Brahmamudi Serial Today Episode:  రాజ్‌ ఆఫీసుకు వెళ్లి అక్కడి ఉద్యోగులతో ఎక్స్‌ట్రా యాక్టింగ్‌ చేస్తుంటాడు. అందరి మీద కోపంగా అరుస్తుంటాడు. శృతి వచ్చి భయంతో వణికిపోతుంది. విషయం ఎలాగైనా కావ్యకు చెప్పాలనుకుంటుంది. మరోవైపు కావ్య ఇంట్లో టిఫిన్‌ చేస్తుంది. రుద్రాణి అటూ ఇటూ చూస్తుంది.

కావ్య: ఏంటి రుద్రాణి గారు టిఫిన్‌ ప్లేట్‌లో ఉంటే తినకుండా దిక్కులు చూస్తున్నారు.

ప్రకాష్‌:  అంటే దిక్కులు చూస్తూ ఎక్కువ తినొచ్చనేమో కావ్య

రుద్రాణి: అన్నయ్య నేనేమీ ఈ ఆస్థి అంతా  కుంభకర్ణుడిలాగా తినడానికి దిక్కులు చూడటం లేదు

ఇందిరాదేవి: మరి ఇంకెందుకు చూస్తున్నావు.. ఒకేసారి అ సురస రాక్షసి లాగా మింగేయాలని చూస్తున్నావా..?

రుద్రాణి: అంటే మీ ఉద్దేశం ఆస్థి గురించి ఆలోచించడం తప్పా నాకు వేరే ఆలోచనే లేదనుకుంటున్నారా..?

అపర్ణ:  నీ పని ఈ ఆస్థిని ఎప్పుడు కొట్టేద్దామా..? అంటూ చూడటమేగా రుద్రాణి

రుద్రాణి: వదిన కాస్త అందరూ సైలెంట్‌గా ఉంటారా..? నేనేం ఎక్కువ తినడానికో.. లేక ఇంకేదో చేయడానికో దిక్కులు చూడటం లేదు. ఈ పాటికే రావాల్సిన ఈ ఇంటి వారసుడు ఇంకా రాలేదేంటని చూస్తున్నాను

ఇంతలో శృతి కావ్యకు ఫోన్‌ చేస్తుంది. కావ్య కట్‌ చేస్తుంది. శృతి పదే పదే చేయడంతో కావ్య లిఫ్ట్‌ చేస్తుంది

కావ్య: నేను టిఫిన్‌ చేస్తున్నాను తర్వాత మాట్లాడతాను

శృతి: మేడం ఇక్కడ కొంపలు అంటుకుంటున్నాయి. రాజ్‌ సార్‌ ఆఫీసుకు వచ్చారు. అంతా తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు మేడం

కావ్య: ఆయన అక్కడికి ఎందుకు వచ్చారంట

శృతి: నాకేం తెలుసు మేడం మీరు త్వరగా రండి

సుభాష్‌: ఏంటి ఏమైందమ్మా

కావ్య:  అగ్ని పర్వతం బద్దలైంది మామయ్య.. మీ పుత్రరత్నం ఆఫీసుకు వెళ్లారట

అందరూ షాక్‌ అవుతారు.

ఇందిరాదేవి: వాడు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లాడట

కావ్య: నాకేం తెలుసు అమ్మమ్మ గారు నేను ఆయన్ని రేపు ఆఫీసుకు తీసుకెళ్లి పరిచయం చేయాలనుకుంటే ఆయన ఇవాళే వెళ్లారట

అంటూ కావ్య ఆఫీసుకు బయలుదేరుతుంది. రుద్రాణి హ్యపీగా ఫీలవుతుంది. మరోవైపు రాహుల్‌ ఆస్తి పేపర్స్‌ తీసుకెళ్లి తన లవర్‌కు ఇస్తాడు.

లవర్‌:  ఇక నువ్వు నన్ను ఏదీ అడుక్కోవలసిన అవసరం లేదు. ఆర్డర్‌ వేస్తే నీ ఒడిలో సీతాకొకచిలుకలా వాలిపోతాను

స్వప్న: అప్పుడు నేను వచ్చి నీ ఒళ్లు చిల్లులు పడేలా చేస్తాను.. శభాష్‌రా మొగుడురా కట్టుకున్న దాని కంచంలో అన్నం లేదు కానీ ఉంచుకున్న దాని కొప్పులో మల్లెపూలు పెట్టాడన్నట్టు దీన్ని బాగానే బుట్టలో వేసుకున్నావే..? ఏంటే అలా చూస్తున్నావు. నేను ఎవరనా..? నువ్వు ఉంచుకున్నావే వాడి చేత తాళి కట్టించుకున్న పెళ్లాన్ని. అయినా వీడిని నేనే నమ్మను నువ్వెలా నమ్మావే.. ఓ మాటలతో మాయ చేశాడా..? ఓ ఈ డాక్యుమెంట్స్‌ ఇవ్వగానే నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి రెడీ అయిపోయావా..? అసలు ఇవి ఏ డాక్యుమెంట్సో తెలుసా..? డూప్లికేట్‌ డాక్యుమెంట్స్‌.. నీకిలా డూప్లికేట్‌ డాక్యుమెంట్స్‌ ఇచ్చి నిన్ను పూల్‌ ను చేశాడే పిచ్చి దానా..?

లవర్‌: ఏంటి ఇవి డూప్లికేటా రాహుల్‌

రాహుల్‌: అవును

లవర్‌: నన్నే చీట్‌ చేస్తావా..? నిన్ను..

అని కోపంతో రాహుల్‌ను కొట్టబోతుంటే స్వప్న అడ్డు పడుతుంది. వీడిని ఎవ్వరు కొట్టినా నేను సహించను వీణ్ని కొట్టినా తిట్టినా నేనే అంటూ చీపురు తీసుకుని రాహుల్‌ను కొడుతుంది. రాహుల్‌ లవర్‌ దగ్గరున్న నగలను అప్పు తీసుకుంటుంది. మరోవైపు ఆఫీసుకు వెళ్లిన రాహుల్‌ స్టాఫ్‌తో పెంట పెంట చేస్తుంటాడు. శృతి, కావ్యకు ఫోన్‌ చేసి మాట్లాడుతుంటే రాజ్‌ చూసి సీరియస్‌గా తిట్టి ఫోన్‌ స్విచాప్‌ చేయిస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!