Brahmamudi Serial Today Episode:  రిసార్ట్‌లో రూం బాయ్‌ రాజ్‌ యవ్వారం కనిపెడతాడు. యామిని, కావ్యలతో ఒకరికి తెలియకుండా ఒకరి రూంలోకి వెళ్తున్నాడని గ్రహించి.. యామని దగ్గరకు వెళ్లి నిజం చెప్పాలనుకుంటాడు. రాజ్‌ అక్కడకు వచ్చి  తిట్టి పంపిస్తాడు. తర్వాత కావ్య దగ్గరకు వెళ్లి నిజం చెప్పాలనుకుంటాడు కావ్య తనకు నిజం తెలుసని చెప్పడంతో షాక్‌ తింటాడు బాయ్‌.  


బాయ్‌: మేడం ఆయన ఇంతకీ మీకు ఏమవుతారు మేడం


కావ్య:  ఆయన మా శ్రీవారు


బాయ్‌: మీకు శ్రీవారు అయితే యామిని మేడం ఆయనకు ఏమవుతుంది మేడం


కావ్య: ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి


బాయ్‌ జుట్టు పీక్కుంటూ.. పిచ్చొడిగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రూంలోకి వెళ్లిన రాజ్‌ను యామిని రొమాంటిక్‌గా టచ్‌ చేస్తుంది.


రాజ్‌:  యామిని ఏంటిది..?


యామిని:  తప్పేం ఉంది బావ మనం కాబోయే భార్యభర్తలం


కావ్య రూంలోంచి బయటకు వస్తుంది.


కావ్య: అదేంటి ఆయన ఇంకా రాలేదు కొంపదీసి యామిని ఏమైనా చేస్తుందా..?


అనుకుంటూ కాల్ చేస్తుంది.


రాజ్‌: ఏరా వచ్చావా…


కావ్య: ఇదేంటి నన్ను పట్టుకుని మగాడితో మాట్లాడినట్టు ఏరా అంటున్నాడు.. ఓహో పక్కన యామిని ఉందనా..? చెప్తా.. (మనసులో అనుకుని) ఏంటండి ఎవరో మగాడితో మాట్లాడినట్టు నన్ను పట్టుకుని ఏరా అంటున్నారు


రాజ్‌: అవునురా చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను


కావ్య:  సరేలేండి మీరు నాతో ఆఫీసుకు వస్తాను అన్నారు కదా..? నాకు టైం అవుతుంది. మీరు బిజీగా ఉంటే నేను వెళ్లిపోతాను లేండి..


రాజ్‌:  అరే అలా అలిగి వెళ్లిపోతే ఎలారా…? మన ఫ్రెండిషిప్‌కు మీరిచ్చే వ్యాల్యూ ఇదేనా..? నేను వస్తున్నాను ఉండు..  యామిని నేను వెళ్లాలి


యామిని: మళ్లీ ఎక్కడికి బావ


రాజ్‌: కిరణ్‌ అని నాఫ్రెండ్‌ వెళ్లిపోతా అంటున్నాడు.. వెళ్లి సెండాప్‌ ఇచ్చి వస్తాను. నా కోసం వెయిట్‌ చేస్తూ ఉండు వస్తాను


అని యామిని వద్దని చెప్తున్నా వినకుండా రాజ్‌ వెళ్లిపోతాడు. రిసెప్షన్ లో కావ్య ఉంటుంది.


రాజ్‌: నేను వచ్చేశా..


కావ్య: ఇక నేను వెళ్లిపోదామని డిసైడ్‌ అయ్యాను


రాజ్‌: అదేంటండి నా మాటంటే మాటే..  ఇక వెళ్దాం పదండి


అని కావ్యను తీసుకుని వెళ్లడం యామిని చూస్తుంది. కోపంతో రగిలిపోతూ.. రౌడీకి ఫోన్‌ చేసి కావ్యను చంపేయమని చెప్తుంది. రౌడీ అలాగే అని చెప్తాడు. మరోవైపు కిచెన్ లో ఉన్న అప్పును హగ్‌ చేసుకోబోతాడు కళ్యాణ్‌. అప్పు గరిటతో వాత పెడుతుంది. దీంతో కళ్యాణ్‌ తనకు వచ్చిన కవితలతో అప్పును తిడుతుంటాడు. ఇంతలో స్వప్న వస్తుంది.


స్వప్న: ఏంటి కళ్యాణ్ కిచెన్‌లో కవితలు చెప్తున్నావు..


కళ్యాణ్‌: కవితలు కాదు స్వప్న.. అప్పు కర్రీ చేస్తుంది కదా..? ఉప్పు సరిగ్గా వేయమని చెప్తున్నాను.


స్వప్న: అయ్యో కళ్యాణ్‌ అప్పు పాయసం చేస్తుంది. పాయసంలో ఉప్పు వేస్తారా..? ఎవరైనా..?


రాహుల్‌: అరే ఇవన్నీ ఎందుకురా మంచిగా ఎక్కడికైనా హనీమూన్‌ ప్లాన్‌ చేసుకోక..?


అంటూ మాటలు చెప్తూ స్వప్న దగ్గర ఉన్న లాకర్‌ కీస్‌ కొట్టేస్తాడు రాహుల్‌. వెంటనే అక్కడి నుంచి వెళ్లి లాకర్‌ ఓపెన్‌ చేసి నగలు మారుస్తుంటే స్వప్న వస్తుంది. రాహుల్‌ను తిట్టి నగలు తీసుకుని కిందకు వచ్చి అందరి ముందు రాహుల్‌ తన నగలు దొంగించిబోయాడని చెప్తుంది. అందరూ రాహుల్‌ను తిడతారు. రుద్రాణి మాత్రం రాహుల్‌ను వెనకేసుకొచ్చి స్వప్నను తిడుతుంది. సుభాష్‌ బెదిరించడంతో రాహుల్ నిజం ఒప్పుకుంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


  


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!