Brahmamudi Serial Today Episode: రుద్రాణి చెప్పినట్టు ఇంట్లోంచి వెళ్లిపోతామని రాహుల్‌, రేఖ నాటకం ఆడతారు. అందుకోసం బ్యాగ్‌లు సర్దుకుని కిందకు వెళ్తారు. హాల్లో అందరూ కూర్చుని ఉండగా రాహుల్‌ ఇంట్లోంచి వెళ్లిపోతున్నామని చెప్తాడు. అందరూ షాక్‌ అవుతారు.

Continues below advertisement

రాజ్‌: దేనికి రాహుల్‌ ఇప్పుడు ఏమైందని..?

రాహుల్‌:  జరిగింది చాలు రాజ్‌ ఇక మా అమ్మ ఆగడాలు భరించే ఓపిక మాకు లేదు. ఇంత జరిగాక ఈ ఇంట్లో ఉండే అర్హత మాకు లేదు.. స్వప్న ఇన్నాళ్లు నువ్వు నా వల్ల  ఇబ్బంది పడ్డావు ఇప్పుడు మా అమ్మ చేసిన పనికి నాతో పాటు వీళ్లందరి ముందు నువ్వు కూడా తలదించుకోవాల్సి వచ్చింది. నేను మారాను స్వప్న కానీ మా అమ్మ మారలేదు. చివరకు నీ చెల్లినే చంపాలనుకుంది. వీళ్లందరిని క్షమించమని అడిగే అర్హత నాకు ఎలాగూ లేదు. కనీసం నువ్వైనా క్షమించి నాతో పాటు వస్తే.. ఈ దేవాలయానికి ఇంతటి మంచి మనుషులకు దూరంగా బతుకుదాం నీకు ఇష్టం అయితే నాతో రా స్వప్న

Continues below advertisement

రాజ్‌: ఎక్కడికిరా వచ్చేది. ఇప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్లడం వల్ల జరిగిన నష్టం తీరుతుందా..?

రేఖ: కానీ ఇక్కడే ఉంటే మా అమ్మ చేసిన పాపం గుర్తొచ్చినప్పుడల్లా మనసు కకావికలం అవుతుంది బావ

ఇందిరాదేవి: తప్పు చేసింది మీ అమ్మ దానికి మీరేం చేస్తారు. దాన్ని మేము శక్షించలేకపోవచ్చు కానీ దానికి దేవుడే ఏదో ఒకరోజు సరైన శిక్ష వేస్తాడు.

రాహుల్‌: దేవుడు అనేవాడే లేడు అమ్మమ్మ నిజంగా దేవుడే ఉండి ఉంటే అలాంటి తల్లి కడుపున మమ్మల్ని పుట్టించేవాడే కాదు. మా అమ్మ చేసిన పాపానికి మమ్మల్ని బలి చేసేవాడే కాదు

రేఖ: అందుకే తప్పు ఎవరు  చేసినా శిక్ష మేము అనుభవించాలి అనుకుంటున్నాము అమ్మమ్మ అందుకే మేము వెళ్లిపోతాము అమ్మమ్మ

అపర్ణ: మీరు ఎక్కడికి వెళ్లక్కర్లేదు.. మీ అమ్మ గురించి అసలు ఆలోచించక్కర్లేదు

కావ్య: అవును రాహుల్‌ నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాది ఒక్కటే కోరిక కష్టం వచ్చినా నష్టం వచ్చినా.. మా ముగ్గురు అక్కా చెల్లెళ్లం కలిసే ఉండాలని ఇప్పుడు మా అక్కను తీసుకుని వెళ్లి మా తోబుట్టువులను విడదీస్తావా..?

రాహుల్‌:  అది కాదు కావ్య

రాజ్: ఏది కాదురా..? స్వప్న, పాప, రేఖ వీళ్లందరితో వెళ్లిపోయి అయిన వాళ్లకు దూరంగా ఉండి ఎలా బతుకుదామని ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకండి లోపలికి వెళ్లండి..

ఇందిరాదేవి: కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. కలలో కూడా ఇంట్లో మీ అమ్మ పేరు ఎత్తకూడదు.. అర్థం అవుతుందా..?

ధాన్యలక్ష్మీ: మీ అమ్మ ఎక్కడ ఎలా ఎదురుపడ్డా మీరు కన్నెత్తి చూడకూడదు.. మాట్లాడకూడదు..

రేఖ:  ఇంకా ఆ దుర్మార్గురాలిని చూడటం మాట్లాడటం కూడానా..?

సుభాష్: జరిగిందేదో జరిగింది. ఇక బారసాలకు ఏర్పాట్లు చేద్దాం అమ్మ

ఇందిరాదేవి:  బారసాల కన్నా ముందు ఇంట్లో హోమం జరిపించాలి ఏమంటావు రాజ్‌

రాజ్‌: సరే నాన్నమ్మ ఈలోపు ట్రస్ట్‌ పనులు చేస్తాము ఒరేయ్‌ రాహుల్ రేఖ లోపలికి వెళ్లండి

అంటూ రాజ్‌ బయటకు వెళ్లిపోతాడుద. తర్వాత రాజ్‌, బారసాల అయిపోయాక అందరం కలిసి శ్రీశైలం వెళ్దామని చెప్తాడు. ఇంత మందిమి ఎలా వెళ్లగలం అని కావ్య అడగ్గానే.. వ్యాన్‌ తీసుకుని వెళ్దాం అని చెప్తాడు రాజ్. అయితే ఓకే అంటుంది కావ్య. తర్వాత రుద్రాణి, రాహుల్‌, రేఖ కలిసి మాట్లాడుకుంటారు. కుటుంబం మొత్తం శ్రీశైలం వెళ్లే దారిలో చంపేయాలని డిసైడ్‌ అవుతారు. ఇంట్లో బారసాల జరుగుతుంది. తర్వాత ట్రస్ట్‌ కూడా ఓపెన్‌ చేస్తారు. ఆ ట్రస్ట్‌ ను ముగ్గరు నడిపిస్తారని వారిలో మినిస్టర్‌ ధర్మేద్ర, సత్యమూర్తి, కళావతి అని రాజ్‌ చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో శ్రీశైలం వెళ్లే వ్యాన్‌ వచ్చిందని డ్రైవర్‌ ఫోన్‌ చేయగానే.. ఆ వ్యాన్ చూడమని రాజ్‌, రాహుల్‌కు చెప్తాడు. రాహుల్‌, రేఖ వ్యాన్‌ దగ్గరకు వెళ్తారు.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!