Brahmamudi Serial Today January 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కుర్చీలోంచి కిందపడిపోయిన రుద్రాణి -  నెక్లెస్‌ విషయంలో మళ్లీ గొడవ చేసిన రుద్రాణి

Brahmamudi Today Episode: విరిగిపోయిన కుర్చీలో కూర్చుని కిందపడిపోయిన రుద్రాణి.. కోపంగా కనకాన్ని తిట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Continues below advertisement

Brahmamudi Serial Today Episode: కావ్యను బెడ్‌రూంలోకి పిలిచిన రాజ్‌.. తమ మొదటి రోజు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. దీంతో కావ్య ఏం చేస్తున్నారండి మీరు స్వప్న సీమంతానికి వచ్చి ఇలా చేస్తే బాగోదు అంటుంది.

Continues below advertisement

రాజ్‌: నాకు కొంచెం సెన్స్‌ ఉంది. నిన్ను పిలిచింది అందుకు కాదు.. (జ్యువెల్లరీ బాక్స్‌ కావ్య చేతిలో పెడుతూ) ఇందుకు

కావ్య:  దీని కోసమేనా అంత సీక్రెట్‌గా పిలిచావు.

రాజ్‌: నువ్వే ఏదేదో ఊహించుకుని నన్ను అంటే ఎలా

కావ్య: మగాళ్లు అలా పిలిస్తే ఏ పెడ్లాం అయినా ఇలాగే ఫీల్ అవుతుంది. అయినా ఈ నెక్లెస్‌ ఎందుకు తీసుకొచ్చావు..

రాజ్‌: ఆరోజు ఈ నెక్లెస్‌ విషయంలోనే నువ్వు  స్వప్నను తిట్టావు కదా..? అదే ఇప్పుడు నువ్వు గిఫ్టుగా ఇస్తే..చాలా సంతోషిస్తుంది..

కావ్య: అవును సంతోషిస్తుంది. ఈ లోకంలో నా సంతోషం తప్పా అందరి సంతోషం గురించి ఆలోచిస్తారు మీరు

రాజ్‌: ఇప్పుడు నీకేం చేశాను. నీతో బాగానే ఉంటున్నాను కదా..?

కావ్య: ఉంటున్నారు బాగానే.. అంటీ ముట్టనట్టు.. సరసం ఆడి ఆడనట్టు.. సముద్రంలో తీరం లాగా అలలు వచ్చి ఎప్పుడు తాకుతాయా అని ఎదురుచూస్తుంది నా మనసు..

రాజ్‌: నా పద్దతిలో ఇంత వెతుకుతున్నావా..?

కావ్య: ఇందులో వెతకడం దేనికి కనిపిస్తూనే ఉంది కదా..?  నాతో అవసరం లేన్నప్పుడు పతాలు, పట్టింపులు, గొడవలు.. ఇప్పుడు మీకు కష్టం వచ్చింది కాబట్టి నా అవసరం వచ్చింది.

అంటూ కావ్య అంతా గుర్తు చేయగానే.. అంతా మనసులో దాచుకున్నావన్నమాట అంటాడు రాజ్‌. మా ఆడాళ్ల మనసు సముద్రం లాంటిది అంటుంది కావ్య. మరోవైపు రుద్రాణి విరిగిపోయిన కుర్చీలో కూర్చోవడానిక వెళ్తుంటే.. శ్రీను వచ్చి ఆపుతాడు. శ్రీనును కొట్టి కుర్చీలో కూర్చున్న రుద్రాణి కిందపడిపోతుంది. దీంతో కనకం నన్ను విరిగి కుర్చీ వేసి చంపేయాలనుకున్నావా..? అంటూ తిడుతుంది. శ్రీను కుర్చీ విరిగిపోయిందని చెప్పొద్దు అంటూ కొడుతుంది. తర్వాత రాజ్‌ ఇచ్చిన నెక్లెస్‌ తీసుకుని స్వప్న దగ్గరకు వెళ్తుంది కావ్య.

కావ్య: అక్కా నీకొక సర్‌ప్రైజ్‌

స్వప్న:  ఏంటి కావ్య..

కావ్య: నువ్వే చూడు

నెక్లెస్‌ చూసిన స్వప్న ఆశ్చర్యపోతుంది.

స్వప్న: ఇది నువ్వు అమ్మేయలేదా..?

కావ్య: లేదక్కా.. ఇది నీ సీమంతానికి దుగ్గిరాల ఇంటి నుంచి ఇచ్చే కానుక

అంతా బయటి నుంచి చూస్తున్న రుద్రాణి, ధాన్యలక్ష్మీ లోపలికి వస్తారు.

రుద్రాణి: శబాష్‌ కావ్య మీరిద్దరూ ఎంత తోడుదొంగలో అర్థం అయింది. అక్కను మించి చెల్లి, చెల్లిని మించి అక్కా.. మహా నటన చూపిస్తున్నారు. అయినా కనకం కూతుళ్లు కదా

అపర్ణ: ఏమైంది ఇప్పుడు నువ్వు ఎందుకు అంత వెటకారంగా మాట్లాడుతున్నావు.

రుద్రాణి: ఏమైందా..? కళ్ల ముందు సాక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది కదా వదిన. నెక్లెస్‌ తీసుకోమని అక్కకు చెక్కు ఇచ్చి నెక్లెస్‌ కొనుక్కోమంది. అప్పుడు ఇష్యూ అయ్యే సరికి అక్కను తిట్టింది. ఇప్పుడు ఇలా చేసింది. దీన్నేమంటారు

ధాన్యలక్ష్మీ:  చావు తెలివితేటలు అంటారు. తోడబుట్టిన అక్కను ఒకలా చూసి మనింట్లో మాత్రం అందరినీ అడుక్కునేలా చేసింది.

 ఇంతలో సుభాష్‌, ప్రకాష్‌ వస్తారు.

సుభాష్‌: ఇప్పుడు దాని గురించి అంత అవసరమా..? మనం సీమంతానికి వచ్చాం.. సీమంతం జరిపించి వెళ్దాం

రుద్రాణి: ఎప్పటి లెక్క అప్పుడే తీరాలి అన్నయ్యా

అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఇద్దరూ కలిసి కావ్యను తిడుతుంటే రాజ్‌ వస్తాడు. ఆ నెక్లెస్‌ నేనే తీసుకొచ్చాను స్వప్నకు ఇవ్వమని నేనే చెప్పాను ఇందులో కావ్య ప్రమేయమే లేదు అంటాడు. దీంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ సైలెంట్‌ గా బయటకు వెళ్లిపోతారు. రాహుల్‌ వచ్చి హాస్పిటల్ బిల్లు ఆఫీసు చెక్‌ ద్వారా కాకుండా క్యాష్‌ ద్వారా పే చేశారట. ఆ డబ్బులు కూడా కావ్య నగలు కుదువపెట్టి తీసుకొచ్చారట అని చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Continues below advertisement