అన్వేషించండి

Brahmamudi Serial Today February 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: మినిస్టర్‌ ఇంటికి వెళ్లిన దుగ్గిరాల ఫ్యామిలీ – అప్పు, కళ్యాణ్‌ లకు యాక్సిడెంట్‌ చేయించిన రుద్రాణి  

Brahmamudi serial today episode February 20th: బారసాల ఫంక్షన్‌కు వెళ్లకుండా పోలీస్‌ గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు అప్పు, కళ్యాణ్‌. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రౌడీలను చాలా రోజుల నుంచి మన కస్టడీలోనే ఉంచుకున్నామని.. ఇంకా ఇలాగే ఉంచుకుంటే సీఐ గారికి తెలుస్తుందని ఎస్సై ఫోన్ చేసి అప్పుకు చెప్తాడు. అయితే వాళ్లు ఎవరి పేరైనా చెప్పారా అని అప్పు అడగ్గానే.. పేరు చెప్పలేదు కానీ ఎవరో లేడీ డబ్బులు ఇచ్చారని చెప్పారు అనగానే.. అప్పు అయితే ఇప్పుడే వస్తున్నాను ఉండండి అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది.

అప్పు: కూచీ….

కళ్యాణ్: అంత సాగదీయకు.. ఆరోజు సగంలో ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తి చేయాలి అంటావు అంతేకదా..

అప్పు:  అవును కూచి..

కళ్యాణ్‌: సరే వెళ్దాం కానీ ముందు మినిస్టర్‌ ఇంటికి వెళ్లి అక్కడ ఫంక్షన్‌ అయిపోయాక తిరిగి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్దాం

అప్పు: అంత సేపు అంటే టైం అయిపోతుంది కూచి నేను ఇలా ఇంత మందిని పోలీస్ గెస్ట్‌హౌస్‌లో పెట్టి ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నానని మా సీఐ గారికి తెలిస్తే ప్రాబ్లమ్‌ అయిపోతుంది

కళ్యాణ్‌: నీ ప్రాబ్లమ్‌ నాకు అర్థం అవుతుంది. కానీ అందరితో కలిసి వస్తామని ఇంట్లో వాళ్లకు చెప్పాము కదా..? ఇప్పుడు వెళ్లకపోతే అమ్మకు డౌటు రాదా..?

అప్పు: ఏం నాకోసం ఆ మాత్రం మానేజ్‌ చేయలేవా..?

కళ్యాణ్‌: ముందైతే ఏదోలా మానేజ్‌ చేసేవాడిని కానీ మొన్న కిడ్నాప్‌ జరిగినప్పటి నుంచి మనల్ని బయటకు పంపించాలంటే అమ్మ భయపడుతుంది.

అప్పు: ఫ్లీజ్ కూచి

కళ్యాణ్‌: ఇంత ముద్దుగా అడిగితే కాదంటానా..? సరే పద

అని చెప్పి అప్పును తీసుకుని కిందకు వెళ్దాం అమ్మను ఎలాగైనా కన్వీన్స్‌ చేద్దాం అంటాడు. అప్పటికే కింద హల్లో ఇంద్రాదేవి, అపర్ణ, ధాన్యలక్ష్మీ, సుభాష్, సీతారామయ్య, ప్రకాష్‌ రెడీ అయి ఉంటారు.

సుభాష్: ఏంటి అపర్ణ మినిస్టర్‌ గారి ఇంటికి వెళ్దామని చెప్పారు వీళ్లు ఇంకా రాలేదేంటి

ఇందిరాదేవి: వస్తారు లేరా నీకు ప్రతి దానికి తొందరే.. నా మనవడికి ఏకాంతం దొరక్కా ఎన్నాళ్లయిందో వాళ్లను కూడా అర్థం చేసుకోవాలి కదా…?

ధాన్యలక్ష్మీ: అత్తయ్యా కాస్త సందు దొరికితే చాలు ఏకాంతం అయస్కాంతం అంటూ అక్కడికే వెళ్తారు కదా..?

ఇందిరాదేవి: అది కాదే పాపను ఈ టైంలో నన్ను ఎత్తుకోమ్మన్నారు అంటే కాస్త డౌటు వచ్చింది

అప్పుడే అక్కడికి రాజ్‌, కావ్య వస్తారు.

