువ్వు చేస్తున్న గొడవలకు వాళ్ల మొగుళ్లతో విడాకులు అయ్యే పరిస్థితి వస్తుందని మీ అమ్మతో ఒకటే చెప్తున్నారురాజు: అబ్బో అంతకుముందు ఏదో వాళ్ల మొగుళ్లతో సంపారం చేసినట్టు నాన్న: ఆడవాళ్లతో గొడవపెట్టుకుని తన్నులు తింటావు సిగ్గు లేదురా నీకురాజు: అందుకే రేపటి నుంచి నేను నీళ్లకు వెళ్లను నాన్న: నీళ్లకు వెళ్లనంటావు కానీ వాళ్లతో గొడవ పెట్టుకోను అని మాత్రం చెప్పవారాజు: గొడవపెట్టుకోకుండా నీళ్లు తీసుకురావడమంటే.. ఎగ్జామ్ రాయకుండా పాస్ అవ్వడం లాంటిది.. రెండు కుదరవు నాన్న నాన్న: మరి నీళ్లు ఎవరు తెస్తారురాజు: ఉన్నాడుగా మీ ముద్దుల చిన్న కొడుకు నాన్న: వాడు ఉన్నాడు కాబట్టి వంతులు వేసుకుంటున్నావు.. రేపు నీకు పెళ్లి అయ్యాక పెళ్లాం వస్తుంది. అప్పుడు మాత్రం దాని కోసం వెళ్లవా..?లక్ష్మీ వస్తుంది. లక్ష్మీ: పెళ్లి అయ్యాక కూడా వాడు ఇదే బస్తీలో ఉండాలని మీరు ఫిక్స్ అయ్యారా..? రాజు: నా మనసులో మాట కరెక్టుగా చెప్పావు అమ్మ నాన్న: వీడి ముఖానికి ఈ బస్తీలో పిల్ల కాకుండా కోటలో మహరాణి వస్తుందా..?రాజు: అవును నా కోసం మహరాణే వస్తుంది నాన్న: అబ్బో ఆ మహరాణి ఎక్కుడుందో.. రాజు: ఏదో ఒక కోటలో ఏసీ గదిలో పనివాళ్లతో కోల్డ్ కాఫీ తాగుతూ నా కోసం కలలు కంటూ ఉంటుంది.అంటూ రాజు ఫాంటసీలోకి వెళ్లిపోతాడు. మరోవైపు ఇందు హాల్లో ఉన్న రుద్రాణి ఫోటో తుడుస్తూ ఉంటుంది. స్వాతి వచ్చి తనకు ఏదో సబ్జెక్ట్ అర్థం కావడం లేదని చెప్పమని ఇందును లాగుతుంటుంది. వాళ్లిద్దరూ మధ్య రుద్రాణి ఫోటో కింద పడిపోతుంది. ఆ సౌండ్‌కు అందరూ వస్తారు. రేఖ వస్తుంది. కింద పడిపోయిన రుద్రాణి ఫోటో చూసి కోప్పడుతుంది. రేఖ: మా అమ్మ నాకు దూరం అయినప్పటి నుంచి తనను ఈ ఫోటోలోనే చూసుకుంటున్నానని నీకు బాగా తెలుసు.. అయినా దీన్ని పగులగొట్టావంటే నేను అంటే భయం పోయిందా..? లేకపోతే మీ నాన్నమ్మ మాటలు విని ధైర్యం వచ్చిందా..? ఇందు: అది పగిలింది అద్దమే కదా నేను మళ్లీ సరి చేస్తాను..
రేఖ: పగిలిన అద్దమే కనిపిస్తుంది కానీ కింద పడిన మా అమ్మ ఫోటో కనిపించడం లేదా..? నీకు అని కోపంగా చేయేత్తి కొట్టబోతుంటే.. అపర్ణ: రేఖ నా మనవరాలి మీద చేయి పడితే నేను ఊరుకోను.. కావ్య బతికి ఉన్నప్పుడు మీ అమ్మను ఏం చేసిందో గుర్తుంది కదా..? దాని రక్తమే ఇందులో ఉందని మర్చిపోకురేఖ: మీలో పుట్టుకొచ్చిన ఈ ధైర్యాన్ని ఈరోజే ఇప్పుడే చంపేస్తాను భూషన్ అంటూ రేఖ సైగ చేయగానే.. భూషణ్ కోపంగా వచ్చి సుభాష్‌ను బయటకు మెట్ల దగ్గరకు తీసుకెళ్లి కిందకు తోసేస్తాడు. వెంటనే అపర్ణ, ఇందు పరుగెత్తుకుంటూ వెళ్లి సుభాష్ ను ఎత్తుకుని కుర్చీలో కూర్చోబెడతారు. రేఖ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అపర్ణ, ఇందు, సుభాష్ బాధపడుతుంటే.. స్వాతి వచ్చి జోక్స్ చెప్పి అందరినీ నవ్విస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది. ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!