Brahmamudi Serial Today Episode: పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని న్యాయంగా ఉంటే ఈ కేసులోంచి బయటపడనని ఆలోచించి రాజ్‌ కళ్యాణ్‌కు కాల్‌ చేస్తాడు. తాను ఎలాగైనా స్టేషన్‌ నుంచి బయటకు రావాలని అనుకుంటాడు.

Continues below advertisement

రాజ్‌: ఇప్పటి దాకా ఎంత కష్టమైనా ఈ కేసులోంచి బయటకురావాలనుకున్నాను కానీ తప్పు చేయక తప్పడం లేదు కళ్యాణ్

కళ్యాణ్‌: ఏమంటున్నావు అన్నయ్యా

Continues below advertisement

రాజ్‌: ఓరేయ్‌ ప్రస్తుతం నాకు ఇంత కన్నా మార్గం తెలియడం లేదురా..? ఒక్కసారి నువ్వు స్టేషన్‌కు ఫోన్‌ చేసి నేను  చెప్పమన్నట్టు చేప్పు

కళ్యాణ్‌: అలా చేస్తే ప్రాబ్లమ్‌ అవుతుందేమో కదా

రాజు: ఏం కాదురా కావ్య ప్రాబ్లమ్‌ కన్నా నాకు ఎక్కువ ప్రాబ్లమ్‌ ఏమీ కాదురా

అంటూ కళ్యాణ్‌ ఎం చెప్పాలో అదంతా చెప్పి కాల్‌ కట్‌ చేస్తాడు. రాజ్‌ చెప్పినట్టే కళ్యాణ్‌ తన ఫ్రెండ్‌కు కాల్‌ చేసి స్టేషన్‌లో ఒక క్యారేజ్‌ ఇవ్వమని చెప్తాడు. అతను కళ్యాణ్‌ చెపినట్టే వెళ్లి క్యారేజ్‌ ఇస్తాడు. కళ్యాణ్‌ స్టేషన్‌ కు ఫోన్‌ చేసి ఇందాక మీ స్టేషన్‌కు వచ్చిన క్యారేజ్‌లో బాంబు ఉందని బెదిరిస్తాడు.. దీంఓ పోలీసులు అందరినీ తీసుకుని బయటకు పరుగెడతారు. అదే అదనుగా రాజ్‌ను కళ్యాణ్‌ అక్కడి నుంచి తప్పిస్తాడు. కొద్ది సేపటికి నిజం తెలుసుకున్న ఎస్సై అప్పుకు కాల్‌ చేస్తాడు.

ఎస్సై: అపూర్వ మీ బావ రాజ్‌ స్టేషన్‌ నుంచి తప్పించుకున్నాడు

అప్పు: సార్‌ ఏమంటున్నారు..?

ఎస్సై: డిపార్ట్‌మెంట్‌ కళ్లు కప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు సరాసరి హాస్పిటల్‌ కే వస్తాడు. మీ బావను నువ్వే అరెస్ట్‌ చేసి అప్పగించాలి

అప్పు: ఏంటి సార్‌ ఇది

ఎస్సై: పోలీసులు అంటే ఆటలుగా ఉంది మీ బావకు అందుకే వేషాలు వేస్తున్నాడు.

అప్పు: సార్‌ నేను ఆఫ్‌ డ్యూటీలో ఉన్నాను సార్‌

ఎస్సై: పోలీసులు అంటేనే డ్యూటీ బాధ్యత.. అన్‌ డ్యూటీ.. ఆఫ్‌ డ్యూటీ అంటూ ఏమీ ఉండదు.. అందుకే నీకు అప్పజెప్తున్నాను

అప్పు: సార్‌ మా బావ స్టేషన్‌ నుంచి తప్పించుకోవడం తప్పే సార్‌ కానీ అదేదో మీరే వచ్చి అరెస్ట్‌ చేయోచ్చు కదా..?

ఎస్సై: డిపార్ట్‌మెంట్‌ మొత్తం చూస్తుండగానే.. మా కళ్లు కప్పి తప్పించుకున్నాడు. అందుకే ముల్లును ముల్లుతోనే తీయాలని చెప్తున్నాను.. మీ బావను నువ్వే అరెస్ట్‌ చేసి తీసుకురా..?

అప్పు: అది కాదు సార్‌ నేను చెప్పేది ఒకసారి వినండి…

ఎస్సై: నో ఇట్స్‌ మై ఆర్డర్‌ వన్‌ అవర్‌లో  స్టేషన్‌ లో వాడు ఉండాలి.. మన టీంను పంపిస్తున్నాను..

అని చెప్పగానే.. అప్పు డైలమాలో పడిపోతుంది. ఇక లోపల కావ్య ఏడుస్తూ రాజ్‌ను పలవరిస్తుంది. డాక్టర్‌ వచ్చినా ఆపరేషన్‌కు ఒప్పుకోదు. దీంతో డాక్టర్‌ కోపంగా వెళ్లిపోతుంది. ఇంతలో హాస్పిటల్‌కు రాజ్‌ వస్తాడు. రాజ్‌ను చూసిన అందరూ హ్యాపీగా ఫీలవుతూ ఐసీయూలోకి వెళ్లు అని చెప్పగానే.. రాజ్‌ ఐసీయూలోకి వెళ్లబోతుంటే.. అప్పు వచ్చి అడ్డుకుంటుంది. రాజ్‌ చేసింది తప్పు అని చెప్పి అరెస్ట్‌ చేయబోతుంది.

అందరూ అప్పును తిట్టి అడ్డుపడి రాజ్‌ను ఐసీయూలోకి పంపిస్తారు. ఐసీయూలో ఉన్న కావ్య, రాజ్‌ను చూసి హ్యాపీగా ఫీలవుతుంది. ఇక రాజ్‌ మాట ప్రకారం తాను వచ్చానని నువ్వు కూడా ఆపరేషన్‌ చేయించుకో అని చెప్తాడు. కావ్య సరే అంటుంది. ఇంతలో డాక్టర్‌ లోపలికి వచ్చి రాజ్‌ను తిడుతుంది. మిమ్మల్ని స్టేషన్‌ నుంచి తప్పించుకుని రమ్మని ఎవరు చెప్పారు అంటూ నిలదీస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!