Brahmamudi Serial Today Episode: రాజ్‌ ప్లాన్‌ ప్రకారం మినిస్టర్‌ దాచిన డాక్టర్‌ చక్రవర్తి జాడ తెలుసుకుంటాడు. ప్రతి సారి ఫోన్‌ చేసి మినిస్టర్‌ ను పక్కదారి పట్టించిన రాజ్‌ ధర్మేంద్ర గెస్ట్‌హౌస్‌ నుంచి డాక్టర్‌ చక్రవర్తిని విడిపిస్తాడు. వెంటనే ధర్మేంద్రకు ఫోన్‌ చేస్తాడు.

Continues below advertisement

రాజ్: ఏంటి మినిస్టర్‌ గారు నేను రాలేదని ఆలోచిస్తున్నావా? డాక్టర్ దగ్గరికని మీ వైఫ్‌ని తీసుకుని వెళ్తుంటే దారిలో ఒక చిన్న డౌట్ వచ్చింది.. నువ్వు చేసిన తప్పుకి డాక్టర్‌ చక్రవర్తికి సంబంధం ఏం ఉందని అనిపించింది.. అందుకే డాక్టర్‌ని వదిలేసి నీకు సాయం చేసిన నర్స్ నీలవేణి దగ్గరికి వెళితే నాకు కావాల్సిన సాక్ష్యాలు దొరకుతాయి.. అందుకే నీలవేణి దగ్గరికి బయల్దేరాను

అంటూ రాజ్‌ చెబితే.. మినిస్టర్‌ షాక్‌ అవుతాడు. వెంటనే నీలవేని ఇంటికి బయలుదేరుతాడు. నీలవేణి దగ్గరకు వెళ్లి బెదిరిస్తాడు.

Continues below advertisement

ధర్మేంద్ర: నీకెంత ధైర్యం ఉంటే నాతో ఆటలు ఆడుతున్నావు.. ఆ రాజ్ గాడితో కలిసి నా భార్యకు నిజం చెప్పాలని అనుకుంటున్నావా..?

నీలవేణి:  ఏం మాట్లాడుతున్నారు సార్‌ నాకేం అర్థం కావడం లేదు

ధర్మేంద్ర:  నువ్వు ఆ రాజ్ కావ్యలతో చేతులు కలపలేదా..?

నీలవేణి: నేను నోరు తెరిస్తే మీ చేతుల్లో చస్తానని నాకు తెలిసి కూడా ఎలా చెప్తాను సార్‌

ధర్మేంద్ర:  మరి మనం బిడ్డల్ని మార్చిన విషయం.. నీ పేరు ఆ రాజ్‌గాడికి ఎలా తెలిశాయి

నీలవేణి: ఒకరోజు కావ్య హాస్పిటల్‌ కు వచ్చి నిజం చెప్పమని నన్న బెదిరించింది అప్పుడు జరిగిన విషయం కావ్యకు చెప్పాను.. నన్ను వదిలేయమని ప్రాధేయపడ్డాను అప్పుడు నన్న వదిలేసింది. అయినా వాళ్ల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు అలాంటప్పుడు వాళ్లు ఎలా మీ భార్యని నమ్మిస్తారు. నేను కూడా నా ప్రాణం పోయినా మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను.. సాక్ష్యమే చెప్పాల్సి వస్తే నా పిల్లలని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్లిపోతాను

అంటూ నీలవేణి చెప్తుండగానే.. మళ్లీ రాజ్‌ ఫోన్‌ చేస్తాడు. మినిస్టర్‌ గారు మీరు ఎక్కడ తప్పు చేశారో అక్కడికే వెళ్తున్నాం వచ్చి మీ భార్యకు నిజం తెలియకుండా ఆపుకో అంటాడు. దీంతో ధర్మేంద్ర మళ్లీ హాస్పిటల్ కు వెళ్తాడు. ధర్మేంద్ర వెళ్లే సరికి తులసితో డాక్టర్‌ చక్రవర్తి మాట్లూడుతూ ఉంటాడు. అది చూసి ధర్మేంద్ర షాక్‌ అవుతాడు.

ధర్మేంద్ర:  తులసి వీళ్లు చెప్పేదంతా అబద్ధం.. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పద

డాక్టర్‌ చక్రవర్తి: ఏంటి సార్‌ అంత కంగారు పడుతున్నారు.. కారు నెట్టుకుంటూ వచ్చారా? బీపీ పెరిగిపోతోందా?

ధర్మేంద్ర: తులసి వెళ్దాం పద

తులసి: చక్రవర్తి గారు నాకు డెలివరీ అయ్యాక ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు ఎందుకు

ధర్మేంద్ర:  ఓ సీరియస్ కేసు వస్తే వేరే హాస్పిటల్‌కి నేనే పంపించాను

అప్పుడే తులసిని లోపలి నుంచి డాక్టర్‌ పిలుస్తున్నారు అని నర్స్‌ చెప్పగానే తులసి లోపలికి వెళ్తుంది.

కావ్య: ఊపిరి పోసే తల్లి విలువ తెలియదు, ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ విలువ తెలియదు నీకు.. నా బిడ్డను నాకు దూరం చేసినప్పుడు నా మనసు ఎంత తల్లడిల్లిందో ఆలోచించారా..? తప్పు నువ్వు చేసి నా ఫ్యామిలీ జోలికి వచ్చావు.. అప్పుడు కూడా నాకు ఇదే భయం కలిగింది, నువ్వు చేసిన దుర్మార్గాన్ని నీ చేతే బయటపెట్టించడానికి మాకు క్షణం కూడా పట్టలేదు. నీకిచ్చిన గడువులోగా నా బిడ్డను నా చేతుల్లో పెట్టాలి..

రాజ్‌: నీ ఇంటి సంతోషం కోసం తప్పు చేశావు.. నీ భార్యకు సర్దిచెప్పుకుని మా బిడ్డను మాకు అప్పగించాలి

అంటూ రాజ్‌ కూడా వార్నింగ్‌ ఇస్తుంటాడు. అప్పుడే డాక్టర్‌ అనురాధ వచ్చి పాప బాడీ ఆపరేషన్‌కు సహకరిస్తుందని చెప్తుంది. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత అప్పుకు డెలివరీ టైం వచ్చిందని త్వరలోనే బాబు పుట్టబోతున్నాడని అందరికీ స్వీట్లు పంచుతుంటే.. అంతా మంచి జరిగితే తిరుపతి వెళ్దామని అపర్ణ చెప్తుంది. వెళ్లడమే కాదు రాజ్‌, కళ్యాణ్‌కు గుండు కొట్టిస్తాను అంటుంది ధాన్యలక్ష్మీ అందరూ నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!