Brahmamudi Serial Today Episode: స్టడీ టేబుల్‌ దగ్గర కూర్చుని చదువుకుంటూనే నిద్రపోతుంటుంది స్వాతి. ఇంతలో సూప్‌ తీసుకుని స్వాతి దగ్గరకు వస్తుంది ఇందు. నిద్రపోతున్న స్వాతిని నిద్రలేపి సూప్‌ ఇస్తుంది. స్వాతి: నాకేం వద్దు నువ్వే తాగు..ఇందు: ఎందుకంత కోపం లేట్‌ అయిందా..?స్వాతి: ఒక రౌండ్‌ నిద్ర కూడా అయింది.ఇందు: అంటే సిలబస్‌ కంప్లీట్‌ అవ్వలేదా..? స్వాతి: అక్కా ఆగు.. సిలబస్‌ కంప్లీట్‌ చేయాల్సింది నువ్వు ఈరోజు నీకు ఎగ్జామ్ ఉందన్న విషయం గుర్తుందా..? ఇందు: గుర్తుంది.. ఎప్పుడో చదివేశాను.. ఇప్పుడు రివిజన్‌ చేసుకుంటున్నాను స్వాతి: ఇయర్‌బర్డ్‌ తో రివిజనా..? అది ఎలా ఇందు: సింపుల్‌ రాత్రి చదువుతూ రికార్డు చేసుకున్నా ఇప్పుడు అదే వింటున్నానుస్వాతి: ఇంట్లో వాళ్లు నిన్ను వాడేసుకుంటుంటే.. నువ్వు టెక్నాలజీని వాడేసుకుంటున్నావు అన్నమాట ఇందు: హలో స్వాతి వాళ్లు నన్ను బిజీగా ఉంచొచ్చు.. కానీ నా బ్రెయిన్‌ను కాదు.స్వాతి: అవును అక్కా నువ్వు ఇంత సీక్రెట్‌గా డిగ్రీ వరకు వచ్చేశావని రేఖ ఆంటీకి తెలిస్తే..?ఇందు: తెలిస్తే నీ వల్లే తెలియాలి స్వాతి: అయితే నేను విలన్ అన్నమాట..ఇందు: కాదు నువ్వే నా సేప్టీ లాకర్‌ వి స్వాతి: అయితే నీ రహస్యాలన్నీ నా లాకర్‌లో దాచేసుకోఇందు: అయితే జాగ్రత్త మరి ఆ దొంగలకు ముందు కనిపించేది ఈ సేప్టీ లాకరే.స్వాతి: అమ్మో అయితే వద్దులే అక్కా కొన్ని రహస్యాలు చాలులే.. బయటి నుంచి భ్రమరాంభ ఓసేయ్‌ ఇందు జ్యూస్‌ అంటూ కేకలేస్తుంది. ఇందు భయంగా వెళ్లిపోతుంది. భ్రమరాంబకు జ్యూస్‌ ఇచ్చి అపర్ణ కాఫీ, సుభాష్ కు సూప్‌ తీసుకెళ్లి ఇస్తుంది. అపర్ణ: అయిపోయిందా..? అందరికీ చాకిరి చేయడం.. ఇందు: అప్పుడేనా..? ఇంకా ఐశ్వర్యను నిద్ర లేపాలి. రేఖ ఆంటీకి కాఫీ పంపించాలి. అందరికి టిఫిన్‌ చేయాలి అపర్ణ: ఈ రోజు ఆ పనులు నేను చేస్తానంటే ఒప్పుకోకుండా నువ్వే చేసుకుంటున్నావు.. అసలు నీకు ఈరోజు ఎగ్జామ్‌ ఉందన్న విషయం గుర్తుందా..? ఇందు: ఆ సంగతి నేను చూసుకుంటానులే అపర్ణాదేవి.. సుబ్బు వేడి వేడిగా సూప్‌ తెచ్చాను అవతల నాకు చాలా పనులు ఉన్నాయి..సుభాష్‌: చదువుకుంటున్నానని గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాన్ని ఇలా దొంగతనంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఈ తాతయ్య నీకు ఏ సహాయం చేయలేకపోతున్నాడు.. నన్ను క్షమించు అమ్మ ఇందు: ఇప్పుడు అంతగా నేను ఏం బాధపడుతున్నాను చెప్పు అపర్ణ:  నీ ఇంట్లోనే నువ్వు బాధపడుతున్నావు అది నీకు బాధ కలిగించడం లేదా..?

Continues below advertisement

ఇందు: అపర్ణాదేవి… మా అమ్మా నాన్నలు నన్ను ప్రాణాలకు తెగించి కాపాడింది ఇలా ఏడుస్తూ కూర్చోవడానికి కాదు.. జీవితంలో గెలవడానికి ఏదో ఒకరోజు మా అమ్మ ఆశలను మా నాన్న ఆశయాలను నిలబెడతాను. అవసరం అయితే దానికోసం ఈ ప్రపంచంతోనే యుద్దం చేస్తాను. ఆ రేఖ ఎలాంటిది అయినా తను ఏం చేసినా ఎదిరించడానికి నేను సిద్దంగా ఉన్నాను.. కాలంలో కరిగిపోయిన ఆ బంధాన్ని నేను తీసుకురాకపోవచ్చు.. కానీ దూరం అయిన సంతోషాన్ని తీసుకొస్తాను. కోల్పోయిన మన స్వేచ్చను.. దూరం అయిన దుగ్గిరాల ఇంటి పేరును తిరిగి సంపాదిస్తాను. అజ్ఞాతవాసంతో పాండవులు అడవిపాలు కావొచ్చు.. విరాట కొలువులో అవమానం జరిగి ఉండొచ్చు.. కానీ వీటన్నింటిని తిరిగి ఇవ్వడానికి ఆ రోజు నా కృష్ణయ్యే కురుక్షేత్రాన్ని నడిపించినట్లుగా త్వరలోనే నా చేత ఈ యుద్దాన్ని కూడా నడిపిస్తాడు.. 

అపర్ణ: నిన్ను చూస్తుంటే.. మీ అమ్మ లాగే ఉన్నావు.. అది కూడా ఇలాగే కష్టం వస్తే బాధపడటం కాదు ఎదురించి నిలబడాలి పోరాడాలి అంటూ చెప్పేదిఅంటూ అపర్ణ చెప్తుంటే.. సరే నాకు టైం అవుతుంది. వెళ్తాను అంటూ ఇందు వెళ్లిపోతుంది. మరోవైపు రాజు పెద్దవాడై పగటి  కలలు కంటుంటాడు. వాళ్ల నాన్న వచ్చి తన్ని నిద్ర లేపి వాటర్‌ తీసుకురమ్మని చెప్తాడు. వాటర్‌ ట్యాంక్‌ దగ్గరకు వెళ్లిన రాజు అక్కడి ఆడవాళ్లతో నీళ్ల కోసం గొడవ పెట్టుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

Continues below advertisement