Brahmamudi Serial Today Episode: కావ్య తన బిడ్డ విషయంలో అన్ని నిజాలు తెలిసన డాక్టర్‌ చక్రవర్తి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని అనురాధకు చెప్తుంది. అయితే చక్రవర్తి గురించి పూర్తి వివరాలు అయన ఇల్లు ఎక్కడుంది ఆయన ఎప్పుడు ఎక్కడుంటారు అనే విషయాలు మొత్తం నర్స్‌ నీలవేణికి తెలిసి ఉంటాయి నీలవేణిని అడుగుదాం పద అని ఇద్దరు వెళ్తారు. అప్పటికే ఇంకో నర్సుతో నీలవేణి మాట్లాడుతూ ఉంటుంది.

Continues below advertisement

నీలవేణి: నేను పది లక్షలు పెట్టి గోల్డ్‌ చైన్‌ కొన్నాను. చూడు ఎలా ఉంది

నర్స్‌: నీకు అంత డబ్బు ఎక్కడిది నీలవేణిగారు

Continues below advertisement

నీలవేణి: ఎవరైనా పెద్దవాళ్లు చిన్న హెల్ప్ అడిగితే సాయం చేస్తే మనకి ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తారు.. అలాంటిదే నేను ఈ మధ్య ఒక హెల్ప్‌ చేశాను వాళ్లు డబ్బు ఇచ్చారు ఆ డబ్బుతోనే ఈ చైన్‌ కొన్నాను చూడు ఎలా ఉంది

అప్పుడే డాక్టర్‌ అనురాద, కావ్య వస్తారు. వాళ్లను చూసిన నీలవేణి షాక్‌ అవుతుంది.

కావ్య: ఎవరి బిడ్డను ఎవరికిస్తే నీకు బాగా గిట్టుబాటు అయినట్టు ఉంది.

నీలవేణి: పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా…?

కావ్య: (నీలవేణిని కొడుతుంది.) అసలు ఆ రోజు ఏం జరిగింది. మినిస్టర్‌ దర్మేంద్ర దగ్గర ఉన్నది ఎవరి పాప..?

నీలవేణి: నాకేం తెలియదు మేడం.. నిజంగా నాకు తెలియదు

డాక్టర్‌ అనురాధ: ఇది చాలా సీరియస్ మేటర్.. నిజం చెప్ప లేదంటే నువ్వు ఇరుక్కుంటావు చివరకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

అనగానే భయంగా నీలవేణి జరిగింది మొత్తం చెప్తుంది.

నీలవేణి: మినిస్టర్‌ దర్మేంద్ర బిడ్డను మార్చి కావ్య బిడ్డను తనకు ఇవ్వమన్నాడు అలాగే చేశాను. అందుకోసం నాకు పది లక్షల చెక్‌ ఇచ్చారు.

కావ్య: డబ్బు కోసం అమ్మతనాన్ని అమ్మేస్తావా? నిన్ను చంపేస్తాను. దీని వల్ల నేను ఇన్నిరోజులు నరకయాతన అనుభవించాను. నాకు నా బిడ్డను దూరం చేస్తావా..?

అంటూ కావ్య నీలవేణిని కొడుతుంది. అనురాధ కావ్యను ఆపేస్తుంది.

అనురాధ: కావ్య మినిస్టర్ దగ్గరి నుంచి మీ పాపని తెచ్చుకోవడం ఎలా అనేది ఆలోచించాలి

కావ్య: ఇప్పుడే ఈ నర్స్‌ని మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లి అందరి ముందు నిజాలు చెప్పించి నా బిడ్డను నేను తెచ్చుకుంటాను

నీలవేణి: నన్ను ఇందులోకి లాగొద్దు మేడం.. .. నిజం తెలిస్తే ఆ మినిస్టర్ నన్ను బతకనివ్వడు.. మినిస్టర్ గారిని ఎదురించేంత శక్తి, స్థాయి నాకు లేవు మినిస్టర్ గారిని వ్యతిరేకించిన చక్రవర్తి గారు కనిపించకుండా పోయారు.. ఇప్పుడు నేను నిజం చెప్పానని తెలిస్తే మినిస్టర్ నన్ను బతకనివ్వడు.. నాకు ఇద్దరు బిడ్డలు.. ఇద్దరూ చిన్నవాళ్లే.. వాళ్లకు నేను తప్ప ఎవరూ లేరు, మీకు నిజం చెప్పగలను కానీ... మినిస్టర్ ముందు నిలబడలేను

కావ్య: బిడ్డకు తల్లి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు... అందుకే వదిలేస్తున్నాను వెళ్లు

నీలవేణి వెళ్లిపోతుంది.

అనురాధ: కావ్య నీకు ఉన్నది నీలవేణి సాక్ష్యం ఒక్కటే.. ఇప్పుడే ఏ ప్రూఫ్‌తో నీ బిడ్డను తెచ్చుకుంటావు

అంటూ డాక్టర్‌ అడగ్గానే.. నా పాపకి అరచేతిలో పుట్టుమచ్చ ఉంది మేడం..  ఆ లిస్ట్ ఇస్తే నేను చూసుకుంటాను అని చెప్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరి ముందు కావ్యను పిచ్చి దాన్ని చేసేలా రేఖ నాటకం ఆడుతుంది. రాజ్‌ కాల్‌ చేసినా కావ్య లిఫ్ట్ చేయదు. ఇక హాస్పిటల్‌ రికార్డుల్లో కూడా మినిస్టర్‌ బిడ్డకు అరచేతిలో పుట్టమచ్చ ఉన్నట్టు రాశారని డాక్టర్‌ చెప్తుంది. హాస్పిటల్‌ వాళ్లది అయినప్పుడు రికార్డులు మార్చడం గొప్ప కాదు అంటూ కావ్య ధర్మేంద్ర ఇంటికి వెళ్లి వార్నింగ్‌ ఇస్తుంది. నా బిడ్డను నాకివ్వు లేదంటే నేను ఎంతదాకైనా వెళ్తాను అంటూ నిలదీస్తుంది. ధర్మేంద్ర షాక్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!