Brahmamudi Serial Today Episode: ఇందిరాదేవి తాను ఓ నిర్ణయం తీసుకున్నానని ఇల్లు ముక్కలు అవ్వకుండా ఉండాలంటే రాహుల్‌, రుద్రాణి బయటకు వెళ్లిపోవాలని చెప్తుంది. అందరూ సపోర్టు చేస్తారు. ఆస్థిలో వాటా ఇస్తే తీసుకుని వెళ్తానని రుద్రాణి అంటుంది. చిల్లిగవ్వ కూడా ఇచ్చేది లేదని బయటకు వెళ్లిపోమ్మని సీతారామయ్య చెప్తాడు. రుద్రాణి వెంటనే సీతారామయ్య కాళ్లు పట్టుకుని ఏడుస్తుంది.

రుద్రాణి: నాన్నా.. ఇన్నాళ్లు మా వల్లే ఇంట్లో గొడవలు అవుతున్నాయంటే.. ఏమో అనుకున్నాను కానీ ఇవాళ అర్థం  అయింది. మేము బయటకు వెళ్లి బతకలేము . కనీసం నా కోడలు, దానికి పుట్టిన బిడ్డ ముఖం చూసైనా ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు నాన్నా

స్వప్న: మా గురించి నువ్వేం కంగారుపడొద్దు అత్త.. తాతయ్య గెట్‌ అవుట్‌ అంది మిమ్మల్ని మీ కొడుకును నన్ను కాదు. నేను  నా బిడ్డ తాతయ్య ఇచ్చిన ఆస్థితో ప్రశాంతంగా జీవితాంతం బతుకుతాం. నేను నా చెల్లెల్లతో కలిసి  ఈ ఇంట్లోనే ఉంటాను. తాతయ్య ఇది నటన నమ్మకండి మళ్లీ మోసపోకండి

రుద్రాణి: నాన్నా అందరూ ఒకటయ్యారు. నేను, నా కొడుకే మీకు బరువు అనుకుంటే చెప్పండి ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాము.

స్వప్న: గోతులు తవ్వే మీకు నూతులు ఎక్కడ దొరుకుతాయి అత్తయ్యా ఇప్పుడు అన్ని బోర్‌వెల్స్‌ కదా..? మీకు ఆ అవకాశం లేదు

రుద్రాణి: నాన్నా ఇక నుంచి ఈ ఇంట్లో జరిగే వాటితో మాకు సంబంధం లేనట్టే ఉంటాం.. దయచేసి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి నాన్నా.. లేకపోతే దిక్కులేని పక్షులం అయిపోతాం నాన్నా

స్వప్న:  ఏటత్తా ఇందాక జన్మలో ఏడ్వను అన్నాను ఇప్పుడేమో అలా ఏడుస్తున్నావు.

కావ్య: అక్కా నువ్వు ఉండు నీకు రాహుల్‌తో ఎలాంటి సుఖం, సంతోషం లేకపోయినా.. నీ బిడ్డకు తండ్రి కావాలి. అందుకే నువ్వు రాహుల్‌తో కలిసి ఉండాలి.

స్వప్న: అయితే మా అత్తను పంపించేయండి.. మా అత్త లేకపోతే రాహుల్‌ బుద్దిగానే ఉంటాడు.

కావ్య:  తాతయ్య మీ ఈ నిర్ణయం వల్ల అందరం ప్రశాంతంగా ఉంటావేమో కానీ ఆ బిడ్డకు అన్యాయం జరుగుతుంది. ఆ తర్వాత నిర్ణయం మీదే తాతయ్య

కావ్య మాటలకు కన్వీన్స్‌ అయిన సీతారామయ్య, ఇందిరాదేవి.. రుద్రాణిని ఇదొక్కసారి క్షమిస్తున్నాం.. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోతారు. తర్వాత రూంలోకి వెళ్లిన రుద్రాణి కోపంగా అన్ని పగులగొడుతుంటే.. రాహుల్‌ వస్తాడు

రాహుల్: మమ్మీ మీ నాన్న గురించి తాతయ్య అంత గొప్పగా ఫీలవుతున్నాడు కదా..? మీ వెనక ఏదైనా గొప్ప ఫ్లాష్‌బ్యాక్‌ ఉందా..

స్వప్న వస్తుంది.

స్వప్న: బాషా లాంటి గొప్ప ప్లాష్‌బ్యాక్‌ ఏం లేదులే.. చెప్పుకోవడానికి సిగ్గు పడేంత చెండాలమైన స్టోరీ. జనాలు చీ కొట్టేంత దరిద్రమైన స్టోరీ ఉండొచ్చు.

రుద్రాణి: ఏయ్‌  ఎక్కు వ మాట్లాడావంటే చెంప పగులుద్ది

స్వప్న:  చాల్లే ఊరుకో అత్తా నీ ప్రతాపం నాలుగు గోడల మధ్యే అని తెలుసు. నాకో నిజం చెప్పు అత్తా.. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు.. మీ నాన్న పేరు చెప్పుకుని ఇక్కడ సెటిల్‌ అయిపోతున్నావు..  బహుశా నీది మీ అమ్మ పోలిక అనుకుంటా.. మీ అమ్మ నిన్ను మించిన కంచు అనుకుంటా..?  

రుద్రాణి: ఏయ్‌ ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ గురించి మాట్లాడుతున్నావు

స్వప్న:  నువ్వు ఇలాగే ఉంటే మీ అమ్మ ఏంటి వాళ్ల అమ్మ గురించి కూడా ఇలాగే మాట్లాడుకుంటారు జనాలు.. నువ్వేంటి అలా చూస్తున్నావు.. నువ్వు ఇలాగే ఉంటే ఇవాళ మీ అమ్మ కాళ్లు పట్టుకున్నట్టు.. రేపో మాపో నీ చేత అందరి కాళ్లు పట్టిస్తుంది.

అంటూ రాహుల్‌కు చెప్పి వెళ్లిపోతుంది. రుద్రాణి కోప్పడుతుంటే.. మమ్మీ దాని గురించి వదిలేయ్‌ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అడుగుతాడు రాహుల్‌. అదే ఆలోచిస్తున్నాను. ఇన్నాళ్లు ఆస్థిలో వాటా కోసం ప్రయత్నించాను. ఇక ఆస్థి మొత్తం వచ్చేలా ప్లాన్‌ చేస్తాను అని చెప్తుంది రుద్రాణి. తర్వాత ధాన్యలక్ష్మీ వెళ్లి అప్పు, కళ్యాణ్‌లను అవమానిస్తుంది. పెళ్లాన్ని పోలీస్‌ ను చేశాను. అత్తను అందలం ఎక్కించానని అనుకుంటే నువ్వెప్పుడు బంటుగానే మిగిలిపోతావు అని వెళ్లిపోతుంది. అప్పు బాధపడుతుంది. కావ్య వచ్చి ఓదారుస్తుంది.

  ముందు రైటర్‌ లక్ష్మీ పని పట్టాలని చెప్తుంది. అప్పు సరే అంటుంది. మరోవైపు సామంత్‌ అనామికను కొట్టి నీ వల్లే కోట్లు నష్టపోయాను. ఇక నిన్ను నమ్మను గుడ్‌బై అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు రూంలో కావ్య పండ్లు సర్దుతుంటే.. రాజ్‌ వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఒక్క నెలలో నేను నెల తప్పాలి అంటుంది. అందుకే ఈ పండ్లు అని చెప్తుంది కావ్య. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!