Brahmamudi Serial Today Episode: ఆస్థి విషయంలో గొడవ చేస్తున్న ధాన్యలక్ష్మీ కోసం రాజ్‌, కావ్య సగం ఆస్థి కళ్యాణ్‌ పేరు మీద రాయించి డాక్యుమెంట్స్‌ తీసుకొచ్చి ధాన్యలక్ష్మీ చేతిలో పెడతారు. అయినా ధాన్యలక్ష్మీ కోపం తగ్గదు.

Continues below advertisement

కావ్య: చూడండి చిన్నత్తయ్యా.. ట్రస్ట్ అన్నది తాతగారి కల, ఈ ఇంటి వారసుడిగా నా భర్త, ఈ ఇంటి కోడలిగా నేను ఉన్నందుకు ఆ పెద్దమనిషి కోరిక తీర్చనివ్వండి. ఈ ట్రస్ట్ ఆగిపోకూడదు, భవిష్యత్‌లో మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా.. దుగ్గిరాల ఇంటిపేరు శాశ్వతంగా నిలిచిపోవాలని మా తాపత్రయం.

రాజ్: ఇన్నేళ్లుగా మనమంటూ పెద్దగా ఎవరికీ ఏం చేయలేదు, అందుకే ఎంత కష్టపడైనా సరే ఈ ట్రస్ట్ పెట్టాలని అనుకుంటున్నాం.. ఉమ్మడి ఆస్తిని దానం చేయాలనో, మా ఆస్తిని కాపాడుకోవాలనో, కళ్యాణ్‌కు అన్యాయం చేయాలనో అనుకోవడం లేదు

Continues below advertisement

ధాన్యలక్ష్మీ: ఇక మీ నాటకాలు ఆపండి.. నటించడం మీ ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. అందుకే ట్రస్ట్ అన్నారు, పేరు అన్నారు.. ఇప్పుడు నా కొడుకు మీద ఆస్తి రాసిచ్చినట్లు నటించి నా కడుపు మీద తన్నారు.

రాజ్‌: ఏం మాట్లాడుతున్నావు పిన్ని.. నువ్వు కోరుకున్నట్లే చేశాం కదా ఎందుకు మమ్మల్ని తిడుతున్నావు

ధాన్యలక్ష్మీ: మీరు ఆస్తి ఇవ్వడం ఇష్టం లేక.. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలేక ఇక్కడ ఆస్తి కాగితాలు నా చేతిలో పెడుతూ.. అక్కడ నా కొడుకు, కోడలి జీవితాలు నాశనం చేయాలని అనుకుంటున్నారా..?

అందరూ షాక్‌ అవుతారు.

ఇందిరాదేవి: ధాన్యలక్ష్మీ ఏం మాట్లాడుతున్నావు.. అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా..?

ధాన్యలక్ష్మీ: నేను మతి ఉండే మాట్లాడుతున్నాను అత్తయ్యా.. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే మతి పోతుంది. అక్కా నీ కొడుకు కోడలు ఎంత ఘనకార్యం చేశారో మీరూ చూసి తరించండి

కళ్యాణ్‌, అప్పు కిడ్నాప్‌ వీడియో చూపిస్తుంది. అందులో రౌడీలు అప్పు, కళ్యాణ్‌ లను కిడ్నాప్‌ చేసి బంధించి ఉంటారు. అది చూడగానే అందరూ షాక్‌ అవుతారు. అప్పుడే వీడియోలో  రౌడీలు అప్పు, కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని.. రాజ్‌ సార్‌ వార్నింగ్ ఇచ్చారని మాట్లాడుకుంటారు.

ధాన్యలక్ష్మీ: ఆస్తిని ఎక్కడ పంచి ఇవ్వాల్సి వస్తుందోనని నా కొడుకు, కోడల్ని మీరిద్దరూ కిడ్నాప్ చేశారు. మీరు అనుకున్నది సాధించడానికి నేను అడ్డుపడుతున్నానని.. ఎవరి భవిష్యత్ కోసమైతే నేను పోరాడుతున్నానో వాళ్లనే లేకుండా చేస్తే మీకు ఏ సమస్య లేకుండా ఉంటుందని ఇంతకి తెగించారు.

కావ్య, రాజ్‌ షాక్‌ అవుతారు.

రాజ్‌: ఇదంతా అబద్దం మేము కిడ్నాప్‌ చేయడం ఏంటి పిన్ని

కావ్య: అప్పూ నా చెల్లెలు, కళ్యాణ్ నా భర్తకు తమ్ముడు.. అలాంటిది మేం వాళ్లని కిడ్నాప్ చేస్తామా?

ధాన్యలక్ష్మీ: ఇదంతా మీరు పథకం ప్రకారమే చేశారు.. అందుకే ఆస్తి పేపర్లు చేతిలో పెట్టే టైంకి ఈ వీడియో నాకు పంపించేలా చేశారు

రాజ్‌: దేవుడు మీద ప్రమాణం చేసి చెబుతున్నాం దీనికి మాకు ఏ సంబంధం లేదు

ధాన్యలక్ష్మీ: మీకు, ఈ కిడ్నాప్‌కు ఏ సంబంధం లేకపోతే.. ఆ వీడియోలో రౌడీలు మీ పేరు ఎందుకు చెబుతారు? ఈ వీడియో ఎవరో తీశారు? ఇంకెవరో కిడ్నాప్ చేశారో? అనుకుంటే? మాకు కానీ, కళ్యాణ్‌కి కానీ శత్రువులు లేరు. ఎవరికి ఇంతటి అవసరం లేదు.. పోనీ డబ్బు కోసమే కిడ్నాప్ చేశారనుకుంటే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయకుండా వీడియో ఎందుకు పంపిస్తారు.

అపర్ణ: నీ ఆవేశంతో, అవివేకంతో నా కొడుకు వ్యక్తిత్వాన్ని చంపాలని చూడొద్దు ధాన్యలక్ష్మీ.  ఇన్నాళ్లుగా చూస్తున్నావు.. నా కొడుకు, నా కోడలు ఎలాంటి వారో తెలిసి కూడా వాళ్ల మీద నిందలు వేస్తున్నావు

ధాన్యలక్ష్మీ: ఈ సాక్ష్యాలు చూసి కూడా ఇంకా ఎందుకు గొంతెత్తున్నావు.. ఆస్తి కోసం నీ కొడుకు ఎంతకు తెగించాడో చూడు నన్ను భయపెట్టడానికి ఇంతలా దిగజారారు

అంటూ ధాన్యలక్ష్మీ కోప్పడుతుంటే.. కావ్య మరింత కోపంగా ధాన్యలక్ష్మీ గారు ఈ పని ఎవరు చేశారో మాకు తెలియదు.. కానీ మీరు నింద వేసినందుకైనా వాళ్లిద్దరిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది అంటుంది. రాజ్‌ కూడా వాళ్లను ఇంటికి తీసుకుని వచ్చాకే మేము ఇంట్లో అడుగుపెడతాం అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!