రాజ్‌: హలో హలో నాన్నమ్మ నిన్నేం ఎత్తుకోమనలేదు నీకే నీ మునిమనవరాలు ముద్దొచ్చి నవ్వే లాక్కున్నావు నింద మా మీద వేస్తున్నావు

ఇందిరాదేవి: అవున్రా ముద్దు వస్తుంది. నా ముని మనవరాలు నాకే కదా ముద్దొస్తుంది. పక్కింటొళ్లకు వస్తుందా..? చూడు నా బంగారు తల్లి నన్ను చూసి ఎలా నవ్వుతుందో..

ధాన్యలక్ష్మీ: అత్తయ్యా ముని మనవరాలు అంటే ఇదొక్కతే కాదు పైన ఇంకొకతి ఉంది. ఇప్పుడు దిగుతుంది గుర్తు పెట్టుకోండి

ఇందిరాదేవి: ధాన్యం అవకాశం దొరికితే వదలవా నువ్వు నాకు అదేంతో ఇది అంతే..

అప్పు, కళ్యాణ్‌ కిందకు వస్తారు.

ధాన్యలక్ష్మీ: అదిగో వస్తుంది నా మనవరాలు

రాజ్‌: ఏరా కళ్యాణ్‌ మీరు వస్తున్నారుగా ఫంక్షన్‌ కు

కళ్యాణ్‌: రావడం లేదు అన్నయ్య.. అప్పు గుడికి వెళ్దాం అంటుంది. నేను సరే అన్నాను..

ధాన్యలక్ష్మీ: సరే వెళ్లి త్వరగా రండి

అని పర్మిషన్‌ ఇవ్వగానే అప్పు, కళ్యాణ్‌ వెళ్లిపోతారు. రాజ్‌ వాళ్లు మినిస్టర్‌ ఇంటికి వెళ్లిపోతారు. అంతా పై నుంచి గమనించిన రేఖ, రుద్రాణికి ఫోన్‌ చేసి చెప్తుంది. రుద్రాణి రౌడీలకు ఫోన్‌ చేసి అప్పు, కళ్యాణ్‌ లను చంపేయమని చెప్తుంది. స్టేషన్‌కు వెళ్లి రుద్రాణి గురించి నిజం తెలుసుకున్న అప్పు, కళ్యాణ్‌ మినిస్టర్‌ ఇంటికి వెళ్తుంటే.. రుద్రాణి పంపిన రౌడీలు యాక్సిడెంట్‌ చేస్తారు. వెంటనే రుద్రాణికి ఫోన్‌ చేసి యాక్సిడెంట్‌ చేసి అప్పు, కళ్యాణ్ లను చంపేశామని చెప్తారు. దీంతో రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi serial today march 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కేసులో ఇరుక్కుపోయిన లక్ష్మీ! ఎస్‌ఐని చితక్కొట్టి తప్పు చేసిందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కేసులో ఇరుక్కుపోయిన లక్ష్మీ! ఎస్‌ఐని చితక్కొట్టి తప్పు చేసిందా!
Brahmamudi Serial Today march 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును కొట్టిన రేఖ – సుభాష్ ను తోసేసిన భూషణ్‌ 
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును కొట్టిన రేఖ – సుభాష్ ను తోసేసిన భూషణ్‌ 
Nindu Noorella Saavasam Serial Today march 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: తీవ్రవాదులను చూసి భయపడ్డ భాగీ – అయోమయంలో మేజర్‌
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: తీవ్రవాదులను చూసి భయపడ్డ భాగీ – అయోమయంలో మేజర్‌
Nindu Manasulu Serial Today March 5th: నిండు మనసులు: ప్రేరణ తండ్రి మిస్సింగ్.. రచ్చ చేసిన గణ! సిద్ధూని హగ్ చేసుకున్న ప్రేరణ!
నిండు మనసులు: ప్రేరణ తండ్రి మిస్సింగ్.. రచ్చ చేసిన గణ! సిద్ధూని హగ్ చేసుకున్న ప్రేరణ!
Advertisement

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Embed widget