Brahmamudi Serial Today February 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: నిజం తెలుసుకున్న కావ్య – రుద్రాణి కొత్త ప్లాన్
Brahmamudi serial today episode February 21st: దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ప్యామిలీ మొత్తం మినిస్టర్ ఇంటికి బారసాలకు వెళ్తుంది. వాళ్లను చూసిన తులసి చాలా సంతోషిస్తుంది. కావ్యకు థాంక్స్ చెప్తుంది. కావ్య చేతుల మీదుగానే పాపను ఊయలలో వేయిస్తుంది.
తులసి: మీరంతా ఫంక్షన్‌కు వచ్చినందుకు చాలా థాంక్స్ కావ్య
కావ్య: ఏంటి మేడం మీరు.. మన మధ్య ఇవన్నీ అవసరమా..? మీ కడుపున పుట్టిన పాపైనా కొన్ని రోజులు నా వడిలో ఆడుకుంది. నా కన్నబిడ్డైనా మీ చేతుల్లో ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. నేను మీ పాపను ఉయ్యాలలో వేశాను అనుకోలేదు మేడం. నా బిడ్డకే బారసాల చేశానని అనుకున్నాను
ధర్మేంద్ర: ఏదైతేనేమీ ఫంక్షన్ బాగా జరిగింది. అందరం కలిసి భోజనం చేద్దాం రండి
అందరూ భోజననానికి వెళ్తుంటే.. రుద్రాణి ఎదురుగా వస్తుంది.
ఇందిరాదేవి: ఏయ్ నువ్వేంటి ఇక్కడ..?
అపర్ణ: నువ్వెందుకు వచ్చావు
ధాన్యలక్ష్మీ: మళ్లీ ఎవరి కొంపలు కూల్చాలని వచ్చావు
సుభాష్: మినిస్టర్ గారు ఈవిడేంటండి మీ ఇంటికి వచ్చింది. ఆవిడకు మీకు ఏంటండి పరిచయం
ధర్మేంద్ర: అంటే తను తెలిసిన ఆవిడ కానీ తను మీ ఇంటి ఆడబిడ్డ అని నాకు కొంచెం లేటుగా తెలిసింది
ఇందిరాదేవి: అది మా ఇంటి ఆడపడుచు కాదయ్య. మృగం.. జీవితాంతం మమ్మల్ని పీక్కుతింటుంది.
ప్రకాష్: అందుకే మేమందరం కలిసి ఇంట్లోంచి తరిమేశాం తీరా చూస్తే ఇక్కడ ప్రత్యక్ష్యం అయింది
ధాన్యలక్ష్మీ: ఏంటి ఇంకా చూస్తున్నావు వచ్చిన దారినే వెళ్లు
రుద్రాణి: వెళ్తాను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను.. నేను వచ్చింది మినిస్టర్ గారు ఫంక్షన్‌కు పిలిచారని కాదు మీరంతా వస్తున్నారని తెలిసి మీ అందరినీ క్షమాపణ అడగాలని నేను చేసిన తప్పులకు ప్రాయశ్చితం చేసుకోవాలని వచ్చాను
ఇందిరాదేవి: ఏంటే నువ్వా ప్రాయశ్చితం చేసుకునేది నీ పిండాకూడు.. నీ ముఖం చూస్తేనే దరిద్రం పోవే ఇక్కడి నుంచి
రుద్రాణి: అమ్మా మీ ఆవేశంలో అర్థం ఉంది అమ్మ. మీరు నన్ను ఆసహ్యించుకోవడంలో న్యాయం ఉంది. నిజానికి నేను చేయకూడని తప్పులే చేశాను. అందుకు అనుభవిస్తున్నాను కూడా. దేవాలయం లాంటి ఆ ఇంటికి బంగారం లాంటి మనుషులను వదిలి నేను బయటికి వెళ్లిన తర్వాతే అర్థం అయింది అమ్మ. నేను ఏం కోల్పోయానో.. ఎంత తప్పు చేశానో.. నా కళ్లు తెరుచుకున్నాను.. కుటుంబం విలువ తెలుసుకున్నాను.. నేను చేసిన పాపాలకు నా కడుపున పుట్టిన కొడుకు, కూతురు కూడా నాతో మాట్లాడటం లేదు.. నన్ను చూస్తేనే ఆసహ్యించుకుంటున్నారు. ఇలాంటి బతుకు నేనెందుకు బతకాలి అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని ఒక్కసారి చూసి పోదామని వచ్చాను అమ్మా.. మళ్లీ మీ ప్రేమను పొందే అవకాశం మీరెలాగూ నాకు ఇవ్వరు.. కాబట్టి నేను చచ్చే ముందు అయినా నన్ను క్షమించాము అనే ఒకే మాట మీ నోట నుంచి విని శాశ్వతంగా వెళ్లిపోతాను
అంటూ చెప్తుండగానే.. అప్పు, కళ్యాణ్ దెబ్బలతో వస్తారు. అప్పు కోపంగా రుద్రాణిని తిడుతూ.. జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దీంతో అందరూ రుద్రాణిని తిడతారు. కావ్య చెప్పు తీసుకుని రుద్రాణిని కొడతుంది. రాహుల్ కోపంగా రుద్రాణిని అక్కడి నుంచి గెంటి వేస్తాడు. రుద్రాణి కోపంగా వెళ్లిపోతుంది. తర్వాత రాహుల్, రేఖ, రుద్రాణి కలుసుకుని దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి చంపేయాలని ప్లాన్ చేస్తారు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ రుద్రాణి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు. అప్పుడే రాహుల్, రేఖ తాము ఇంట్లో ఉండమని బ్యాగులు సర్దుకుని వెళ్లిపోతుంటారు. అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























