Brahmamudi Serial Today Episode: సుభాష్ పరిస్థితి చూసి హాస్పిటల్‌కు తీసుకెళ్లమని ఇందు ఏడుస్తూ రేఖను రిక్వెస్ట్ చేస్తుంటే రేఖ మాత్రం కొపంగా మీరు హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోపు అసుల ఉంటాడో ఊడతాడో గ్యారంటీ లేదని అంటుంది. అపర్ణ: రేఖ..రేఖ: అరవకు ఆంటీ అరవకు ఇలా అరిచే ఇక్కడిదాకా తెచ్చుకున్నావు.. ఈ పొగరు వల్లే ఈరోజు నీ మొగుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. నన్ను ఎదురించాలన్న ఈ ధైర్యమే వాడికి ఈరోజు మృత్యువుగా మారింది అపర్ణ: ఏంటి బెదిరిస్తున్నావా..? ఇందు: నాన్నమ్మ నీకు దండం పెడతాను.. అవతల తాతయ్య ప్రాణం ప్రమాదంలో ఉంది.. నువ్వు సైలెంట్‌గా ఉండు.. ఆంటీ మా నాన్నమ్మ మాట్లాడింది తప్పే ఆంటీ కావాలంటే నేను క్షమాపణ చెప్తాను.. ముందు మా తాతయ్యకు ఇవ్వాల్సిన యాంటీ డోస్ ఏంటో చెప్పండి ఆంటీ రేఖ: ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఇందు.. అది నా దగ్గరే ఉంది కానీ నేను ఇవ్వాలనుకోవడం లేదు.. ఇందు: ఆంటీ మీరేం చెప్పినా చేస్తాను దయచేసి ఆ ఇంజక్షన్ ఇవ్వండి ఆంటీ ఫ్లీజ్ ఆంటీ మా తాతయ్య ప్రాణాలను కాపాడండి ఆంటీ.. రేఖ: నువ్వు ఇలా అడుక్కుంటుంటే.. నాకు కొంచెం జాలిగా ఉంది. అప్కోర్స్ ఇవ్వాలని కూడా ఉంది.. సరే ఈ ఒక్కసారికి ఇచ్చేస్తాను.. నా బెడ్ రూంలో ఉంది తెచ్చుకో ఇందు: సరే ఆంటీ తెచ్చుకుంటాను.. అని రేఖ బెడ్ రూంలోకి వెళ్లి అంతా వెతుకుతుంది. ఎక్కడా దొరకదు.. కిందకు వస్తుంది. ఇందు: ఆంటీ అక్కడ ఇంజక్షన్ లేదు ఆంటీ రేఖ: అయ్యో కన్పీజ్ అయిపోయాను ఇందు.. ఆ ఇంజక్షన్ మీ తాతయ్య బెడ్ రూంలోనే ఉంది వెళ్లి తెచ్చుకో ఇందు సుభాష్ రూంలోకి వెళ్లి ఇంజక్షన్ వెతుకుతుంది.. ఎక్కడా దొరకదుఇందు: అంటీ అక్కడ లేదు ఆంటీ రేఖ: అబ్బ చ ఇందాక కంగారులో చెప్పాను ఇందు.. ఇప్పుడే గుర్తుకు వచ్చింది. ఇంజక్షన్ భ్రమరాంబ గదిలో ఉంది వెళ్లి తెచ్చుకో ఇందు మళ్లీ పైకి భ్రమరాంబ గదిలోకి వెళ్లి తిరిగి వస్తుంది. ఇందు: ఆంటీ అక్కడ కూడా లేదు ఆంటీ రేఖ: అవునా..? ఆ ఐశ్వర్య గదిలో ఉంది వెళ్లి తెచ్చుకో ఇందు ఐశ్వర్య రూంలోకి వెళ్తూ కిందపడిపోతుంది. రేఖ: ఏంటి అలిసిపోయావా… అవతల మీ తాతయ్య ప్రాణం ఇందు వెళ్లు వెళ్లి తెచ్చుకో ఇందు లేచి పరుగెడుతుంది ఐశ్వర్య రూంలోకి మొత్త వెతికి కిందకు వస్తుంది. ఇందు: ఆంటీ అక్కడ కూడా లేదు.. ఫ్లీజ్ ఆంటీ ఎక్కడ ఉందో చెప్పండి రేఖ: అక్కడ కూడా లేదా..? సారీ ఇందు ఇంజక్షన్ స్వాతి రూంలో ఉంది వెళ్లి తెచ్చుకో… ఇందు స్వాతి రూంలోకి వెళ్తుంటే.. అపర్ణ: ఇందు ఆగు.. ఆ ఇంజక్షన్ ఇంట్లో ఎక్కడా లేదు.. ఈ రేఖ దగ్గరే ఉంది. రేఖ: కరెక్టుగా గెస్ చేశావు ఆంటీ.. కానీ నువ్వు ఎప్పుడు ఎవరిని కలుస్తున్నావో నేను తెలుసుకోలేనా..? నువ్వు లాయరును కలవడం నాకు తెలియదు అనుకుంటున్నావా..? ఎంత ధైర్యం ఉంటే నాకు వ్యతిరేకంగా నా మీద కోర్టులో కేసు వేయాలనుకుంటావు...? నా పేరు మీద ఉన్న పవర్ ఆప్ పటార్నిని నీ మనవరాలు పేరు మీదకు మార్చేద్దాం అనుకున్నావు కదా..? (అందరూ షాక్) నువ్వు నాకు వ్యతిరేకంగా పని చేస్తుంటే నేను ఆ ముసలోడిని ఎందుకు బతకనివ్వాలి ఆ ఇంజక్షన్ నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పగానే.. ఇందు, అపర్ణ ఇద్దరూ ఏడుస్తూ రేఖ కాళ్ల దగ్గర కూర్చుని సారీ చెప్పి ఇంకోసారి అలా చేయం అని చెప్పగానే యాంటీ డోస్ ఇస్తుంది రేఖ. ఇందు వెళ్లి సుభాష్‌కు యాంటీ డోస్ ఇస్తుంది. అపర్ణను తిడుతుంది. దీంతో అపర్ణ బాదపడతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
Brahmamudi Serial Today march 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు
Sudhakar Mansetty | 21 Mar 2026 10:19 AM (IST)
Brahmamudi serial today episode march 21st: సుభాష్‌ను చంపేసేలా బెదిరించి అపర్ణ ప్రయత్నాన్ని పసిగట్టిన రేఖను భ్రమరాంబ మెచ్చుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తి జరిగింది.

బ్రహ్మముడి సీరియల్