Brahmamudi Serial Today Episode: కావ్య తన పాప ఎక్కడ ఉందో కనిపెడతానని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో ఆ విషయం రేఖ, రుద్రాణికి చెప్తుంది. దీంతో రుద్రాణి వెంటనే ఈ విషయం మినిస్టర్‌ ధర్మేంద్రకు చెప్పాలనుకుంటుంది. మరోవైపు ధర్మేంద్ర తన పాపతో హ్యపీగా ఉంటాడు. అప్పుడే రుద్రాణి వెళ్తుంది. రుద్రాణిని చూసిన తులసి పాపను తీసుకుని రూంలోకి వెళ్లిపోతుంది. ధర్మేంద్ర బయటకు వెళ్లి రుద్రాణితో మాట్లాడతాడు.

Continues below advertisement

ధర్మేంద్ర: ఏంటి రుద్రాణి గారు మళ్లీ వచ్చారు. ఇంకా ఏమైనా కావాలా..?  ఏం కావాలో చెప్పండి..?  

రుద్రాణి: నాకు ఏమీ వద్దు మినిస్టర్‌ గారు మీకు ముప్పు ఇంకా తప్పిపోలేదని హెచ్చరించడానికి వచ్చాను..  కావ్య చాలా కాన్ఫిడెంట్‌గా ఆ పాప తన పాప కాదని చాలా  పట్టుదలగా ఉందట. అసలే ఆ  కావ్యకు  పట్టుదల ఎక్కువ. తను అనుకున్నది సాధించడానికి ఎంతవరకైనా వెళ్తుంది.

Continues below advertisement

ధర్మేంద్ర: అవునా.. ఒకవేళ పరిస్థితి అంతదాకా వస్తే నా డబ్బు పరపతి ఉపయోగిస్తాను. పాపను వదులుకోవాల్సి వస్తే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు

రుద్రాణి: ఎందుకైనా మంచిది అక్కడ ఇంట్లో జరిగే విషయాలు ఎప్పటికప్పుడు మా పిల్లల ద్వారా తెలుసుకుని మీకు చెప్తుంటాను. మీరు అందుకు తగ్గట్టుగా జాగ్రత్త పడితే చాలు

అంటూ రుద్రాణి ధర్మేంద్రను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్‌  చేస్తే.. పాప ఏడుస్తుంటే.. అపర్ణ, ఇందిరాదేవి, ధాన్యలక్ష్మీ ఏడుపు ఆపేందుకు ప్రయత్నిస్తారు. ఎంత ట్రై చేసినా పాప ఏడ్వడం ఆపదు.

ఇందిరాదేవి: పాప ఏడుపు ఆపాలంటే తల్లిపాలు, తల్లి స్పర్శ ఉండాలి కానీ కావ్య మాత్రం పాలు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు కదా..?

అపర్ణ: అన్ని తెలిసి మనం ఏమీ చేయలేకపోతున్నాము అత్తయ్యా

అంటూ బాధపడుతుంది. ఇంతలో కావ్య రూంలోంచి బయటకు వస్తుంది.

కావ్య: అత్తయ్యా పాపను ఇలా ఇవ్వండి..

అపర్ణ: ఎందుకు కావ్య.. మళ్లీ ఏం చేస్తావు..?

కావ్య: ఏమీ లేదు ఇవ్వండి అత్తయ్యా

అంటూ పాపను తీసుకుని రూంలోకి వెళ్లి పాలు పడుతుంది. పాప ఏడుపు ఆపేస్తుంది. అందరూ హ్యపీగా ఫీలవుతారు. అంతా గమనిస్తున్న రేఖ మాత్రం ఇరిటేటింగ్‌ గా ఫీలవుతూ రాహుల్ దగ్గరకు వెళ్తుంది.

రేఖ: ఓరేయ్‌ అన్నయ్య అసలు మీరు చెప్పిందేంటి..? ఇక్కడ జరుగుతున్నదేంటి..? మీరు చెప్పిన దానికి ఇక్కడ రివర్స్‌ లో జరుగుతుంది. ఇలాగే జరిగితే రాజ్‌ బావ ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాడు..?

రాహుల్‌: అయ్యో రేఖ ఇప్పుడేమైందని అంతలా ఫీలవుతున్నావు..

రేఖ: ఇంకా ఏం కావాలి అక్కడ కావ్య పాపను తీసుకెళ్లి పాలు పడుతుంది.

రాహుల్‌: కావ్య, పాపకు పాలు పట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం అయినట్టు కాదు..

రేఖ: ఇప్పుడు పాలు పట్టింది ఇక ఆ పాప తన బిడ్డే అని ఒప్పుకున్నట్టే కదా..? ఇక సమస్య తీరిపోయినట్టే కదా..?

రాహుల్‌:  కావ్య ఎప్పటికీ ఆ పాప తన పాప కాదనే చెప్తుంది. తన పాప కోసం కావ్య ఇంట్లో వాళ్లతో గొడవ చేస్తుంది. చివరకు ఆ గొడవ పెద్దదై రాజ్‌, కావ్యను దూరం చేసుకునే దాకా వెళ్తుంది. అప్పుడు రాజ్‌ కచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటాడు. అంతవరకు నువ్వు వెయిట్‌ చేయ్‌ రేఖ

అంటూ రాహుల్‌, రేఖను కన్వీన్స్‌ చేస్తాడు. రేఖ సరే అంటూ కిందకు వెళ్తుంది. అప్పుడే కావ్య రూంలోకి వచ్చి ఇక పాపకు తానే పాలు పడతానని అందుకోసం తాను ఏమేం తినాలని అడుగుతుంది. దీంతో అపర్ణ, ఇందిరాదేవి హ్యాపీగా కావ్య ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయాలు చెప్తారు. ఇంతలో రాజ్‌ వచ్చి పాపను ఇంత త్వరగా ఒప్పుకున్నందుకు థాంక్స్‌ అంటాడు. దీంతో పాప ఏడుస్తుందని పాలు పట్టాను అంతే కానీ ఈ పాప మన పాప కాదు. మన పాప ఎక్కడుందో వెంటనే వెతకాలని చెప్తుంది. అయితే ఈ పాపకు డీఎన్‌ఏ టెస్ట్ చేయిద్దామని రాజ్‌ చెప్తాడు. అంతా విన్న రేఖ వెంటనే డీఎన్‌ఏ టెస్ట్‌ గురించి రుద్రాణికి చెప్తుంది. రుద్రాణి మనిస్టర్‌ ధర్మేంద్రకు విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!