Brahmamudi Serial Today Episode: మినిస్టర్‌ ధర్మేంద్ర ఇంట్లోకి దొంగచాటుగా రాజ్‌ను తీసుకెళ్తుంది కావ్య. లోపలికి వెళ్లి తులసి వాళ్ల బెడ్‌ రూం దగ్గరకు తీసుకెళ్తుంది. రూంలో తులసి పాపను ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే ధర్మేంద్ర అసహనంగా అక్కడికి వస్తాడు.

Continues below advertisement

కావ్య: ఇప్పటికైనా నమ్మండి.. మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని మీరు కళ్లారా చూస్తే అయినా మీకు నమ్మకం కుదురుతుంది. ఒక తల్లి మనసు పడుతున్న ఆరాటం మీకు అర్థమవుతుంది

ధర్మేంద్ర: ఏంటి తులసి.. నా మాట వినిపించనంతగా ఆ పాపతోనే మునిగిపోయావా?

Continues below advertisement

తులసి: ఏమండీ.. చిన్నపిల్ల ఏడుస్తుంటే అలా కసురుకుంటారేంటి? ఆ అరుపులకి పాప భయపడి లేస్తుంది..

ధర్మేంద్ర: పాప పుట్టినప్పటి నుంచి నువ్వు నన్ను మర్చిపోతున్నావు. నీ ప్రపంచం అంతా ఆ చంటిపిల్లే అయిపోయింది. కనీసం మొగుడికి ఏం కావాలో పట్టించుకోవడం లేదు

తులసి: మీ పనులు మీరు చేసుకోగలరు.. కానీ నా బిడ్డ పసిపాప. లేక లేక పుట్టిన బిడ్డ ఇది. ఈ బిడ్డే లేకపోయుంటే నేను అనే దానిని ఉండే దానిని కాదు. నా ప్రాణానికి ప్రాణమైన పాపని పనివాళ్లకు ఎలా అప్పగిస్తాను? ఆడదానికి బిడ్డ పుట్టే వరకే భర్త మీద ప్రేమ.. ఆ తర్వాత బిడ్డే సర్వస్వం.. అవును మొన్న గుడిలో కావ్య మన పాపని ఎత్తుకుంటే మీరెందుకు అంత విచిత్రంగా ప్రవర్తించారు? ఏదో కొంపలు మునిగిపోయినట్లు పాపని లాగేసుకుని నన్ను అంత హడావుడిగా ఎందుకు తీసుకొచ్చారు?

ధర్మేంద్ర: అది.. మన పాప పరాయివాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఇష్టం లేక అలా చేశాను. అయినా ఆ కావ్య తన బిడ్డ కోసం తల్లడిల్లిపోతోంది, నేను కూడా మనవాళ్లకి చెప్పాను.. వెతుకుతున్నారు.. పాప నిద్రపోయింది కదా మనం భోజనం చేద్దా పద తులసి

అని చెప్పగానే తులసి సరే అంటూ ఇద్దరూ కలిసి భోజనం చేయడానికి వెళ్తారు. వాళ్లు రాజ్‌, కావ్య రూంలోకి వెళ్తారు. కావ్య పాపను ఎత్తుకుని రాజ్‌కు చూపిస్తుంది.

కావ్య: చూశారా అండీ.. మన ఇంట్లో ఉండాల్సిన బిడ్డ ఇది. ఇదిగోండి.. పాప చేతి మీద ఉన్న ఈ పుట్టుమచ్చ చూడండి. ఇది మన రక్తం కాదని ఎలా అనగలరు?

రాజ్‌: అవును కళావతి అచ్చం నీలాగే ఉంది..

అప్పుడే  పాప ఏడుస్తుంది. ఆ ఏడుపులకు తులసి భోజనం వదిలేసి పరిగెత్తుకుంటూ రూంలోకి వస్తుంది. వెనకే ధర్మేంద్ర వస్తాడు. వాళ్లు రావడం గమనించిన కావ్య, రాజ్‌ చాటుగా దాక్కుంటారు.

ధర్మేంద్ర: నీకు పిచ్చి పట్టిందా తులసీ..? చిన్న పిల్లలు అన్న తర్వాత ఎవరైనా ఏడుస్తారు. కొంచెం ఉంటే మెట్లపై పడిపోయేదానివి

తులసి: నా పాపకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను.. చచ్చిపోతాను. పాప నా ప్రాణం.. రేపు పాపను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలి. నా పాలు పాపకు సరిపోవడంలేదు

అంటూ మాట్లాడుకుంటుంటే.. రాజ్‌, కావ్య మెల్లగా అక్కడి నుంచి వెల్లిపోతారు. కిందకు వెళ్లాక రాజ్‌, కావ్యకు సారీ చెప్తాడు. ఇప్పుడు సారీ కాదు మన బిడ్డను మనం ఎలా దక్కించుకోవాలో ఆలోచించాలి అని కావ్య చెప్తుంది. నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను కళావతి అంటాడు రాజ్‌. రాజ్‌కు తన ప్లాన్‌ చెప్తుంది కావ్య. మరుసటి రోజు ఇంట్లో కావ్య నార్మల్‌గా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత కావ్య, రాజ్‌ పాపను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడికి తులసి కూడా పాపను తీసుకుని వస్తుంది. కావ్య, డాక్టర్‌ అనురాధ కలిసి నాటకం ఆడతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!