Brahmamudi Serial Today Episode:  అడవిలోకి వెళ్లిన రాజ్‌, కావ్యలను రౌడీలు వెంబడిస్తుంటారు. వారి నుంచి తప్పించుకోవడానికి రాజ్‌, కావ్య అడవి లోపలికి వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లాక కావ్య నడవలేక పోతుంది.

కావ్య: రామ్‌ గారు బయటకు వెళ్లే దారి చూడొచ్చు కదా

రాజ్‌: వెరీ సింపుల్ కళావతి గారు ఇలా స్ట్రెయిట్‌ గా నడుచుకుంటూ వెళ్లిపోవడమే

కావ్య: నడుకుకుంటూ వెళ్తే దారి వస్తుందా

రాజ్‌: నడుచుకుంటూ వెళ్తే దారి వస్తుందో లేదో తెలియదు కానీ ఏదో ఒక ఊరు మాత్రం కచ్చితంగా వస్తుంది

కావ్య: అది నాకు తెలియదా..?

రాజ్‌ తొండను చూసి భయపడతాడు. కావ్య నవ్వుతుంది. కొద్ది దూరం నడుస్తారు.

కావ్య: ఇక నా వల్ల కాదండి

రాజ్: అయితే మనం అనవసరంగా దారి వెతుక్కుంటూ కష్టపడటం కన్నా ఇక్కడే ఉండిపోతే

కావ్య:  ఏంటి ఇక్కడే ఉండిపోతారా..?

రాజ్‌:  ఉంటే తప్పేంటండి ఆ సిటీలో పొల్యూషన్‌ మధ్యలో ఉండటం కన్నా ఇలా నేచర్‌ మధ్యలో ఉంటే ఎంత బాగుందో తెలుసా..? ఆ సీతారాముల్లా మనం ఒక గుడిసె వేసుకుని ఇక్కడే ఉండిపోదాం అండి చాలా బాగుంటుంది

కావ్య: అయితే మంచిది రామ్‌ గారు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లిపోతాను.

రాజ్‌: ఏవండి సీత లేకుండా రాముడు ఎలా ఉంటాడండి

కావ్య: మీకోసం సూర్పనక్క వస్తుందిలేండి నేను వెళ్తున్నాను.

కొద్ది దూరం వెళ్లాక

కావ్య:  దాహంగా ఉంది ఎక్కడైనా మంచినీళ్లు ఉంటే ఇవ్వండి

రాజ్‌ వెళ్లి వెతికి ఆకులో నీళ్లు తీసుకుని వస్తాడు.

రాజ్‌: కళావతి గారు ఇదిగోండి వాటర్‌..

నీళ్లు తాగి ఎమోషనల్‌ అవుతుంది కావ్య. ఇంతలో రౌడీలు రావడంతో మళ్లీ అక్కడి నుంచి ఇద్దరూ పరెగెడతారు. కొద్ది దూరం వెళ్లాక రౌడీలకు కనబడకుండా ఒక దగ్గర దాక్కుంటారు. ఇంతలో రౌడీలకు యామిని ఫోన్‌ చేస్తుంది.

రౌడీ: చెప్పండి మేడం

యామిని: నేను చెప్పడం ఏట్రా ఇడియట్‌.. ఇంతకీ ఆ కావ్య పని ఫినిష్‌ అయిందా లేదా..?

రౌడీ:  ఇక్కడ మీరు అనుకున్నట్టుగా ఏదీ జరగడం లేదు మేడం

యామిని: ఎందుకు ఏమైంది..?

రౌడీ: మనం అనుకున్నట్టుగానే ఆ కావ్యను తిట్టాను కానీ రాజ్‌ ఏమీ అనకుండా కావ్యతో కలిసి వెళ్లిపోయాడు. అడవిలోకి వచ్చేశారు. వెనకాలే మేము వచ్చాము.

యామిని: సరే పని అయ్యాక నాకు ఫోన్‌ చేయ్‌

అంటూ ఫోన్‌ పెట్టేస్తుంది యామిని. తర్వాత చీకటి పడుతుంది.

రాజ్‌ సెల్‌ఫోన్‌ టార్చి ఆన్‌ చేసుకుని మెల్లగా నడుస్తుంటాడు. కావ్య కూడా భయంభయంగా నడుస్తుంది.

కావ్య: ఏవండి ఈ చీకటిలో నడవాలంటే నాకు భయం వేస్తుందండి మీకు భయంగా లేదా..?

రాజ్‌:  నేను ఏమైనా రోజూ అడవిలో తిరుగుతున్నానా..? ఏంటి..? ధైర్యంగా ఉండటానికి

కావ్య: ఆ రౌడీలు మళ్లీ వస్తారని భయపడుతున్నారా..?

రాజ్‌:  వాళ్లకన్న ముందు ఏ పులి ఎటునుంచి వస్తుందోనన్న భయం వేస్తుందండి..

దీంతో కావ్య పులుల వస్తాయా..? అంటూ మరింత భయపడుతుంది. మరోవైపు అప్పు కార్లు ఆగి ఉన్న చోటికి వెళ్తుంది. అక్కడ నుంచి టార్చి వేసుకుని అడవిలోకి వెళ్తుంది. భయపడుతూ నడుస్తున్న కావ్యకు పక్కన రాజ్‌ కనిపించడు దీంతో కావ్య మరింత భయంగా ఏడుస్తూ రాజ్‌ను పిలుస్తుంది. రాజ్‌ కనిపించడు.. పలకడు.. ఏం చేయాలో తెలియక కావ్య ఏడుస్తుంటే వెనక నుంచి రాజ్‌, కావ్యను పిలుస్తాడు. రాజ్‌ను చూసిన కావ్య కోపంగా దగ్గరకు వెళ్లి కొడుతూ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. మీరు ఆకలిగా ఉందన్నారు కదా అందుకే ఫ్రూట్స్‌ తీసుకొచ్చాను అని ఇస్తాడు. ఆ పండ్లు తింటూ కళ్లు తిరుగుతున్నాయి అని కావ్య చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!