Brahmamudi Serial Today Episode: బాధతో అలిగిపడుకున్న కావ్య దగ్గరకు రాజ్ వచ్చి ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతాడు. ఏం లేదని కావ్య చెప్తుంది. తిన్నావా అని రాజ్ అడుగుతే ఇవాళ ఎవరితో తిట్లు తినలేదని వెటకారంగా రిప్లై ఇస్తుంది. దీంతో రాజ్ బయటకు వెళ్లిపోతాడు. కావ్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రాజ్ భోజనం ప్లేట్ తీసుకుని వచ్చి కావ్య చేతులు కట్టేసి భోజనం తినిపిస్తుంటాడు. కావ్య అన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ భోజనం చేస్తుంది. తర్వాత రాజ్ టాబ్లెట్స్ ఇస్తాడు కావ్యకు. తర్వాత ఇంక తీరిగ్గా పడుకో నేను హాయిగా పడుకుంటాను అని రాజ్ చెప్తుండగానే శ్వేత కాల్ చేస్తుంది. రాజ్ తనకు అర్జెంట్ కాల్ వస్తుంది. నేను మాట్లాడి వస్తాను అంటూ బయటకు వెళ్తాడు. కావ్య బాధగా చూస్తూ.. కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్లి..
కావ్య: కృష్ణ నీ మాయలో నేను పడుతున్నానా? ఎనిమిది మంది భార్యలలో ఒక భార్య దగ్గరుంటే మిగతా ఏడుగురి భార్యలను నువ్వు ఎం మాయ చేసి ఎలా మభ్యపెట్టి నీ పబ్బం గడుపుకున్నావో.. నాకు అర్థం కావడం లేదు. ఇందాక నా గదిలో ఒక మాయ జరిగింది. నా భర్త నాకు భోజనం తినిపించాడు. అప్పుడు ఏమీ అనకుండా నా చేతులు కట్టేశాడు. ఆ గోరు ముద్దల రుచి చూసి నా నోరు నేనే కట్టేసుకున్నాను. ఇలాంటిదేనా నువ్వు కూడా ఉపయోగించింది. మా ఆయన నీలాగే చేస్తున్నట్లు అనిపించింది. అప్పటిదాకా నాతో ఉండి ఆ తర్వాత ఇంకెవరితోనో ఆనందంగా ఉండి అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు. ఏది సత్యం ఏది అసత్యం ఈరెండిటి మధ్య ఉన్న గీత మీద నేనున్నాను. గీత చెప్పినట్లు నువ్వే నా సమస్యను పరిష్కరించాలి.
అంటూ కృష్ణున్ని వేడుకుంటుంటే ఇంతలో బామ్మ వచ్చి కావ్యను ఇక్కడేం చేస్తున్నావని అడగ్గానే రాజ్ విషయాన్ని ఇన్‌డైరెక్టుగా తన ఫ్రెండ్‌కు జరిగిన సంఘటన అని చెప్తుంది. దీంతో ప్రశ్నించాలని.. అనుమానంతో ఉండటం కన్నా భర్తను నిలదీసి అడగాలని సూచిస్తుంది. దీంతో కావ్య కృష్ణుడి వైపు చూసి ఈ విధంగా నాకు దారి చూపావా జగద్గురు అని మనసులో అనుకుంటుంది. నువ్వు ప్రశాంతంగా పడుకో రేపు మీ ఫ్రెండుకు చెప్పు అని బామ్మ వెళ్లిపోతుంది.
కావ్య: నిజంగా నువ్వు అమ్మమ్మతో నా కర్తవ్యాన్ని చెప్పించావు స్వామి. ముందు ఆ ఇద్దరి మధ్య ఉన్నదేంటో కనుక్కుంటాను.
కళ్యాణ్, కావ్య మాట్లాడుకుంటుంటారు.
కావ్య: అమ్మమ్మగారు నా ఫ్రెండు కోసం ఇచ్చిన సలహా పాటించాలంటే ఏం చేయాలో.. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు కవిగారు.
కళ్యాణ్: ఒక కవి నుంచి కవిత్వం రావాలంటే భావావేశం రావాలి. ఒక భార్య నుంచి విప్లవం రావాలంటే ప్రేమావేశం రావాలి. ప్రేమ ప్లస్ ఆవేశం ఈ రెండు కావాలి. మీకెలాగు అన్నయ్య ప్రేమ ఉంది ఇక రావాల్సింద ఆవేశమే..
కావ్య: ఆవేశం తెచ్చుకుంటే ఆయాసం తప్ప ఇంకేం మిగులుతుంది కవిగారు. మీ అన్నయ్య దగ్గరకు వెళ్లి మీకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం చెప్పండి అని నిలదీస్తే బాగుండదు కదా?
కళ్యాణ్: అందుకే వదిన మనం నవ్వినట్లే ఉండాలి. చేసేది చేస్తూనే ఉండాలి. ఏమీ ఎరుగనట్లు నటించాలి. అన్నీ తెలసుకుంటూనే ఉండాలి.
కావ్య: అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి కవిగారు.
కళ్యాణ్: ఆ కాలంలో షర్ట్‌కు అంటిన కుంకుమ బొట్టు వల్లో.. పొడుగాటి తల వెంట్రుకల వల్లో గుర్తు పట్టేవారు. ఈ కాలంలో కనిపెట్టాలంటే సులువైన పద్దతి ఎప్పుడో కనిపెట్టారు. అదే సెల్‌ఫోన్. ముందు అన్నయ్య సెల్‌ఫోన్ నుంచి మొదలుపెడదాం.
కావ్య: అంటే చాటింగ్ చెక్ చేద్దామా?
కళ్యాణ్: అవును అప్పుడే మనం చీటింగ్ గురించి తెలుసుకోవచ్చు.
అని ఇద్దరూ ప్లాన్ వేసుకుని రాజ్ బెడ్ రూం దగ్గరకు వస్తారు. రాజ్ ఫోన్‌లో శ్వేతతో చాట్ చేస్తుంటాడు. అన్నయ్య బాత్రూంలోకి వెళ్లగానే ఫోన్ తీసుకొని చెక్ చేద్దాము అంటూ కళ్యాణ్ చెప్తుండగానే రాజ్ బాత్రూంలోకి వెళ్తాడు. కావ్య లోపలకి వెళ్లి రాజ్ ఫోన్ తీసుకురావడానికి భయపడి ఉత్తి చేతులతో బయటకు వస్తుంది. మీకు సంస్కారం ముఖ్యమా..? మీ సంసారం ముఖ్యమా అని కళ్యాణ్ అడుగుతాడు. నాకు సంసారమే ముఖ్యం కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు అంటుంది కావ్య.. అయితే మీరు నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు నేను మీకోసం ధైర్యం చేస్తాను. అంటూ కళ్యాణ్ లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి ఒపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. కావ్య కంగారుపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ : చేదు వార్త చెప్పిన ప్రియాంక.. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ ఏడ్చిన నటి