Brahmamudi Serial Today February 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణను కాల్చబోయిన రాహుల్ – అడ్డుకున్న రాజ్
Brahmamudi serial today episode February 25th: బాంబ్ బ్లాస్ట్‌లో అందరూ చనిపోయినా అపర్ణ, రాజ్ బతికే ఉంటారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ.. శ్రీశైలం వెళ్తుంటారు. వెనకే కారులో రాహుల్, రేఖ, స్వప్న వెళ్తుంటారు. సడెన్‌గా వ్యాన్ ఆగిపోతుంది. రాహుల్, రేఖ టెన్షన్ పడుతుంటారు. ఇంతలో వ్యాన్‌లోంచి కావ్య, అప్పు వెనక కారు దగ్గరకు వస్తారు.
రాహుల్: అప్పు ఏమైనా ప్రాబ్లమా..?
అప్పు: అవును ప్రాబ్లమే
రాహుల్: ఏంటది ప్రాబ్లమ్
అప్పు: మేము అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము మీరు మాత్రం సపరేట్‌గా వస్తున్నారు అది మాకు అసలు నచ్చడం లేదు
రాహుల్: ఓ అదా
అప్పు: మరి నువ్వేం అనుకున్నావు..?
రేఖ: అదే వ్యాన్ ఆగే సరికి ఏదైనా ప్రాబ్లమ్ అయిందేమో అనుకున్నాం అంతే మా గురించి మీరేం ఆలోచించకండి మీరు వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేయండి
అప్పు: నీ గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు.. మేము వచ్చింది మా అక్క గురించి
స్వప్న: పాప ఉంది కదే
కావ్య: అదేం కాదు పాపను రాహుల్ చూసుకుంటాడులే నువ్వు కూడా మాతో రావాల్సిందే..
రాహుల్: అది కాదు పాప ఏడుస్తుంది కదా..?
కావ్య: నువ్వు కూడా పాపకు తండ్రివే కదా ఆ మాత్రం చూసుకోలేవా..?
అంటూ స్వప్నను తీసుకుని పాపను రాహుల్‌కు ఇచ్చి వ్యాన్‌లోకి వెళ్తారు.
రాహుల్: ( మనసులో) చ వీళ్ల చావు వీళ్లు చావకుండా నా పెళ్లాన్ని కూడా తీసుకెళ్లాలా..?
అనుకుంటూ రుద్రాణికి ఫోన్ చేస్తాడు.
రుద్రాణి: చెప్పు రాహుల్
రాహుల్: మమ్మీ మన ప్లాన్ ఆపడం మంచిది
రుద్రాణి: ఏం వాగుతున్నావురా నువ్వు
రాహుల్: అవును మమ్మీ పెద్ద తప్పు జరగబోతుంది
రుద్రాణి: ఏం జరగబోతుంది
రాహుల్: ఆ కావ్య, అప్పు కలిసి వాళ్లు ఎంజాయ్ చేయడం కోసం స్వప్నను వ్యాన్ ఎక్కించారు మమ్మీ. ఇప్పుడున్న సిచ్యుయేషన్‌లో స్వప్నను తిరిగి తీసుకురాలేను కాబట్టి ఈ ప్లాన్‌ను ఆపడం మంచిది అనిపిస్తుంది మమ్మీ
రుద్రాణి: రేయ్ అనుకున్నది అనుకున్నట్టుగానే.. జరుగుతుంది రాహుల్..
రాహుల్: మమ్మీ..
రుద్రాణి: మమ్మీ అంటావేంట్రా..? ఆ స్వప్నను నువ్వేమైనా నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా ఏంటి…? మొన్నటి వరకు దాన్ని ఎలా వదిలించుకోవాలనే కదా ఆలోచించావు.. మరి ఇప్పుడేంట్రా..? ప్రేమ పొంగిపోతుంది.
రాహుల్: నువ్వు చెప్పింది నిజమే మమ్మీ కానీ
రుద్రాణి: చూడు రాహుల్ ఇది కాలం మనకు ఇచ్చిన చివరి అవకాశం ఇప్పుడు నువ్వు చేసే ఈ ఒక్క త్యాగంతో నీ తలరాతే మారిపోతుందిరా..? కోట్ల ఆస్థి ఒకవైపు భార్య ఒకవైపు.. ఏది కావాలో నువ్వే తేల్చుకో
రాహుల్: నాకు డబ్బే ముఖ్యం మమ్మీ ఇంతదూరం వచ్చాక ఇంక ఆలోచించేది ఏమీ లేదు మన ప్లాన్ ప్రకారం మనం వెల్తున్నాం అంతే..
రుద్రాణి: అదీ నా కొడుకంటే.. ఇక నేను నడిపిస్తాను.. దూరంగా ఫాలో అవుతూ జరిగేది చూస్తూ ఉండు
అని చెప్పగానే రాహుల్ సరే అంటాడు. ఇక అప్పటికే రాత్రి అవుతుంది. అందరూ నిద్రపోతారు. ఇంతలో వ్యాన్‌లో ఉన్న బాంబు పేలి అందరూ గాయాలతో చెల్లాచెదురుగా పడిపోతారు. అది చూసిన రాహుల్, రుద్రాణి, రేఖ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో అపర్ణ లేచి అందరినీ చూసి ఏడుస్తుంది. అపర్ణ బతికే ఉందని రాహుల్ వెళ్లి గన్‌తో చంపబోతే రాజ్ లేచి వచ్చి అడ్డు పడతాడు. ఇద్దరి మద్య గొడవ జరగుతుంది. ఆ గొడవలో రాహుల్ కు బుల్లెట్ తగిలి చనిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























