Brahmamudi Serial Today Episode: పోలీసులు ఇచ్చిన లోకేషన్‌కు వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు. దీంతో కావ్య కావాలనే మనల్ని తప్పుదారి పట్టించారు అని చెప్తుంది. వీడియో మరోసారి చూస్తుంది. అందులో కనిపిస్తున్న సెల్ నెంబర్‌కు ఫోన్‌ చేసి లోకేషన్‌ పెట్టించుకుని అక్కడకి వెళ్తారు. మరోవైపు అప్పుకు డెలివరీ ఫెయిన్స్‌ మొదలవుతాయి.

Continues below advertisement

కళ్యాణ్‌: ఫ్లీజ్‌ మీకేం కావాలో చెప్పండి. మీరు కోరినంత డబ్బు ఇస్తాను. మా ఆవిడకు ఫెయిన్స్‌ వస్తున్నాయి. హాస్పిటల్‌కు తీసుకెళ్తాను నా కట్లు విప్పండి..

రౌడీ: ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదలొద్దు అని చెప్పారు మా బాస్‌.. ఆయన చెప్పింది చేయకపోతే మేము డేంజర్‌లో పడతాం.

Continues below advertisement

కళ్యాణ్‌: చూడండి మీరు చెప్తున్నట్టు మా అన్నయ్య అలాంటి వాడు కారు.. మీరు కావాలని మా అన్నయ్య మీద అబాంఢాలు వేస్తున్నారు. అసలు మీ వెనక ఎవరున్నారు..?

రౌడీ: ఏయ్ సైలెంట్‌గా ఉండు..

అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడే అక్కడికి రాజ్‌, కావ్య వస్తారు. లోపల ఫెయిన్స్‌తో బాధపడుతున్న అప్పును కిటికీలోంచి చూసి బాధపడుతుంది కావ్య. రౌడీల నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లి కళ్యాణ్‌, అప్పుల  కట్లు విప్పుతుంటారు రాజ్‌, కావ్య. అప్పుడే రౌడీలు లోపలికి వస్తారు. రాజ్‌ వారితో ఫైట్‌ చేస్తుంటాడు. కావ్య కట్లు విప్పి కళ్యాణ్‌, అప్పులను తీసుకుని పారిపోతుంది. ఒక రౌడీ రాజ్‌ను వెనక నుంచి బలంగా కొట్టడంతో కింద పడిపోతాడు. కళ్యాణ్‌, అప్పు, కావ్య అక్కడి నుంచి పారిపోయి ఉంటారు. రౌడీలు రుద్రాణికి ఫోన్‌ చేస్తారు.

రౌడీ: మేడం.. వాళ్లిద్దరూ తప్పించుకున్నారు..

రుద్రాణి: ఏయ్‌ ఏమ్‌ మాట్లాడుతున్నావు.. తప్పించుకోవడం ఏంటి..?

రౌడీ:  మేము పట్టుకోవడానికి చాలా ట్రై చేశాం కానీ వాళ్లు పారిపోయారు.

రుద్రాణి: ఒక్కొక్కడు ఎద్దుల్లా ఉన్నారు.. ఇద్దరినీ కాపలా కాయలేకపోయారా…? చేత కాని దద్దమ్మల్లా వాళ్లను విడిచిపెట్టి నాకు ఫోన్‌ చేస్తారా..? మీరేం చేస్తారో నాకు తెలియదు.. వాళ్లు తప్పించుకోకూడదు. వాళ్లు కనుక ఎస్కేప్ అయితే నేను దొరికిపోతాను, కాబట్టి వాళ్లని ఎలాగైనా పట్టుకోండి లేదంటే.. దొరికని చోటే చంపేయండి. లేదంటే మిమ్మల్ని నేను చంపేయాల్సి వస్తుంది

అంటూ రుద్రాణి తిట్టడంతో రౌడీలు కోపంగా వెళ్లి పరుగెడుతున్న అప్పు, కళ్యాణ్‌లను పట్టుకుంటారు. ఒక రౌడీ అప్పును కత్తితో పొడవబోతుంటే.. రాజ్‌ వచ్చి సేవ్‌ చేస్తాడు. అప్పుడే కావ్య కారు తీసుకుని వచ్చి అప్పును హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది. తర్వాత రాజ్‌, కళ్యాణ్‌ హాస్పిటల్‌కు వస్తారు. అప్పుడే దుగ్గిరాల ఫ్యామిలీ వస్తుంది. అప్పుకు ఎలా ఉందని ధాన్యలక్ష్మీ బాధపడుతుంటే కావ్య ఓదారుస్తుంది.

ధాన్యం: నువ్వు మాట్లాడొద్దు.. చేసిందంతా చేసి ఇప్పుడు సర్ది చెబుతున్నావా? ఎందుకు ఇదంతా? మీకు వాళ్లు ఏం ద్రోహం చేశారని ఈ కక్ష. మీరే నా కొడుకు కోడల్ని కిడ్నాప్ చేస్తారు.. మళ్లీ మీరే గొప్ప వాళ్లలా హాస్పిటల్‌లో చేరుస్తారు. మీ నాటకాలు మాకు తెలియవా?

కళ్యాణ్‌: అన్నయ్య వదిన మమ్మల్ని కిడ్నాప్ చేయడం ఏంటి అమ్మ

ధాన్యలక్ష్మీ: ఆస్తిలో నీ వాటా నీకు పంచివ్వాల్సి వస్తుందని.. మీ ఇద్దరినీ వీళ్లే కిడ్నాప్ చేయించారు

కళ్యాణ్: నువ్వు ఎవరిని తప్పుబడుతున్నావో? ఎవరి మీద నిందలు వేస్తున్నావో నీకు అర్ధం అవుతుందా? అన్నయ్య, వదినలని మాట అనే ముందు కాస్త వెనుక ముందు ఆలోచించు అమ్మ.. అన్నయ్య, వదినలు కిడ్నాప్ ఎందుకు చేస్తారు. ఎవరో కావాలని చేశారు.. మాకు ఏమి అర్ధం కాలేదు. ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు, డబ్బు వద్దంటారు.. కారణం చెప్పమంటే చెప్పరు. తప్పించుకునే వీలు లేదు.. అప్పూకి నొప్పులు మొదలయ్యాయి, అలాంటి టైంలో అన్నయ్య, వదిన ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడారు.

ధాన్యలక్ష్మీ:  మీరు కిడ్నాప్ అయినట్లు వీడియో పంపారు.. అందులో రాజ్ మిమ్మల్ని కిడ్నాప్ చేశారని చెప్పారు కదా

కళ్యాణ్: అన్నయ్యే మమ్మల్ని కిడ్నాప్ చేయించాడని రౌడీలు మాట్లాడుకుంటుంటే మేం విన్నాం. అది ఎవరో చేసిన కుట్ర

అని కళ్యాణ్‌ చెప్పగానే అందరూ ధాన్యలక్ష్మీని తిడతారు. ధాన్యలక్ష్మీ నిజం అర్థం అయిందంటూ అందరికీ సారీ చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!