Brahmamudi Serial Today Episode: ఇందు టైలర్‌ షాపునకు వెళ్లి వచ్చానని చెప్పినా రేఖ నమ్మదు.. భ్రమరాంబ, స్వాతి చెప్పినా రేఖ అనుమానిస్తుంది. భ్రమరాంబ తాను చెప్పినా ఇంకా అనుమానిస్తావేంటి..? అని అడగ్గానే.. రేఖ: అనుమానించాలి వదిన ఎందుకంటే దీనిలో ప్రవహిస్తుంది మామూలు రక్తం కాదు అణువంత అవకాశం ఉన్నా ఆకాశాన్ని సొంతం చేసుకునే తెలివి తేటలు ఉన్న రక్తం ఇందు: ఆంటీ మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను నిజంగా బట్టలు కుట్టించుకురావడానికే వెళ్లానురేఖ: అవునా సరే ఆ టైలర్‌ షాపు పేరేంటి.. ఆ టైలర్‌ షాపు పేరేంటి ఇందు: సత్యం బాబు టైలర్‌ షాపు రేఖ: మరి టైలర్‌ పేరు ఇందు: సత్యంబాబు.. ఆంటీ  వంటింట్లో  చాలా పనులు ఉన్నాయి. ఇక నేను వెళ్తాను అంటీ రేఖ: ఆగు ఆ పనులు అన్ని తర్వాత చూసుకోవచ్చు నాకు ఆ టైలర్‌ ఫోన్‌ నెంబర్‌ చెప్పుఇందు: అది నా దగ్గర అతని ఫోన్‌ నెంబర్‌ లేదు.. రేఖ: అవునులే బట్టలు కుట్టించడానికి వెళ్లిన నువ్వు ఫోన్‌ నెంబర్‌ ఎందుకు తీసుకుంటావు.. స్వాతి వాడి ఫోన్‌ నెంబర్‌ ఇవ్వు స్వాతి: అది ఆంటీ.. ఫోన్‌ నెంబర్.. రేఖ: సంక్రాతికి నువ్వు వాడి దగ్గరే కదా బట్టలు కుట్టించుకుంది. ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అంటూ నువ్వు గంటకోసారి ఫోన్‌ చేసే దానివి కదా ఆ నెంబర్‌ ఇవ్వు స్వాతి: (మనసులో) చచ్చాను దీనికి అన్ని గుర్తుండి చస్తాయి. ఇప్పుడు ఫోన్‌ నెంబర్‌ ఇస్తే అక్క ఇరుక్కుంటుంది. ఇవ్వకపోతే నన్ను చంపేస్తుంది రేఖ: నెంబర్‌ ఇవ్వమంటున్నానా..? స్వాతి:  నేను ఇస్తాను ఆంటీ అని సత్యంబాబుకు ఫోన్‌ చేస్తుంది స్వాతి. రేఖ లౌడ్‌ స్పీకర్‌ పెట్టి మాట్లాడుతుంది. సత్యం బాబు లిప్ట్ చేస్తాడు. సత్యంబాబు: హలో స్వాతి మేడం చెప్పండి రేఖ:  నేను వాళ్ల ఆంటీ రేఖను మాట్లాడుతున్నానుసత్యంబాబు: చెప్పండి మేడం రేఖ: ఇందాక స్వాతి బట్టలు తీసుకుని మీ షాపునకు ఎవరైనా వచ్చారా..? సత్యంబాబు: హలో మేడం వినిపిస్తుందా..? రేఖ: నాకు బాగానే వినిపిస్తుంది కానీ విసిగించకుండా నేను అడిగినదానికి సమాధానం చెప్పు.. ఇందాకా స్వాతి బట్టలు తీసుకుని ఎవరైనా వచ్చారా..? సత్యంబాబు: అల్ట్రేషన్‌ చేయించడానికి బట్టలు తీసుకుని ఇందు మేడం వచ్చారురేఖ ఫోన్‌ స్వాతికి ఇస్తుంది. ఇందు: ఆంటీ నేను చెప్పింది నిజమని అర్థం అయింది కదా..? ఇక నేను వెళ్లొచ్చా..? ఆంటీ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా..? రేఖ: ఏంటో అడుగు.. ఇందు: నేను గడప దాటి కాలు బయట పెడితే మీరు ఎందుకు అంతలా భయపడిపోతున్నారు.. మిమ్మల్ని అంతలా కంగారు పెట్టే విషయం ఏముంది..? రేఖ: అడిగిన దానికి సమాధానం చెప్పడానికి భయపడే నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావా..? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం.. ఎవరు నేర్పిస్తున్నారుఇందు: అయ్యో నేను ఎదిరించడడం లేదు ఆంటీ.. అడుగుతున్నాను అంతేరేఖ: నువ్వు ఇక్కడి ఉన్నది నేను చెప్పింది వినడానికి చెప్పింది చేయడానికి మాత్రమే వెళ్లు అంటూ కోప్పడితే ఇందు వెళ్లిపోతుంది. తర్వాత కిచెన్‌లో ఉన్న ఇందు దగ్గరకు స్వాతి, అపర్ణ వెళ్తారు. ఎగ్జామ్‌ గురించి మట్లాడుకుంటారు. కట్‌ చేస్తే అప్పు, కళ్యాణ్‌ ల కూతురు నందు బొకే షాప్‌ నడుపుతుంది. అక్కడికి వెంకీ వస్తాడు. నందు రాసిన కవితలు చదివి ఇంప్రెస్‌ అవుతాడు. నందును మెచ్చుకుని వెళ్లిపోతాడు. ఇక సుభాష్‌కు ట్రీట్‌మెంట్‌ చేయడానికి డాక్టర్‌ను తీసుకొస్తుంది ఇందు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.