Brahmamudi Serial Today Episode: అపర్ణ, సుభాష్‌ ఇంట్లో కూర్చుని ఎవ్వరూ లేకుండా అయిపోయింది ఇల్లు అంటూ బాధపడుతుంటే అప్పుడే రేఖ పెళ్లి చేసుకుని వచ్చి డోర్‌ దగ్గర నిలబడి నేనున్నాను కదా అత్తయ్యా అంటూ చెప్తుంది. రేఖను చూడగానే.. అపర్ణ, సుభాష్‌ షాక్‌ అవుతారు. రేఖ ఇంట్లోంకి అడుగుపెడుతుంటే.. అపర్ణ కోపంగా చూస్తుంది.

Continues below advertisement

అపర్ణ: ఆగు.. మళ్లీ ఎందుకు వచ్చావు నువ్వు.. నీ ముఖం కూడా నాకు చూపించకు అని చెప్పాను కదా..? అడుగు లోపల పడిందంటే నిన్ను చంపేస్తాను (రేఖ లోపలికి వస్తుంది.)  ఏంత ధైర్యం ఉంటే నువ్వు నా మాట వినకుండా లోపలికి వస్తావు

రేఖ: ఆవేశపడకండి ఆంటీ నువ్వు విషయం బాగా అర్థం చేసుకోవాలి. పవర్‌లో లేని పొలిటీషియన్‌కు ఫామ్‌లో లేని క్రికెటర్‌కు అన్ని కోల్పోయిన నీలాంటి ఇంటి పెద్ద చెప్పిన మాటకు ఎటువంటి విలువ ఉండదు. ఇప్పుడు నీలాంటి వాళ్ల మాటలకు ఎవ్వరూ భయపడరు.. అలాంటప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు ఒక్కదానివే ఎలా పాలించగలవు.. పెళ్లి చేసుకుని మంది మార్భాలంతో వచ్చాను

Continues below advertisement

అపర్ణ: ఎందుకు అడుక్కుతినడానికా…?

రేఖ: వదిన పవర్‌ పోయినా పొగరు మాత్రం తగ్గలేదు ఆంటీకి

రేఖ వాళ్ల వదిన:  అదెంత పని రేఖ నువ్వు అనుకుంటే చిటికెలో తగ్గించొచ్చు

రేఖ: చూడండి ఆంటీ ఈ దుగ్గిరాల ప్రాపర్టీని చూసుకోవడం మీ వల్ల కాదు.. వాటన్నింటిని  నాచేతుల్లో పెట్టండి కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను..

అపర్ణ: ఏంటి బెదిరిస్తున్నావా..? నువ్వు తలుచుకుంటే ఈ ఇంటి ముందు మొలిచిన గడ్డి పోచను కూడా పీకలేవు.. కానీ నేను అనుకుంటే నిన్ను జీవితాంతం జైలులో కూర్చోబెట్టి చిప్పకూడు తినేలా చేయగలను..

రేఖ:  చాలా కోరికలు ఉన్నాయి ఆంటీ నేను ఎవరో ఏంటో మర్చిపోతున్నావా..? ఒక్కసారి నీ కొడుకును చంపిన మా అమ్మను గుర్తు చేసుకో..

సుభాష్‌: రేఖ…

రేఖ: ఏంటి అంకుల్‌ మీతో కూడా మాట్లాడతాను ఉండండి.. ఆంటీతో మాట్లాడుతున్నాను కదా..? ఒక్క నిమిషం వస్తాను మీదాకా..? గుర్తొచ్చిందా ఆంటీ నీ కొడుకు తలను పగలగొట్టి తన ప్రాణాలను పంచభూతాల్లో కలిపేసిన నా తల్లి గుర్తొచ్చిందా..? మా అమ్మే అంత చేసినప్పుడు తన రక్తాన్ని పంచుకుని పుట్టినదాన్ని నేనెంత చేయగలను. ఆ మాత్రం ఊహించలేవా..? కళ్ల ముందు కుటుంబం కాలిపోతున్నా.. చూస్తూ బతకగలిగావు.. కొడుకు, కోడలు ప్రాణాలు వదిలేస్తున్నా.. భరించగలిగావు.. మరి అదే కళ్ల ముందు నీ వారసురాళ్లను చంపేస్తుంటే.. ఇలాగే చూస్తూ నిలబడగలవా..?

అంటుండగానే.. రేఖ భర్త చిన్న పిల్లలను చంపబోతాడు.

అపర్ణ: రేఖ ఏం చేస్తున్నావు..?

రేఖ: మనవరాళ్ల మెడ మీద కత్తి పెట్టగానే.. మీ గుండెల్లో కత్తి దించినట్టుగా ఉందా..? కానీ నాకు అది సరిపోదు ఆంటీ.. ఇంకా ఇంకా కావాలి..

అనగానే వాళ్ల వదిన కర్రతో సుభాష్‌ను కొడుతుంది. సుభాష్‌ కింద పడిపోతాడు. అపర్ణ: ఏయ్‌ నువ్వు అసలు మనిషివేనా…?

రేఖ: కాదు రాక్షసిని రెండు చిటికెలు వేయగానే.. నీ గుండెలు జారి చేతుల్లోకి వచ్చినట్టు ఉంది. మరి నా తల్లిని చంపిన మిమ్మల్ని ఎలా వదిలేస్తాను.. ఏడ్చింది చాలు కానీ నీతో చాలా పనుంది. నేను ఏం చేయగలనో.. ఇప్పటికే నీకు బాగా అర్థ అయింది అనుకుంటా నా మాటకు ఎదురు చెప్పకుండా వచ్చి ఈ పేపర్స్‌ మీద సంతకం చేయ్‌

అపర్ణ: ఏంటా పేపర్స్‌..?

రేఖ: ఆస్థి పేపర్లు నువ్వు సంతకం చేయగానే.. ఆస్థి మొత్తం నా పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

అపర్ణ: నేను సంతకం చేస్తే ఆస్థి కాదు కదా..? ఈ ఇంట్లో ఆవగింజ కూడా రాదు.. అర్థం కాలేదా..? ఆస్థి మొత్తం కావ్య పేరు మీద ఉంది. కావ్య చనిపోయింది కాబట్టి ఇందు చిన్న పాప కాబట్టి తనకు పాతికేళ్లు వచ్చే వరకు తనకు కూడా ఎటువంటి అధికారం ఉండదు.. అప్పటి వరకు నేను ఒక గార్డియన్‌గా ఉంటాను. కాదు కూడదు అని నువ్వేమైనా వేషాలు వేస్తే.. ఆస్థి మొత్తం దుగ్గిరాల ట్రస్ట్‌కు వెళ్లిపోతుంది. ఏంటి అర్తం కాలేదా..? చుట్టూ మీ అమ్మ గుంతనక్కలా తిరుగుతుందని తెలిసి నా కొడుకు కోడలు ముందే ఊహించి  అంత పకడ్దందీగా డాక్యుమెంట్స్‌ రెడీ చేశారు. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు..

అనగానే.. రేఖ కోపంగా అపర్ణను కొట్టి ఆస్థికి గార్డియన్‌గా తన పేరు రాయించుకుంటుంది. మరోవైపు స్వరాజ్‌కు గతం గుర్తుకు వచ్చేలా డాక్టర్‌ ప్రయత్నిస్తుంటాడు. తర్వాత అపర్ణ, సుభాష్‌ ఇద్దరూ బాధపడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!