Brahmamudi Serial Today Episode: అప్పును నిర్దోషిగా కోర్టు తీర్పు ఇవ్వడంలో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. యామిని మాత్రం కోపంతో రగిలిపోతుంది. ప్రోసీడింగ్ అంతా పూర్తయ్యాక అప్పు.. రాజ్ దగ్గరకు వచ్చి థాంక్స్ చెప్తుంది. కళ్యాణ్ కూడా థాంక్స్ చెప్తాడు.
రాజ్: అందరూ చెప్తున్నారు కానీ చెప్పాల్సిన వాళ్లు మాత్రం చెప్పడం లేదు.
కావ్య: ఎందుకు చెప్పాలండి లాస్ట్‌లో నన్ను చాలా టెన్షన్ పెట్టారు. మీరు ఇంకా రాలేదని నేనెంత కంగారు పడ్డానో తెలుసా..?.. ఊరికే జోక్ చేశాను రామ్ గారు థాంక్యూ వెరీ మచ్
యామిని: బావ కంగ్రాట్స్ బావ
రాజ్: థాంక్స్ యామిని
యామిని: నిజంగా నువ్వు సూపర్ బావ లాస్ట్ మినిట్‌లో ఆ సాక్ష్యం తీసుకొచ్చి అప్పును కాపాడేశావు. నువ్వే కనక లేకుండా ఉంటే అసలు అప్పు ఈ కేసు నుంచి బయట పడేదే కాదు. మరోసారి కంగ్రాచ్యులేషన్ బావ
రాజ్: థాంక్యూ… యామిని కానీ అప్పును కాపాడాను ఇంకొకటి మిగిలిపోయింది.
యామిని: ఏంటది బావ
రాజ్: అప్పుకు ఇలాంటి పరిస్థితి కల్పించిన వారి గురించి తెలుసుకోలేకపోయాను కదా..? వాళ్లెవరో నాకు తెలిసి ఉంటే నా స్టైల్లో వాళ్లకు కరెక్టుగా బుద్ది చెప్పేవాణ్ని.
కావ్య: మీరేం బాధపడకండి రామ్‌గారు. అప్పుకు మళ్లీ జాబ్ తిరిగి వస్తుంది కదా..? ఇక తనే చూసుకుంటుంది. తనకు ఈ పరిస్థితి కల్పించిన వాళ్లను పట్టుకుంటుంది.
అప్పు: అవును అక్కా నన్ను ఇంత కష్టపెట్టిన వాళ్లను ఎలా వదిలేస్తాను. వడ్డీతో సహా తిరిగి ఇవ్వడం నా బాధ్యత కదా
అంటూ అందరూ మాట్లాడుకుంటుంటే ఇరిటేటింగ్ గా యామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మనం వెంటనే ఇంటికి వెళ్లి అందరికీ ఈ గుడ్‌న్యూస్ చెబుదాం పదండి అంటాడు. అందరూ ఇంటికి వెళ్లిపోతారు. ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే.. ధాన్యలక్ష్మీ మళ్లీ అప్పును జాబ్ మానేయమని చెప్తుంది. దీంతో రాజ్.. ధాన్యలక్ష్మీని కన్వీన్స్ చేస్తాడు. ఇక యామిని, రుద్రాణి, రాహుల్ కొత్త ప్లాన్ చేస్తుంటారు.
యామిని: ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కావ్యనే గెలుస్తుంది. నా ఇంటికి వచ్చి నా చెంప పగులగొట్టిన ఆ అప్పు చేత చిప్ప కూడు తినిపించాలని ప్లాన్ చేసినా ఇప్పుడు కూడా ఆ అప్పును కాపాడి కావ్యనే గెలిచింది. వదలను. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను
రుద్రాణి: ఆవేశపడకు యామిని.. నువ్వు ఎంత ఎక్కువ ఆవేశపడితే అంత ఆ కావ్యకు ప్లస్ అవుతుంది.
యామిని: అంటే ఆ కావ్యను వదిలేయమంటారా..?
రుద్రాణి: అవును వదిలేయమనే చెప్తున్నాను
యామిని: రుద్రాణి గారు మీరేం మాట్లాడుతున్నారు.. దాన్ని నేను వదిలేయడం ఏంటి..?
రుద్రాణి: నేను వదిలేయమంది శాశ్వతంగా కాదు యామిని టెంపరరీగా టైం మనది కానప్పుడు వదిలేయాలి. ఇప్పుడు నువ్వు ఆ కావ్య మీద కోపంతో ఏమైనా చేస్తే.. అప్పు నీ మీద ఎంక్వైరీ వేస్తుంది. అప్పుడు అప్పును ఇలా ఇరికించింది నువ్వేనని.. రాజ్‌కు తెలిసిపోతుంది. అప్పుడు నీ ఉనికికే ప్రమాదం కదా ఒకసారి ఆలోచించు
యామిని: అంటే ఇప్పుడు నన్ను దాని ముందు తగ్గి బతకమంటున్నారా..?
రుద్రాణి: తగ్గి బతకమని చెప్పడం లేదు యామిని అవసరం మనది అయినప్పుడు తగ్గినా తప్పు లేదంటున్నాను.. ఆ కావ్యను దెబ్బ కొట్టే టైం వచ్చినప్పుడు వెంటనే నీకు కాల్ చేస్తాను. అప్పటి వరకు సైలెంట్‌గా ఉండు
యామిని: సరే ప్రస్తుతానికి మీరు చెప్పినట్టే సైలెంట్‌గా ఉంటాను
అని చెప్పగానే.. రుద్రాణి వెళ్లిపోతుంది. కారులో వెళ్తున్న రుద్రాణికి జగదీష్ కనిపిస్తాడు. వెంటనే జగదీష్ కారును ఫాలో అవ్వమని రుద్రాణి, రాహుల్‌కు చెప్తుంది. రేవతి గురించి రాహుల్‌కు చెప్తుంది రుద్రాణి. ఇక అపర్ణ, రేవతి కొడుకు రాజ్ ఇద్దరూ మాట్లాడుకోవడం రేవతి చూస్తుంది. ఎమోషనల్‌గా ఫీలవుతూ.. వెంటనే జగదీష్‌కు ఫోన్ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!