Brahmamudi Serial Today Episode: రేఖను రాజ్‌కు రెండో పెళ్లి చేయాలని అందుకు కావ్యనే ముందుకు వచ్చేలా చేయాలని రాహుల్‌ చెప్తాడు. అదెలా సాధ్యం అవుతుందని రుద్రాణి అడిగితే.. కావ్య కడుపులో బిడ్డను చంపేసి కావ్యకు ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా చేయాలని చెప్తాడు.

Continues below advertisement

రుద్రాణి: ప్లాన్‌ చాలా బాగుంది. కానీ అలా చేస్తే రేఖనే పెళ్లి చేసుకుంటాడని గ్యారంటీ ఏంటి..?

రాహుల్‌: రాజ్‌కు భార్యగా ఈ ఇంటికి కోడలిగా నా కూతురు రేఖ అన్ని విధాలా అర్హురాలు అని వాళ్ల ముందు నువ్వు నా చెల్లిని నిలబెట్టావనుకో రేఖ, రాజ్‌ కు భార్య అయ్యే చాన్స్‌ ఉండదంటావా మమ్మీ

Continues below advertisement

రేఖ:అన్నయ్య థాంక్స్‌ అన్నయ్య నా లైఫ్‌ను నిలబెట్టే మాట చెప్పావు. మమ్మీ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. అన్నయ్య చెప్పింది జరగాలి జరిగి తీరాలి అంతే..

రుద్రాణి: సరే మీరు ఒక నిర్ణయానికి వచ్చాక నేను మాత్రం కాదనేదేముంది. నా కూతురు ఈ ఇంటి కోడలు అవుతుందంటే అంతకన్నా కావాల్సింది ఏముంది. నాకు సంతోషమే

రాహుల్‌: ఆ సంతోషం నీ సొంతం కావాలంటే ముందు కావ్య కడుపులో ఉన్న బిడ్డ కన్నుమూయాలి మమ్మీ

రుద్రాణి: అది నేను చూసుకుంటాను నువ్వు ఆ రాజ్‌ గాడి సంగతి చూసుకో

అనగానే.. ఆల్‌ రెడీ ప్లాన్‌ అమలవుతుంది మమ్మీ  అంటాడు రాహుల్‌. రేఖ సంతోషంగా చూస్తుంది. మరోవైపు గార్డెన్‌ లో కూర్చుని కవితలు రాస్తూ.. కళ్యాణ్‌.. అవి వింటూ ఉంటాడు రాజ్‌. వాళ్ల దగ్గరకు వెళ్లి తమకు బోర్‌ కొడుతుందని కావ్య, అప్పు గొడవపడతారు.

రాజ్: అయితే వెయిట్‌ చేయండి మీకు బోర్‌ కొట్టకుండా ఎంటర్‌టైన్‌ చేస్తే సరిపోతుంది కదా

అప్పు: అదెలా చేస్తారు..?

రాజ్: సర్‌ఫ్రైజ్‌ బోరింగ్‌తో అలిసిపోయిన మీ జీవితాలు రేపటి నుంచి వేంగం పుంజుకుటాయి

కళ్యాణ్‌: ఎలా ఏంటనేది రేపు బుల్లి తెర మీద మీరే చూడండి పద అన్నయ్య

అని చెప్పి ఇద్దరూ వెళ్లిపోతారు. రాత్రికి వీరయ్య ఊరి నుంచి వచ్చి రుద్రాణికి పసరు మందు ఇస్తాడు.

వీరయ్య: ఇదేనమ్మా మీరు అడిగిన పసరు మందు

రుద్రాణి: ఇది పని చేస్తుందా

వీరయ్య: ఈ పసరు మందు ఒక్కసారి కడుపులోకి వెళ్లిందంటే పిండం కకావికలం అవ్వడం కాయం. కడుపునొప్పి మొదలవుతుంది. మీరు తాగించండి అమ్మ

రుద్రాణి: పూర్తిగా కడుపు కడిగినట్టు కావాలని చెప్పాను కదా..? అవుతుందా..?

వీరయ్య: రేపు ఇంకో పసరు మందు తెచ్చి ఇస్తాను. అది కూడా ఒక చెంచాడు ఏ పాలల్లోనో జ్యూస్‌లోనో కలిపి ఇచ్చారంటే మొత్తం కడిగేస్తుంది. ఇక జీవితంలో నిలబడదు

రుద్రాణి: రేపు తప్పకుండా ఆ పసరు కూడా తీసుకురా (అని చెప్పి డబ్బులు ఇవ్వగానే వీరయ్య వెళ్లిపోతాడు.) కావ్య నీ బ్యాడ్‌ టైమో.. నాగుడ్‌ టైమో అర్థం కావడం లేదు కరెక్ట్‌ టైంలో నా కూతురు దిగింది. నీకు ఈ కుటుంబానికి తెలియకుండానే ఈ ఆస్థి అంతా నా కూతురుకు దక్కబోతుంది. అందుకు  ఈ పసరు మందు సాయం చేయబోతుంది.

అనుకుంటూ రుద్రాణి ఇంట్లోకి వెళ్తుంది. తర్వాత అందరూ కింద టిఫిన్‌ చేస్తుంటే.. పైన రాజ్‌ రూంలోకి వెళ్లి రుద్రాణి, రేఖ వెల్లి కావ్య తాగే జ్యూస్‌ బాటిల్‌లో పసరు మందు కలిపి వెళ్లిపోతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!