Brahmamudi Serial Today Episode: బెడ్ రూంలో కూర్చుని రాజ్‌నే గుర్తు చేసుకుంటుంది రేఖ. పక్కనే కూర్చున్న రుద్రాణి మాత్రం రాహుల్ కోసం ఎదురుచూస్తుంది. ఇంతకీ వీడికి రాజ్ కారు కీ దొరికిందా లేదా అని అనుకుంటుండగానే రాహుల్ వస్తాడు.
రుద్రాణి: రాహుల్ ఓకేనా..?
రాహుల్: కీస్ మన చేతిలోకి వచ్చినంత మాత్రాన పని అయిపోయినట్టు కాదు మమ్మీ ఆ బంగారం రాజ్ కారులోకి చేరితే అప్పుడు పని అయిపోయినట్టు
రుద్రాణి: ఇంకెందుకురా లేటు.. ఆ బంగారాన్ని రాజ్ కారులో పెట్టేయ్. దొంగ బంగారం కొన్నాడన్న కేసులో వాణ్ని పూర్తిగా ఇరికించేయ్
రాహుల్: అదంతా జరగాలంటే తొందర పడకూడదు మమ్మీ ఎవ్వరూ చూడని టైంలో అందరి కళ్లు కట్టి అ పని చేయాలి. వెంటనే పోలీసులను రప్పించాలి. ఆ దొంగ బంగారం కేసులో రాజ్‌ను ఇరికించాలి
రేఖ: మమ్మీ దొంగ బంగారం కేసులో రాజ్ బావను ఇరికిస్తారా..?
రాహుల్: నువ్వెందుకే అంత ఫీల్ అవుతున్నావు
రేఖ: ఎంతైనా నేను చేసుకోబోయేవాడు కదా అన్నయ్య.. నాకు కాబోయే మొగుడు జైళ్లో ఉంటే బాగోదు కదా అన్నయ్య
రాహుల్: ఏంటే వాడు అప్పుడే నీకు మొగుడైపోయాడా..? అంతదాకా వెళ్లావా..?
రేఖ: వెళ్లాలని అనిపిస్తుంది అన్నయ్య.. కానీ ఎక్కడ బావ చాన్స్ ఇస్తేనే కదా..?
రాహుల్: నువ్వు అప్పుడే ఊహల్లోకి వెళ్లకు వాడు నీకు దక్కాలంటే చాలా తతంగం ఉంది
రేఖ: కానీ మీరు ఇదంతా చేసి రాజ్ బావను జైలుకు పంపిస్తున్నారే ఇంకెలా బావ నావాడు అవుతాడు
రాహుల్: వాణ్ని జైలుకు పంపకపోతే నేను నెంబర్ వన్ అవ్వలేను
రేఖ: కానీ జైలుకు పంపితే బావకు నేను పెళ్లాన్ని అవ్వలేను
రాహుల్: మమ్మీ దీనికి ఎలా చెప్పను నువ్వైనా చెప్పు
రుద్రాణి: నువ్వు ఆగరా..? రేఖ నీకు నేను ఉన్నాను కదా..
రేఖ: కానీ బావ ఉండడు కదా..
రుద్రాణి: చూడు రేఖ వాడు నీకు కావాలంటే రాజ్ నీ కంట్రోల్ లోకి రావాలి. అలా రావాలంటే వాడు ఒంటరి అయిపోవాలి. అప్పుడు మన మాట వినే స్థితికి వస్తాడు. నువ్వు వాడి లైఫ్‌కు ఎంత అవసరమో వాడికి అర్థం అవుతుంది. అప్పుడు నీవు అనుకున్నది అంతా జరుగుతుంది
రేఖ: మమ్మీ అది ఎలా జరుగుతుంది. బావ మనసంతా ఆ కావ్య ఉంది కదా..?
రుద్రాణి: కావ్య కడుపు పోతుంది. మళ్లీ దానికి పిల్లుల పుట్టే అవకాశమే లేదు.. ఆ విషయం నీకు తెలుసు కదా..? ఈ ఇంటికి వారసుడు కావాలి. కాబట్టి వాడికి ఆ కావ్యకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ నువ్వు అని నేను అనిపిస్తాను..
రేఖ: మమ్మీ ఎందుకో నువ్విదంతా చెప్తుంటే అంతా జరుగుతుంది అనిపిస్తుంది
రుద్రాణి: జరుగుతుంది ఒక పక్క కావ్య కడుపు పోవాలి. మరోపక్క దొంగ బంగారం కేసులో రాజ్ జైలుకు పోవాలి..
రేఖ: మమ్మీ ఆ ఒక్క మాట వింటేనే నాకు టెన్షన్ గా ఉంది
రాహుల్: ఎందుకే టెన్షన్ అంతవరకు నేను రానివ్వను.. రాజ్ ను నేనే బెయిల్ మీద బయటకు తీసుకొస్తాను.. అప్పుడే రాజ్‌కు నా మీద గౌరవం.. నీ మీద ప్రేమ రెండు ఒకేసారి పెరిగిపోతాయి
అంటూ రాహుల్ చెప్పగానే.. రేఖ సరే అంటుంది. తర్వాత కనకం వచ్చి అప్పు, కావ్యలను పుట్టింటికి పంపించమని అడుగుతుంది. అపర్ణ ఒప్పుకోదు. దీంతో అందరూ కలిసి అక్కడే సీమంతం చేయడానికి రెడీ అవుతారు. ఆ సంతోషంలో సుభాష్ మందు తాగుతుంటే వెళ్లి అపర్ణ తిడుతుంది. తర్వాత కనకం సీమంతానికి రాజ్, కళ్యాణ్‌కు డబ్బులివ్వబోతుంది. వద్దని వాళ్లిద్దరూ తీసుకోరు. దీంతో కనకం ఎమోషనల్ అవుతుంది. తర్వాత కళ్యాణ్ అప్పు కోసం చీర తీసుకొచ్చి ఇస్తాడు. అదే చీర సీమంతంలో కట్టుకోవాలని చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!