Brahmamudi Serial Today Episode: రాజ్ ఫోటో ముందు దీపం వెలిగిస్తున్న రుద్రాణి పీక పట్టుకుని గోడకు వేలాడదీయబోతుంది కావ్య. ఇంట్లో వాళ్లు వచ్చి విడిపించడంతో దూరంగా వెళ్తుంది కావ్య. రాజ్‌ ఫోటో దగ్గర ఉన్న పూలు మొత్తం కింద పడేస్తుంది.

కావ్య: ఊపిరి అందడం లేదు కదా..? చచ్చిపోతానని భయం వేసింది కదా..? బతికున్న నా భర్త ఫోటోకు దండ వేస్తున్న.. దీపం వెలిగిస్తున్న నాక్కూడా అలాగే అనిపించింది. ఇదే నీకు చివరి వార్నింగ్‌ ఇంకొక్కసారి ఇలా చేశావంటే ఊరుకోను చెప్తున్నాను.

రుద్రాణి:  ఊరుకోకపోతే ఏం చేస్తావు.. ఇలాగే పీక పిసికి చంపేస్తావా..?

కావ్య: మా వారి కోసం ఎంత దూరం అయినా వెళ్తాను

రుద్రాణి: వచ్చిందండి సతీ సావిత్రి. యముడి దగ్గర నుంచి భర్త ప్రాణాలు కాపాడి తీసుకొచ్చినట్టు ఇప్పుడు రాజ్‌ను బతికి తీసుకొస్తుందంట. సరే నీ దగ్గరకే వస్తున్నాను. రాజ్‌ బతికే ఉన్నాడు అంటున్నావు కదా..? ఎక్కడున్నాడు. ఏం చేస్తున్నాడు. ఎవరో అమ్మాయితో కలిసి కారులో వెళ్లాడు అన్నావు కదా..? మరి ఎక్కడికి వెళ్లాడు. తన వాళ్లు అందరూ ఇక్కడే ఉన్నారు కదా..? యాక్సిడెంట్ నుంచి తిరిగి ఇంటికి రావాలి కదా..? ఎందుకు రాలేదు

కావ్య: అదే ప్రశ్న నేను అడిగితే.. మా ఆయన చనిపోవడం నిజం అయితే ఆయన బాడీ ఎక్కడ..?

రుద్రాణి:  ఏయ్‌ వెర్రి దానిలా మాట్లాడకు.. నీ చెల్లెలే కన్ఫం చేసింది కదా..? రాజ్‌ బట్టలకు రక్తం మరకలు అంటుకున్నాయి. ఏ సింహమో పులో తిని ఉంటుందని.. చెప్పింది కదా..?

కావ్య: అలా జరగడం మీరు చూశారా..?

రుద్రాణి: అలా చెప్పే కదా పోలీసులు కేసు క్లోజ్‌ చేశారు

కావ్య: పోలీసులు చెప్పిన విషయం పక్కన పెట్టండి.. ఆయన అడవిలో చనిపోవడం మీరు చూశారా..? పోనీ మీరెవరైనా చూశారా..? చూడలేదు కదా.? కానీ ఆయన బతికి ఉండటం నేను చూశాను.  ఆయన బతికే ఉన్నారు. త్వరలోనే మీ అందరి ముందుకు తీసుకొస్తాను

అని రాజ్‌ ఫోటో తీసుకుని అప్పును రెడీ కమ్మని హాస్పిటల్‌కు వెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్తుంది. కావ్య గురించి రాజ్‌కు తెలియకుండా తెలుసుకోవాలని యామిని. యామినికి తెలియకుండా కావ్య గురించే తెలుసుకోవాలని రాజ్‌ ఇద్దరూ ఒకే కారులో హాస్పిటల్‌కు బయలుదేరుతారు. మరోవైపు కావ్య కూడా అదే హాస్పిటల్‌కు రాజ్‌ గురించి తెలుసుకోవడానికి అప్పుతో బయలుదేరుతుంది. మధ్యలోకి రాగానే అప్పుకు స్టేషన్‌ నుంచి ఫోన్‌ రావడంతో కావ్యను ఒక్కదాన్నే హాస్పిటల్‌కు వెళ్లమని చెప్పి తాను స్టేసన్‌కు వెళ్లిపోతుంది. హాస్పిటల్‌కు వెళ్లిన రాజ్‌, యామిని ఒకరికి తెలియకుండా ఒకరు కావ్య గురించి ఆరా తీస్తారు. ఇంతలో వాష్‌ రూంకు వెళ్తానని చెప్పి కావ్యకు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్‌ దగ్గరకు వెళ్తాడు.

రాజ్: డాక్టర్‌ మీ కోసమే వెతుకుతున్నాను…

డాక్టర్‌: ఎవరు మీరు..?

రాజ్‌:  రెండు రోజుల క్రితం ఒక అమ్మాయి రోడ్డు మీద పడిపోయిందని తీసుకొచ్చాను మర్చిపోయారా..?

డాక్టర్‌:  యా గుర్తుకొచ్చింది చెప్పండి

రాజ్‌:  మీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్‌ తెలుసుకోవాలని వచ్చానండి

డాక్టర్‌:  దేని గురించి

రాజ్‌: ఆ రోజు నేను అడ్మిట్‌ చేసిన అమ్మాయి డీటెయిల్స్ కావాలండి

డాక్టర్‌:  సారీ అండి బిల్లు అడ్వాన్స్‌ గా పే చేసి మీరు వెళ్లిపోయారు. ట్రీట్‌మెంట్‌ కంప్లీట్‌ అవ్వగానే ఆవిడ వెళ్లిపోయారు. నాకు పేషెంట్ వెయిట్‌ చేస్తున్నారు ఓకే మరి

అంటూ డాక్టర్‌ వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడికి యామిని వస్తుంది. ఏంటి బావ ఇక్కడున్నావు అని అడుగుతుంది. ఏం లేదు అని రాజ్‌ చెప్పగానే డాక్టర్‌ పిలుస్తున్నారు పద అంటూ రాజ్‌ ను తీసుకుని డాక్టర్‌ చాంబర్‌ లోకి వెళ్తుంది. అప్పుడే హాస్పిటల్‌కు వచ్చిన కావ్య రిసెప్షన్‌లో రాజ్‌ గురించి అడుగుతుంది. ఇప్పుడే అటు వైపు వెళ్లారని చెప్పగానే కావ్య, రాజ్‌ను వెతుక్కుంటూ వెళ్తుంది. డాక్టర్‌ దగ్గర యామిని, రాజ్‌ ఉండటం చూసి షాక్‌ అవుతుంది. డాక్టర్‌ చెప్పిన మాటలు విని షాక్‌ అవుతుంది. రాజ్‌కు మతి పోయిందన్న విషయం వినగానే కావ్య బోరున ఏడుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!