Brahmamudi Serial Today Episode: రాహుల్‌ నగలు దొంగిలించిన విషయం అందరి ముందు చెప్తూ స్వప్న బాధపడుతుంది. తన కొడుకును వెనకేసుకొచ్చిన రుద్రాణిని తిడుతుంది. దీంతో అపర్ణ గొడవ పెద్దగా అయితే రాజ్‌, కావ్య పెళ్లికి ఆటంకం అవుతుందని ఇందిరాదేవిని ఆపమని చెప్తుంది.

Continues below advertisement


ఇందిరాదేవి: అమ్మా స్వప్న  రాహుల్‌ నిజంగానే తప్పు చేశాడు ఒప్పుకుంటున్నాను. అలాగని గొడవ చేసి ప్రయోజనం ఏముంటుంది అమ్మా


స్వప్న: మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి అమ్మమ్మ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా


ఇందిరాదేవి: అవును శిక్ష పడాలి. ఏ శిక్ష వేయాలో భార్యగా నువ్వే డిసైడ్‌ చేయాలి. ఇప్పుడు ఈ విషయాన్ని నలుగురిలో పెట్టి ఇంటి పరువు తీసుకోవడం వల్ల నష్టమే తప్పా మీ సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది. వాడి తప్పు వాడు తెలుసుకుని తిరిగి సరైన దారిలో నడిచేలా నువ్వు చేయ్‌.. దానికి రుద్రాణి అడ్డుపడినా మేము ఒప్పుకోము సరేనా


అపర్ణ: అమ్మా స్వప్న ఇలా ఆవేశంతో కాకుండా ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకో ఈ నగలు లోపల పెట్టు


అని చెప్పగానే స్వప్న నగలు తీసుకుని లోపలికి వెళ్తుంది.


రాహుల్‌: హమ్మయ్యా.. ఇవి గిల్టీ నగలు అని ఎవ్వరూ గుర్తు పట్టలేదు.


మనసులో అనుకుంటాడు. తర్వాత రుద్రాణి, రాహుల్‌ను తీసుకుని బయటకు వెళ్లి కోపంగా ఊస్తూ.. కొడుతుంది. దీంతో రాహుల్‌ మమ్మీ ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు.


రుద్రాణి: కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టు అయిందిరా నా పరిస్థితి నిన్ను రాజును చేయాలనుకున్న ప్రతిసారి నువ్వు బంటుగానే మిగిలిపోతున్నావు.


రాహుల్‌: ఒక్కసారి నేను చెప్పేది విను మమ్మీ


రుద్రాణి: పెళ్లాం నగలు కొట్టేయాలన్న దరిద్రపు గొట్టు ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు ఇక ఆ స్వప్న నిన్ను పెంపుడు కుక్కలాగా ఆడిస్తుంది


రాహుల్‌:  దానికి అంత సీన్‌ లేదు మమ్మీ అయినా అది చెప్పినట్టు నేను ఎందుకు వింటాను


అంటూ రాహుల్ అనగానే చూస్తూ ఉండు అది ఎలా ఆడుకుంటుందో అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రిసార్ట్‌ నుంచి బయటకు వచ్చిన రాజ్‌, కావ్య ఒక టీ కొట్టు దగ్గర టీ తాగుతుంటే యామిని పంపించిన రౌడీలు వస్తారు. కావ్యను కామెంట్ చేస్తారు. రాజ్‌ను తిడతారు. దీంతో రాజ్‌ కోప్పడుతుంటే కావ్య వద్దని వారించి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. రౌడీలు మాత్రం రాజ్‌, కావ్యలు వెళ్తున్న కారును ఫాలో చేస్తుంటారు.


రాజ్‌: అసలు వాళ్లను చూసి మనం ఎందుకండి పారిపోవాలి. ఒకసారి కారు ఆపి వాళ్లకు బుద్ది చెబితే ఐపోతుంది కదా..?


కావ్య:  మీకు దండం పెడతాను. నాకు గొడవలు అంటే భయం. ముందు కారు స్పీడుగా పోనియండి


కొద్దిదూరం వెళ్లాక కారు ఆగిపోతుంది.


కావ్య: ఏమైంది ఆండి కారు ఆపేశారు.


రాజ్‌: ఏమో చూస్తాను. అదే ఆగిపోయింది.


కావ్య: ఏవండి వాళ్లు వచ్చేస్తున్నారు. రండి అక్కడకు వెళ్దాం.


అని కావ్య, రాజ్‌ను తీసుకుని అడవిలోకి వెళ్లిపోతుంది. దగ్గరకు వచ్చిన రౌడీలు వాళ్లు అడవిలోకి వెళ్లడం చూసి వాళ్లను ఫాలో అవుతారు. కొంత దూరం వెళ్లాక కావ్య అపర్ణకు ఫోన్‌ చేసి జరిగింది చెప్తుంది. అపర్ణ వెంటనే అప్పుకు చెప్తుంది. అప్పు వెంటనే స్టేషన్‌కు బయలుదేరుతుంది. వాళ్లను సేఫ్‌గా తీసుకొస్తాను మీరు టెన్షన్‌ పడకండి అని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


  


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!