Brahmamudi Serial Today Episode: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ తాను నమ్మనని తన పాప కోసం తానే వెతుకుతానని కావ్య చెప్పి రూంలోకి వెళ్లి దేవుడి దగ్గర నిలబడి తన బాధను చెప్పుకుంటుంది. ఇంతలో పాప గట్టిగా ఏడుస్తుండటంతో కావ్య దగ్గరకు వెళ్లి చూస్తుంది. పాప నోట్లోంచి నురగ వస్తుంటుంది. కావ్య భయంగా పాపను తీసుకుని హాల్లోకి వెళ్తుంది. అందరూ కలిసి పాపను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. హాస్పిటల్‌ లో డాక్టర్‌ చక్రవర్తి పాపను చూసి షాక్‌ అవుతాడు.

Continues below advertisement

డాక్టర్‌: పాప బాడీ రంగు మారింది.. ఇలా మారడం చాలా డేంజర్‌.. నర్స్‌ వెంటనే పాపకు టెస్టులు చేయండి

నర్సు: సరే సార్‌..

Continues below advertisement

అని పాపను తీసుకుని ల్యాబ్‌లోకి వెళ్తుంది.

కావ్య: పాపని నేనేం చేయలేదు.. ఉన్నట్లుండి ఇలా అయిపోయింది

రాజ్‌: నీ గురించి మాకు తెలియదా కళావతి నీకు పాప నచ్చకపోయినా అలాంటి పనులు చేసేదానివి కాదని నాకు తెలుసు..

డాక్టర్‌: పాపకు ట్రీట్‌మెంట్‌ చేశాము ఇప్పుడు పర్వాలేదు.. రిపోర్ట్స్‌ వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి

కావ్య: ఏ తల్లి కన్నబిడ్డో నా చేతుల్లో నీకు ఈ పరిస్ధితి వచ్చింది.. నిన్ను ఎంతో అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లికి దూరం అయ్యావు.. ఈ పాప తన కన్నతల్లి ఒడిలో ఉండుంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదు

అంటూ కావ్య బాధపడుతుంది. ఇక పాప రిపోర్ట్స్‌ వచ్చాయని నర్సు తీసుకెళ్లి డాక్టర్‌ చక్రవర్తికి ఇస్తుంది. డాక్టర్‌ రిపోర్ట్స్‌ చూసి షాక్‌ అవుతాడు.

డాక్టర్‌: ఈ రిపోర్ట్స్ ఆ పాపవేనా?

నర్సు: ఆ పాపవే డాక్టర్‌

అని నర్స్‌ చెప్పగానే.. డాక్టర్‌ చక్రవర్తికి ధర్మేంద్ర మాటలు గుర్తుకు వస్తాయి.

ధర్మేంద్ర: డాక్టర్‌ నా భార్య పరిస్థితి చాలా డేంజర్‌లో ఉంది. పాప ఇలా పుట్టిందని తెలిస్తే నా తులసి నాకు దక్కదు ఫ్లీజ్‌ మీరే ఎలాగైనా నాకు హెల్ప్‌ చేయాలి..

డాక్టర్‌: మేం చేసేదంతా చేశాము సార్‌.. అంతకు మించి మేమేమీ చేయలేము కదా

ధర్మేంద్ర: మీరు చేయగలరు డాక్టర్‌.. అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నా సంతోషం, నా భార్య సంతోషం, నా కుటుంబ సంతోషం అంతా మీ చేతుల్లోనే ఉంది డాక్టర్‌.. ఫ్లీజ్‌ మీరే హెల్ప్‌ చేయాలి.. ఎలాగైనా ఆ బిడ్డను మార్చండి డాక్టర్‌

మినిస్టర్‌ మాటలకు డాక్టర్‌ చక్రవర్తి షాక్‌ అవుతాడు.

డాక్టర్‌: నేను ఆ పని చేయలేను మినిస్టర్‌ గారు. అనారోగ్యంతో ఉన్న మీ పాపని తీసుకెళ్లి మరో తల్లికిస్తే.. ఆ తర్వాత ఆ పాప చనిపోతే ఆ తల్లి పరిస్ధితి ఏంటీ?    పేషెంట్స్‌ అందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది.. నేను నా వృత్తికి ద్రోహం చేయలేను.. ఇప్పుడే వెళ్లి మీ వైఫ్‌కి చెప్పాల్సిన విధంగా చెబితే ఆమె వింటారు

ధర్మేంద్ర: సరే డాక్టర్‌ ఆగండి.. హాస్పిటల్‌లో ఈ నిజం ఎంత మందికి తెలుసు

డాక్టర్‌: నాకు మన హెడ్‌ నర్స్‌ నీలవేణికి మాత్రమే తెలుసు

అంటూ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకుంటాడు డాక్టర్‌. వెంటనే కోపంగా దర్మేంద్ర దగ్గరకు వెళ్లి నిజం చెప్పాలనుకుంటాడు. డాక్టర్‌ బయటకు రాగానే పాప గురించి అడుగుతారు రాజ్‌, కావ్య. ఇప్పుడు బాగానే ఉందని రిపోర్ట్స్‌ వచ్చాక అన్ని చెప్తానని డాక్టర్‌ వెళ్లిపోతాడు. అప్పటికే మినిస్టర్‌ దగ్గర రుద్రాణి ఉంటుంది. డాక్టర్‌ వెళ్లి తులసిని నిజం చెప్తానని అనడంతో మినిస్టర్‌ తన మనుషులతో డాక్టర్‌ను కిడ్నాప్‌ చేయిస్తాడు. తర్వాత హాస్పిటల్‌కు ఫోన్‌ చేసి హెడ్‌ నర్సుతో మాట్లాడతాడు ధర్మేంద్ర. మరోవైపు ఇంకో డాక్టర్‌ అనురాధ రాజ్‌ వాళ్ల పాపను చూసి పాపకు సీరియస్‌ కండీషన్‌ ఉందని ఆపరేషన్‌ చేయాలని చెప్తుంది. దీంతో రాజ్‌, కావ్య షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!